9 Big Companies Not Paid Lease To Government Under GHMC Limits - Sakshi
Sakshi News home page

HYD: అంతా మా ఇష్టం.. బడా కంపెనీల ఇష్టారాజ్యం.. సర్కార్‌కు బిగ్‌ షాక్‌!

Published Sat, Jul 30 2022 4:53 PM | Last Updated on Sat, Jul 30 2022 7:03 PM

9 Big Companies Not Paid Lease To Government Under GHMC Limits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకున్న 9 బడా కంపెనీలు అద్దె చెల్లించడంలేదు. జీహెచ్‌ఎంపీ పరిధిలో ఉన్న పెద్ద కంపెనీలు 2009 నుంచి ప్రభుత్వానికి లీజ్‌ చెల్లించడంలేదు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 272కోట్లు బకాయిపడ్డాయి. ఈ క్రమంలో లీజ్‌ చెల్లించని వారి లైసెన్స్‌ రద్దు చేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా సదరు సంస్థలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు లీజ్‌కు తీసుకోవడం గమనార్హం.

9 బడా కంపెనీలు ఇవే.. 
-ట్రైడెంట్‌ హోట్‌.. రూ. 87.86 కోట్లు.
- అర్బన్‌దేవ్‌ సెంటర్‌ రూ. 62.77 కోట్లు.
- త్రిస్టార్‌ హోటల్‌ రూ. 50.35 కోట్లు. 
- ప్రసాద్‌ ఐమాక్స్‌ రూ. 27. 45 కోట్లు. 
- ఎక్స్‌పోటెల్‌ హోటల్‌ రూ. 15.13 కోట్లు. 
- స్నో వరల్డ్‌ రూ. 15 కోట్లు.
- జల విహార్‌ రూ. 6.51 కోట్లు. 
- గోల్ఫ్‌ కోర్స్‌(శామీర్‌పేట్‌) రూ. 5.58 కోట్లు. 
- దస్పల్లా హోటల్‌ రూ. 1.8 కోట్లు.

ఇది కూడా చదవండి: ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement