ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం.
అయితే, ఈ సబ్ స్క్రిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల నుంచి యాడ్- ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది.
మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్‌గా కొనసాగుతున్న భారత్‌లోని యూజర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి.
యూరప్‌లో మెటా నోయాడ్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు
పలు నివేదికల ప్రకారం.. డెస్క్‌టాప్ పరికరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్‌స్ట్రాగ్రామ్‌ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46 డాలర్లకు సమానమైన సుమారు 10 యూరోల సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛార్జీని విధించవచ్చు. మొబైల్ యూజర్ల సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా.
కమిషన్ల భారం తగ్గించుకునేందుకే
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లో ఉదాహరణకు మెటా,ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ యాప్స్‌ను యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్‌ను తమ ప్లేస్టోర్‌లలో ఉంచేందుకు గూగుల్, యాపిల్ సంస్థలు మెటా నుంచి కమిషన్ తీసుకుంటుంది. ఇప్పుడా కమిషన్ ఛార్జీలు పెంచడంతో .. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మెటా నోయాడ్స్ అంటూ కొత్త పేమెంట్ మెథడ్ అస్త్రాన్ని వదిలింది.
చదవండి👉 కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల!
Comments
Please login to add a commentAdd a comment