
ఎస్మా వొలోడర్‌తో సెల్ఫీ..
ఖైరతాబాద్: మహిళలకు ఇష్టమైన ఫ్లేవర్స్‌లో వివిధ రకాల బాడీ, బాత్ ఉత్పత్తులను ‘వన’ సంస్థ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సాయంత్రం జలవిహార్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్ ఎస్మా వొలోడర్ మార్కెట్‌లోకి లాంచ్ చేశారు. తమ ఉత్పత్తులు సిటీ మహిళలకు ఎంతగానో నచ్చుతాయని వన సంస్థ ఫౌండర్ సైబా ఇస్మాయిల్, కో ఫౌండర్ వనజా ఇస్మాయిల్ తెలిపారు. ఇందులో 100కు పైగా ప్లేవర్స్ ఉన్నాయని, త్వరలో సిటీలో ఔట్‌లెట్ ప్రారంభిస్తామని చెప్పారు.