jalavihar
-
ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకుని అద్దె చెల్లించని 9 బడా కంపెనీలు
-
బడా కంపెనీల ఇష్టారాజ్యం.. కేసీఆర్ సర్కార్‌కు వందల కోట్లు లాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకున్న 9 బడా కంపెనీలు అద్దె చెల్లించడంలేదు. జీహెచ్ఎంపీ పరిధిలో ఉన్న పెద్ద కంపెనీలు 2009 నుంచి ప్రభుత్వానికి లీజ్ చెల్లించడంలేదు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 272కోట్లు బకాయిపడ్డాయి. ఈ క్రమంలో లీజ్ చెల్లించని వారి లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా సదరు సంస్థలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు లీజ్‌కు తీసుకోవడం గమనార్హం. 9 బడా కంపెనీలు ఇవే.. -ట్రైడెంట్ హోట్.. రూ. 87.86 కోట్లు. - అర్బన్దేవ్ సెంటర్ రూ. 62.77 కోట్లు. - త్రిస్టార్ హోటల్ రూ. 50.35 కోట్లు. - ప్రసాద్ ఐమాక్స్ రూ. 27. 45 కోట్లు. - ఎక్స్‌పోటెల్ హోటల్ రూ. 15.13 కోట్లు. - స్నో వరల్డ్ రూ. 15 కోట్లు. - జల విహార్ రూ. 6.51 కోట్లు. - గోల్ఫ్ కోర్స్(శామీర్‌పేట్) రూ. 5.58 కోట్లు. - దస్పల్లా హోటల్ రూ. 1.8 కోట్లు. ఇది కూడా చదవండి: ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్! -
ఇది రెండు భావజాలాల మధ్య పోరు
సాక్షి, హైదరాబాద్: ‘భారతదేశం పతనం బాటలో సాగుతోంది. ఈ పతనం మన కళ్లముందే జరుగుతోంది. ప్రస్తుతం జరిగే రాష్ట్రపతి ఎన్నిక రెండు భావజాలాల మధ్య జరిగే యుద్ధం. రాష్ట్రపతి ఎన్నికను పక్కన పెడితే దేశాన్ని నాశనం కానిద్దామా?’అని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘర్షణ వాతావరణంపైనే ప్రధానికి విశ్వాసం ‘ప్రధానిపై వ్యక్తిగత ద్వేషం లేదు. నామినేషన్ తర్వాత ఫోన్ చేసి, మెసేజ్ పంపినా నేటికీ స్పందన లేదు. ఇది దేశ ప్రధానికి గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయం ఎంత మాత్రమూ కాదు. ఈ ఎన్నిక చాలా అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోంది. ఆదివాసీ మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో ఏకాభిప్రాయ సాధన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో మాట్లాడాల్సిన ప్రధాని అ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రధానికి ఏకాభిప్రాయ సాధనకంటే ఘర్షణ వాతావరణంపైనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇతరులను అవమానించడం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన డిక్షనరీలో ఏకాభిప్రాయమనే పదమే లేదు. దేశంలో రెండో పక్షంలో ఉన్నవారికి గౌరవం ఉండదా? అందుకే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరి వ్యక్తుల నడుమ కొట్లాట కాదు.. రెండు భావజాలాల నడుమ జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని మీ సహకారంతో చేస్తున్నా. యుద్ధానికి వెళ్లినపుడు ఎంత పెద్ద కత్తి ఉంది, ఎంత పెద్ద సైన్యం ఉందనేది చూడకుండా మన వద్ద ఉన్న ఆయుధంతో పోరాడుతాం. మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది..’అని సిన్హా చెప్పారు. పోరాటం కొనసాగుతుంది.. ‘ఆల్ట్ న్యూస్ జుబేర్‌ను వైషమ్యాలు పెంచుతున్నారని జైలులో పెట్టారు. కానీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై చట్టబద్ధవిచారణేదీ మొదలవలేదు. దీనిపై ప్రధాని మౌనం పాటిస్తున్నారు. మన్ కీ బాత్ అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ఎనిమిదేళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. అంటే ఒక్కడు మాట్లాడితే 140 కోట్ల భారతీయులు వినాలా? దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితం ఏదైనా చింత లేదు. ఈ పోరాటం ఎన్నిక తర్వాత కూడా కొనసాగుతుంది..’అని తెలిపారు. తెలంగాణలో అద్భుతాలు ‘సీఎం కేసీఆర్‌తో కలిసి దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం. ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌తో కలిసి మాట్లాడి పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో చర్చిస్తాం. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ తక్కువ సమయంలో అద్భుతాలు చేసి చూపించారు. కేవలం ఒక్కడిగానే పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించారు. దేశం నాశనం కాకుండా జరుగుతున్న పోరాటం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టాక రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తా. దేశంలో చర్చలు జరగకపోవడం దురదృష్టకరం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఎన్నడూ విపక్షాలు, రాజకీయ శత్రువుల అణచివేతకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే కనీస ఆలోచన కూడా రాలేదు. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాడుతాం..’అని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. -
సండే ఫన్ డే.. జల విహార్‌లో వీకెండ్ సందడి
-
జలవిహార్ లో పర్యాటకుల సందడి
-
తిరుపతి నగరంలో జల విహార్
-
జలవిహార్‌లో సందడిగా ‘అలయ్- బలయ్’ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలయ్- బలయ్’ కార్యక్రమం ఆదివారం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్- బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కొనసాగుతోందని తెలిపారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది ‘అలయ్ బలాయ్’ అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే ‘అలయ్ బలాయ్’ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఏటా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలాయ్ నిర్వహిస్తారు. అలయ్ బలాయ్‌లో తెలంగాణ వంటల(వెజ్, నాన్ వెజ్)తో సిద్ధం చేశారు. -
దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి విర్రవీగుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే (హెచ్–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్ కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోదీ ఒక్కో జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్ చెక్కులను అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
భౌగోళికంగా సరిహద్దులే ఉన్నాయే గానీ..
-
వారిద్దరు నాకు ఆదర్శం: తమిళి సై
సాక్షి, హైదరాబాద్ : చెడు మీద మంచి సాధించిన విజయమే విజయదశమి అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బతుకమ్మ, బోనాల పండుగ తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని గురువారం జలవిహార్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భావితరాలకు పండుగ ప్రాధాన్యతను తెలియజేయడానికే అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి నిలయమని... ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా అలయ్ బలయ్ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ..తెలంగాణకు గవర్నర్‌గా రావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు తనకు ఆదర్శం అన్నారు. పదిహేనేళ్లుగా దత్తాత్రేయ అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. మానవ సంబంధాలు పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నాయే గానీ... సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. ‘చిన్న పిల్లల టిఫిన్ బాక్సుల్లో బర్గర్లు, చిప్స్ ఉంటున్నాయి. చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేలా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి’ అని గవర్నర్ సూచించారు. ఇక విద్యాసాగర్ రావు మాట్లాడుతూ... ‘తెలంగాణలో కవులు, కళాకారులు మళ్ళీ ముందుకు రావాలి. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలి. సాంస్కృతిక విప్లవం తీసుకువచ్చి.. భాషను రక్షించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. అందరిని కలుపుతున్న పండుగ అలాయ్ బలాయ్ అని కిషన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ సాధనలో అలాయ్ బలాయ్ దోహదపడింది. విభేదాలు, తారతమ్యాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు దేశ అభివృద్ధికి పాటుపడాలి’ అని పేర్కొన్నారు. వీహెచ్ అసహనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమకు తగిన సమయం ఇవ్వటం లేదంటూ వేదికపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ కూడా తమ పట్ల ఇలాగే వ్యవహరించారంటూ అసహనానికి లోనయ్యారు. ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు లేకపోవటం బాధాకరమని.. తెలంగాణ ఇచ్చిన సోనియాను అవమానించారన్నారు. పాత గవర్నర్‌లా చేయొద్దని.. గవర్నర్ తమిళి సైని కోరారు. హిమాచల్ గవర్నర్ తమను జరచూసుకోవాలంటూ దత్తాత్రేయను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ జలవిహార్‌లో అలయ్‌బలయ్ కార్యక్రమం
-
జలవిహార్‌లో ఘనంగా గురువందనం
-
జలవిహార్‌లో ఘనంగా గురువందనం
సాక్షి, హైదరాబాద్ : స్వామి స్వాత్మానందేంద్ర శారదాపీఠం ఉత్తరాధికారిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారితో కలిసి హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలవిహార్‌లో గురువందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు స్పీకర్, మంత్రులు కూడా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమి పత్రాలను కేసీఆర్ స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. కార్యక్రమంలోభాగంగా స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్ర స్వాములకు పుష్పాభిషేకం చేశారు. -
పూల సంబరం
-
ఫొటో ట్రేడ్ ఎక్స్పో
-
జల విహార్‌లో ‘వన’ సుందరి
ఖైరతాబాద్: మహిళలకు ఇష్టమైన ఫ్లేవర్స్‌లో వివిధ రకాల బాడీ, బాత్ ఉత్పత్తులను ‘వన’ సంస్థ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సాయంత్రం జలవిహార్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్ ఎస్మా వొలోడర్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. తమ ఉత్పత్తులు సిటీ మహిళలకు ఎంతగానో నచ్చుతాయని వన సంస్థ ఫౌండర్ సైబా ఇస్మాయిల్, కో ఫౌండర్ వనజా ఇస్మాయిల్ తెలిపారు. ఇందులో 100కు పైగా ప్లేవర్స్ ఉన్నాయని, త్వరలో సిటీలో ఔట్లెట్ ప్రారంభిస్తామని చెప్పారు. -
రేవంత్‌రెడ్డికి నో చెప్పిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సీనియర్ నేత రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. నగరంలోని జలవిహార్‌లో సోమవారం తన సన్నిహితులు, కార్యకర్తలు, మద్దతుదారులతో సభ నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి సన్నాహాలు ప్రారంభించారు. అయితే, జలవిహార్‌లో రేవంత్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఇక్కడ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
'రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారు'
హైదరాబాద్: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు నగరానికి ఆహ్వానించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారని, ఆ ఉన్నతమైన పదవి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారని విశ్వాసం తమకుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ ఘనవిజయం సాధిస్తారని చెప్పారు. దేశ రాష్ట్రపతిగా ఆయన విజయవంతంగా కావాలని ఆకాంక్షించారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం నడుచుకుంటుందని చెప్పారు. నగరానికి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కేసీఆర్ జలవిహార్‌లో సన్మానించారు. ఆయనకు మర్యాదపూర్వకంగా విందు భేటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడుతూ రాష్ట్రపతి కోవింద్‌పై ప్రశంసల వర్షం కురింపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యాన్ని, ప్రస్తుతం రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ఆయన వివరించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో సుదీర్ఘ పోరాటం అనంతరం ప్రజాస్వామికపంథాలో సాధించుకున్నాం. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రం. చాలా తక్కువ సమయంలో తెలంగాణను భారత్ అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టాం. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నరాష్ట్రంగా ముందంజలో ఉన్నాం. 38 లక్షలమంది పేదలకు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుచేస్తున్నాం. పేదలకు ఆవాసం కల్పించాలన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలుచేస్తున్నాం' అని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతునిస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. -
కోవింద్‌కు సీఎం కేసీఆర్ విందు!
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విందు ఇచ్చారు. జలవిహార్‌లో ఏర్పాటుచేసిన ఈ విందు కార్యక్రమానికి కోవింద్‌తోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పలువురు బీజేపీ నేతలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినందుకు టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కోవింద్‌కు మొదట మద్దతు ప్రకటించిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్ఎస్ అని మెచ్చుకున్నారు. కోవింద్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని, గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉందన్నారు. రాష్ట్రపతి పదవికి కోవింద్ సరైన వ్యక్తి అని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జేడీయూ, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు తదితర ఎన్డీయేతర పార్టీలు కూడా కోవింద్‌కు మద్దతు తెలిపాయని తెలిపారు. కేసీఆర్ ఏర్పాటుచేసిన విందును స్వీకరించిన అనంతరం కోవింద్ విజయవాడకు పయనం కానున్నారు. -
జలవిహార్‌లో సందడిగా వీవ్స్ ఎగ్జిబిషన్
-
బతుకమ్మ పండుగ..బతుకుల్లో నిండుగ..
-
‘జన’విహార్..
-
సరదా కోసం వెళితే చితకబాదారు
రాంగోపాల్‌పేట్ (సికింద్రాబాద్): ఆటవిడుపు కోసం తన బంధువులతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు వెళ్లిన ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాటిగడ్డకు చెందిన ఇంతియాజ్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్ తన కుటుంబ సభ్యులు 10 మందితో కలసి శనివారం మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు వెళ్లాడు. 9వ తరగతి చదివే ఇంతియాజ్ అక్క కుమారుడైన మహ్మద్ సమీర్ అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఉండే మ్యాట్రైడ్కు వెళ్లాడు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు బింటూ అతన్ని అనుమతించలేదు. 45 కేజీల బరువుకు పైబడి ఉన్న వాళ్లను మాత్రమే అనుమతిస్తామని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవ జరుగుతుండగానే బింటూ సోదరుడు మహ్మద్ జుబేర్ (18) ఇక్కడికి చేరుకుని సెక్యూరిటీగార్డుని ప్రశ్నించడంతో... అతడు మరింత ర్యాష్‌గా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది జుబేర్‌ను పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లి చితకబాది వదలి పెట్టారు. అనంతరం జుబేర్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. ఇంతియాజ్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జల్లంత... తుళ్లింత
-
జలవిహార్‌లో ఘనంగా అలయ్-బిలయ్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జలవిహార్ వద్ద అలాయ్-బలాయ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అంతకు ముందు బీజేపీ నేతలు ఊరేగింపుగా సమావేశ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాయ్-బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు. అలాయ్-బలాయ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆట, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక అలాయ్-బలాయ్ కార్యక్రమంలో తెలంగాణ వంటకాలు ఘమఘమలాడాయి. అతిథుల కోసం సుమారు 30 వంటకాలను తయారు చేశారు.