టెక్నాలజీ! రెండంచుల కత్తి అనేది నూటికి నూరుపాళ్లు నిజం. సవ్యంగా వాడుకోవడం తెలియాలే కానీ అద్భుతాలు చేయోచ్చు. అదే సమయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటే 'కథ వేరేలా ఉంటుంది'. డేటింగ్ యాప్స్ కూడా అంతే! మీటింగ్, డేటింగ్, సింగిల్, మింగిల్ అని మొదలై రియలైజ్ అయ్యేలోపు వీలైనంత సొమ్ము చేసుకుంటాయి. అలా ఓ యువకుడు 'టిండర్' యాప్‌లో 'జెన్నీ'తో చాట్ చేశాడు. చివరికి తాను జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు.
నిజానికి ట్విట్టర్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా నెట్ వర్క్‌లు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్నవారిని కూడా ఫ్రెండ్స్‌గా మార్చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ సోషల్ మీడియాతో పెద్ద మజా ఏముంది. నచ్చితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. మాట్లాడుతారు. స్నేహితుల్లా కనెక్ట్ అవుతారు. అంతకు మించి ఉండే ఛాన్స్ తక్కువ. ఈ పాయింట్‌తోనే కొత్త కొత్త డేటింగ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన టిండర్ యాప్‌లో అమెరికాకు చెందిన మైక్ చాట్ చేసి జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము రూ.20లక్షలు పోగొట్టుకున్నాడు.
అమెరికాకు చెందిన మైక్ సరదాగా గడిపేందుకు టిండర్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అంతే అలా లాగిన్ అయ్యాడో లేదో..వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు..'హలో కమాన్ మైక్ మీరు సింగిలా, అయితే మింగిల్ అవ్వండి' అంటూ మెసేజ్ చేసిన జెన్నీకి అడ్డంగా దొరికి పోయాడు. తాను మలేషియాకు చెందిన జెన్నీ'ని అంటూ ఓ యువతి మైక్‌ను పరిచయం చేసుకుంది. ఆ టిండర్ యాప్ పరిచయం వాట్సాప్‌కు మారింది. నిమిషాలు, గంటలు కాస్తా రోజులయ్యాయి. పలకరింపులు మారిపోయాయి. ఎంతలా అంటే పేరు ఊరు తెలియకుండానే బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టేంతలా.
వాస్తవానికి మైక్‌కు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదు. కానీ జెన్నీ "మైక్ మా మామయ్య ఎంఎన్‌సీ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌లో పనిచేస్తున్నాడు. బిట్ కాయిన్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలో సలహా ఇవ్వడంలో దిట్ట.కావాలంటే నువ్వూ పెట్టుబడులు పెట్టు మైక్. భారీగా లాభాలొస్తాయ్" అంటూ కవ్వించే మాటలతో మెల్లగా ముగ్గులోకి దించింది. జెన్నీ మాట విని చట్టబద్దమైన బిట్‌కాయిన్ సంస్థలో 3వేల డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. అవి కాస్త పెరగడంతో..యువతి తన ప్లాన్‌ను మెల్లగా అమలు చేసింది.
మైక్ నాకు తెలిసిన సంస్థ ఉంది. అందులో ఆ 3వేల డాలర్లు ట్రాన్స్‌ఫర్ చేయి. అంతకంతకూ పెరిగిపోతాయి అంటూ నమ్మించింది. అలా జెన్నీ చెప్పిన ఓ ఫేక్ బిట్ కాయిన్ కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టాడు. అవి కాస్తా డబుల్ అవ్వడంతో జెన్నీ మాటమీద నమ్మకంతో రూ.20లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. సీన్ కట్ చేస్తే 4నెలల తరువాత బాధితుడి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్‌సైట్ ఫేక్ అని, జెన్నీ మోసం చేసిందని నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలని మైక్ పోలీసులతో మొరపెట్టుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావడం కష్టమని, టెక్నాలజీ పట్ల, ముఖ్యంగా ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
Comments
Please login to add a commentAdd a comment