76వ వసంతంలోకి రాష్ట్రపతి: ప్రధాని మోదీ, సీఎంలు జగన్‌, కేసీఆర్‌ విషెస్‌ | Narendra Modi And CM KCR Birth Day Wishe To President RamNath Kovind | Sakshi
Sakshi News home page

RamNath Kovind Birth Day: శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Published Fri, Oct 1 2021 12:56 PM | Last Updated on Fri, Oct 1 2021 1:46 PM

Narendra Modi And CM KCR Birth Day Wishe To President RamNath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
చదవండి: నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని..


ఉప రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు
‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.


ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఏపీ రాజ్‌భవన్‌ ట్వీట్‌ చేసింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం పొందాలని.. దేశానికి ఇంకొన్నాళ్లు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement