cartoon networks
-
కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే?
ఎనిమిదేళ్ల సారా స్కూల్ నుంచి∙రాగానే హోమ్‌వర్క్ పూర్తిచేసి కార్టూన్లు చూస్తూ కూర్చుంటుంది. చూస్తున్నది కార్టూన్లే కదా అని తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పలేదు. కానీ క్రమేణా సారా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఏదడిగినా మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇస్తోంది. లేదా ఎగతాళి చేస్తోంది. సరిచేయాలని పేరెంట్స్ ఎంత ప్రయత్నించినా అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. పిల్లలు దేన్నయినా సరే చూసి, గమనించి నేర్చుకుంటారు. కానీ సారా వాళ్లింట్లో అలా దుడుకుగా సమాధానం చెప్పేవారు ఎవ్వరూ లేరు. అయినా ఆ పాపకు అలాంటి ప్రవర్తన ఎలా అలవాటైందో తెలుసుకోవడానికి తనతో మాట్లాడాను. తాను చూస్తున్న కార్టూన్ సిరీస్‌ల నుంచే అలా మాట్లాడటం నేర్చుకుందని అర్థమైంది. కార్టూన్లన్నీ మంచివేం కావు.. టీవీలో వచ్చే కార్టూన్లన్నీ మంచివేం కావు. కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అవి పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు.. మనకు దయ్యం, భూతం, రాక్షసులు అనే భావనలు ఎప్పుడు పరిచయమయ్యాయి? చిన్నప్పుడు చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్రలాంటి పుస్తకాల్లోంచే కదా! అలాంటి కథలు చదవడం ద్వారా దయ్యాలు, భూతాలు ఉన్నాయని మనం అనుకున్నట్లే, పిల్లలూ ఈనాటి కార్టూన్ సిరీస్‌లు చూసి సూపర్ మన్లు, సూపర్ పవర్స్‌ని నమ్ముతుంటారు. కొన్ని కార్టూన్లు హింస, చవకబారు హాస్యం లేదా పిల్లలను గందరగోళానికి గురిచేసే పద్ధతుల్లో ఉంటాయి. కార్టూన్లలో చిత్రీకరించే అతిశయోక్తి చర్యలు, పరిస్థితులు పిల్లల్లో అవాస్తవిక అంచనాలను క్రియేట్ చేయొచ్చు. గతంలో శక్తిమాన్ సిరీస్ ప్రసారమైనప్పుడు శక్తిమాన్‌లా దూకి పిల్లలు గాయాలపాలైన విషయం గుర్తుచేసుకోండి. అంతెందుకు మనకు విపరీతంగా నవ్వు తెప్పించే టామ్ అండ్ జెర్రీ సిరీస్‌లో విపరీతమైన హింస దాగి ఉంది. ఎక్కువసేపు కార్టూన్లు చూడటం.. శ్రద్ధ, నిద్రలను దెబ్బతీస్తుంది. వ్యాయామానికి దూరంచేసి శారీరక సమస్యలకు దారి తీస్తుంది. కార్టూన్లు వినోదం మాత్రమే కాదు.. కార్టూన్లు రంగురంగుల విజువల్స్, ఆకట్టుకునే పాటలు, పాత్రలతో పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. పిల్లలు కార్టూన్లు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా పెద్దగా అడ్డుచెప్పరు. కానీ కార్టూన్లు కేవలం వినోదం మాత్రమే కాదు. అంతకు మించి. వాటి నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవి వాళ్ల మనస్సులపై చెరగని ముద్ర వేయవచ్చు. అందుకే పిల్లలు ఎలాంటి కార్టూన్లు చూస్తున్నారనే విషయం గమనించడం తప్పనిసరి. ఎడ్యుకేషన్ కార్టూన్లు కొత్త భావనలను పరిచయం చేస్తాయి, ప్రపంచం గురించి ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అభిజ్ఞా వికాసానికి (cognitive development) తోడ్పడతాయి. స్నేహం, భయం లేదా నష్టం వంటి భావోద్వేగాలతో పోరాడే పాత్రలు పిల్లలకు వారి స్వంత భావాలను అన్వేషించడానికి దారి చూపిస్తాయి. అలాగే వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను పెంచుకోవడానికి దోహదపడతాయి. అనేక కార్టూన్లు దయ, నిజాయితీ, పట్టుదల వంటి ఇతివృత్తాలను నొక్కిచెప్తాయి. పిల్లల నైతిక దిక్సూచిని, సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. పేరెంట్స్ చేయాల్సింది.. పిల్లలతో కలసి కార్టూన్లు చూడండి. అవి వారి వయసుకు, మీ కుటుంబ విలువలకు తగినవైతేనే అనుమతించండి. వాటిలో పాత్రల గురించి, అవి అందించిన సందేశాల గురించి మాట్లాడండి. విభిన్న నేపథ్యాల నుంచి పాత్రలతో కూడిన కార్టూన్లను పరిచయం చేయండి. తద్వారా భిన్నాభిప్రాయాలను కలుపుకొని పోవడం అలవాటవుతుంది. ఆడుకోవడం, చదవడం లేదా ఆరుబయట సమయం గడపడం వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలతో స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి. గుర్తుంచుకోండి.. ఓపెన్ కమ్యూనికేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ కీలకం. పిల్లలు చూడకూడని కార్టూన్ సిరీస్‌లు.. ది సింప్సన్స్: ఇది ఎలాంటి హాని చేయని కార్టూన్‌గా కనిపించినప్పటికీ చిన్నపిల్లలకు తగినది కాదు. ఇందులో సంక్లిష్టమైన, క్రూరమైన, అభ్యంతరకరమైన అంశాలుంటాయి. హ్యాపీ ట్రీ ఫ్రెండ్స్: అందంగా కనిపించినప్పటికీ, నిజానికి చాలా హింసాత్మకమైన, కలవరపెట్టే కార్టూన్. ఇది ఏ వయసు పిల్లలకైనా తగినది కాదు. రిక్ అండ్ మోర్టీ: ఈ సిరీస్ ఒక శాస్త్రవేత్త, అతని అమాయక మనవడి చుట్టూ తిరుగుతుంది. దీంట్లో అడల్ట్ జోక్స్, హింస ఉంటాయి. విలువలన్నీ శూన్యమనే భావన నిండి ఉంటుంది. బిగ్ మౌత్: ఇది టీనేజ్ పిల్లల గురించి! అయితే ఆ వయసులో వచ్చే ఇబ్బంది కరమైన, అసౌకర్యమైన అంశాలన్నిటినీ చూపిస్తుంది. ఇది పెద్దలకు ఉల్లాసంగా ఉంటుంది. కానీ టీనేజర్లకు తగినది కాదు. హ్యూమన్ రిసోర్సెస్: ఇందులో హార్మోన్ మాన్స్టర్స్, యాంగ్జయిటీ దోమలు, లవ్ బగ్స్ వంటి ఊహాత్మక జీవులు ఉంటాయి. కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. పిల్లలకు అనువైనది కాదు. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
వేరే పార్టీలోకి జంపయ్.. టికెట్ పట్టేయ్..!
ఇదే పార్టీలో ఉంటే ఎప్పటికీ టికెట్ రాదనే.. వేరే పార్టీలోకి జంపయ్.. మళ్లీ ఈ పార్టీలోకి మారితే టికెటిచ్చారు! -
ప్రగతిని పరుగులు పెట్టిస్తాం!
కర్ణాటకలో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం- ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు! -
భారత్‌లో ఇకపై ఆ రెండు ప్రముఖ ఛానెళ్లు బంద్!
వాషింగ్టన్: మీకు ఇంగ్లీష్ సినిమాలు చూడటమంటే పిచ్చా? ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ చూస్తూ ఉంటారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్ ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. చదవండి: ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్ -
థియేటర్ ఫన్‌డుగ
పిల్లలు... స్మార్ట్‌ఫోన్స్, కార్టూన్ నెట్వర్క్స్, వీడియోగేమ్స్‌కు అతుక్కుపోయిన కాలం ఇది. అడపాదడపా సినిమాలూ ఉండనే ఉన్నాయి. ఈ రెగ్యులర్ యాక్టివిటీస్‌కి దూరంగా పిల్లలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది అస్సితేజ్ ఇండియా. చిన్నారులను నాటకాలవైపు ఆకర్షించే లక్ష్యంతో హైదరాబాద్‌లో రెండో అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ ఫర్ యంగ్ ఆడియన్స్ నిర్వహిస్తున్నది. మంగళవారం ప్రారంభమైన ఈ నాటకోత్సవం మూడురోజులపాటు పిల్లలకు పండుగ చేయనుంది! ..:: కోన సుధాకర్‌రెడ్డి అస్సితేజ్... 1965లో చిన్నారుల కోసం ఏర్పాటైన ఇంటర్నేషనల్ థియేటర్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువత కోసం నాటకాలను ప్రదర్శిస్తున్న సంస్థలు, వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేస్తున్న సంస్థ. పిల్లల ప్రపంచం పిల్లలకు ఉంటుంది. వారిని భాగస్వామ్యం చేస్తూ థియేటర్స్ గేమ్స్, కొరియోగ్రఫీ, కథలు చెప్పటం, ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ నాటకాలు ప్రదర్శిస్తారు. ఇవన్నీ పూర్తిగా పిల్లల స్థాయిలోనే, వారికి అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి. వారిలో కళాత్మకతను, మానవత్వాన్ని, విద్యా విలువలను పెంపొందిస్తాయి. రూపొందించింది పిల్లల కోసమే అయినా.. నాటకాలు ప్రదర్శించేది పెద్ద ఆర్టిస్టులే. ఏకకాలంలో... 2004నుంచి భారత్ అస్సితేజ్లో భాగస్వామి అయింది. భారత్‌కు చెందిన ఏడు బృందాలు ఇందులో పనిచేస్తున్నాయి. ఈ పదేళ్లలో అనేక సెమినార్లు, ఉత్సవాలను నిర్వహించిందీ సంస్థ. హెచ్‌సీయూ కేంద్రంగా... చిన్నపిల్లల నాటకాలపై వర్క్ జరుగుతోంది. చిల్డ్రన్స్ డే రోజున కూడా జరిగిన ఫెస్టివల్లో మూడు నాటకాలు ప్రదర్శించారు. ఫిబ్రవరి 1న దిల్లీలో నాటకోత్సవం ప్రారంభమైంది. ఏకకాలంలో దిల్లీ, హైదరాబాద్ నగరాల్లో థియేటర్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగరంలోనే ప్రధానమైన థియేటర్ ఫెస్టివల్ నిర్వహించాలని భావిస్తోంది అస్సితేజ్. ఇందులో 12 నాటకాలను ప్రదర్శించనున్నారు. కంటెంట్ ఉంటే కచ్చితంగా... ‘పిల్లల కోసం నాటకాలు వేయడం ఒక ఛాలెంజ్. అందులో తృప్తి ఉంది. భవిష్యత్‌లో పిల్లలకు థియేటర్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సినిమాలు ఓకే కానీ... నాటకాలు పిల్లలు చూస్తారా? అన్న సందేహం ఉంది. కథలో కంటెంట్ ఉంటే.. పిల్లలు కచ్చితంగా వస్తారు. వాళ్లు రావడమే కాదు తల్లిదండ్రులనూ తీసుకొస్తారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది’ అని అస్సితేజ్ ఇండియా సెక్రటరీ గరికపాటి ఉదయభాను అంటున్నారు. ఈరోజు ‘స్పాట్’... స్పాట్.. . 40 నిమిషాల నిడివి ఉన్న ఇటలీ ప్లే ఇది. కలర్ లైట్స్‌తో నేలపై విభిన్న ఆకారాలను సృష్టిస్తూ, పిల్లలకు వింత అనుభూతి కలిగిస్తూ సాగే ఈ నాటకాన్ని ఇద్దరు ఆర్టిస్టులు ప్రదర్శిస్తారు. నాటకం ఇంగ్లిష్‌లో ఉంటుంది. విద్యారణ్య స్కూల్‌తోపాటు, పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోనూ ప్రద ర్శించనున్నారు. విద్యార్థుల కోసం ఉదయం 9.30 నిమిషాలకు, 11.30కి ప్రదర్శితమవుతుంది. సాయంత్రం ఏడుగంటలకు పబ్లిక్ షో. పిల్లలతోపాటు పెద్దలకూ ప్రవేశం ఉంటుంది.