
'రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారు'
రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారని, ఆ ఉన్నతమైన పదవి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారని విశ్వాసం తమకుందని చెప్పారు.
హైదరాబాద్: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు నగరానికి ఆహ్వానించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారని, ఆ ఉన్నతమైన పదవి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారని విశ్వాసం తమకుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ ఘనవిజయం సాధిస్తారని చెప్పారు. దేశ రాష్ట్రపతిగా ఆయన విజయవంతంగా కావాలని ఆకాంక్షించారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం నడుచుకుంటుందని చెప్పారు. నగరానికి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కేసీఆర్ జలవిహార్‌లో సన్మానించారు. ఆయనకు మర్యాదపూర్వకంగా విందు భేటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడుతూ రాష్ట్రపతి కోవింద్‌పై ప్రశంసల వర్షం కురింపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యాన్ని, ప్రస్తుతం రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ఆయన వివరించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో సుదీర్ఘ పోరాటం అనంతరం ప్రజాస్వామికపంథాలో సాధించుకున్నాం. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రం. చాలా తక్కువ సమయంలో తెలంగాణను భారత్ అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టాం. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నరాష్ట్రంగా ముందంజలో ఉన్నాం. 38 లక్షలమంది పేదలకు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుచేస్తున్నాం. పేదలకు ఆవాసం కల్పించాలన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలుచేస్తున్నాం' అని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతునిస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు.