జలవిహార్లో ఘనంగా అలయ్-బిలయ్ | BJP leader bandaru Dattatreya celebrates Alai Balai festival at Jalavihar | Sakshi
Sakshi News home page

జలవిహార్లో ఘనంగా అలయ్-బిలయ్

Published Tue, Oct 15 2013 12:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP leader bandaru Dattatreya celebrates Alai Balai festival at Jalavihar

హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంలో జలవిహార్‌ వద్ద అలాయ్‌-బలాయ్‌ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అంతకు ముందు బీజేపీ నేతలు ఊరేగింపుగా సమావేశ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాయ్‌-బలాయ్‌ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు.

అలాయ్‌-బలాయ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆట, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక అలాయ్‌-బలాయ్‌ కార్యక్రమంలో తెలంగాణ వంటకాలు ఘమఘమలాడాయి. అతిథుల కోసం సుమారు 30 వంటకాలను తయారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement