ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కరోనా లాగా ఒకరికి ఒకరం అంటుకు పోదామా!, చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఒకరికొకరం చేతులు గట్టిగా పట్టుకోవచ్చు!, మాస్కులతో ముద్దూ ముచ్చట తీరెదెలా....!’ ఇవన్నీ డేటింగ్ యాప్ ‘టిండర్’లో కనిపించిన భారతీయ యువతీ యువకుల కబుర్లు. కొందరు ముదురులు మాస్కులు తీసి మాట్లాడుకున్నారు. అయితే వారు కూడా దొంగ మాస్కులు వేసుకున్నారు. ‘లెట్స్ హావ్ నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్’ అనాల్సి చోట ‘లెట్స్ హావ్ క్వారంటైన్ అండ్ చిల్’ అన్నారు. అంటే లైంగికానుభవం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొందరు మర్యాదస్తులు మాస్క్ ఎమోజీలను కూడా బాగానే వాడుకున్నారు. గత ఏడాది నవంబర్ నెల నుంచే ‘టిండర్’కు భారతీయుల డిమాండ్ పెరిగినప్పటికీ ఆది ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి కరోనా వైరస్‌లాగా బాగా విస్తరించింది.
ఇక టిండర్ ప్రధానంగా జంటలు వెతుక్కోవడానికి, వారి మధ్య డేటింగ్ కోసం ఏర్పాటు చేసినప్పటికీ భారతీయ యువతీ యువకులు సామాజిక దూరాలతో విసిగెత్తినట్లున్నారు, కబుర్ల కోసం, కొత్త పరిచయాల కోసం ఎక్కువగా ఉపయోగించుకున్నారు. కొందరు ‘బోర్డ్ ఇన్ ది హౌస్’ అని టిక్‌టాక్ ఫేమస్ పాటను, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరడీ పాట ‘రసోడ్ మే కౌన్ థా’ వీడియో, ప్రతీక్ కుహద్ పాటిన ‘కసూర్’ పాటలతో కొందరు యువతీ యువకులు ఒకరి కొకరు పరిచయాలు చేసుకోగా, మరికొందరు ‘బాబా కా డాబా’లో కలసుకుందామా! పరిచయాలను పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ శివారులో కాంటా ప్రసాద్, బడామి దేవి అనే వృద్ధ దంపతులు పెట్టిన ‘బాబా కా డాబా’ సోషల్ మీడియా ద్వారా ఇటీవల బాగా పాపులర్ అయింది. మరి కొందరు బనానా బ్రెడ్, దాల్గొన కాఫీ అంటూ కోడ్ భాషలో మాట్లాడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment