buety
-
కి‘లేడీ’ అరెస్ట్
విశాఖపట్నం : అమె టిప్‌టాప్‌గా తయారవుతుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నానని చెబుతుంది. మగవాళ్లను లిఫ్ట్ అడిగి, పరిచయం పెంచుకుంటుంది. తరువాత దొంగతనాలకు పాల్పడుతుంది. అటువంటి కి‘లేడీ’ని ఎంవీపీ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనకాపల్లికి చెందిన గౌరి నగరంలోని సీతంపేట జీవీఎంసీ పాఠశాల సమీపంలో నివసిస్తుంది. ఆమె గతంలో భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. విలాసాలకు అలవాటు పడిన గౌరి దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసుల విచారణలో తేలింది. శివాజీపాలెంలో నివసిస్తున్న పూసపాటి గోపాలకృష్ణ వర్మ (60) గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతను కారులో వెళ్తుండగా మార్గమధ్యలో గుత్తుర్తి గౌరి (29) లిఫ్టు అడిగింది. దీంతో లిఫ్టు ఇచ్చిన వర్మ ఆమెతో కలిసి ఎంవీపీ కాలనీలో గల ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. కొంతసేపటికి వర్మ వాష్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే ఉన్న కారు తాళాలు తీసుకుని గౌరి కారుతో సహా పరారైంది. దీంతో వర్మ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంవీపీ క్రైం ఎస్ఐ సూరిబాబు పర్యవేక్షణలో టి.తులసీభాస్కర్, పి.నరేష్కుమార్, పీడీవీ ప్రసాద్ కలిసి గౌరిని అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాజోన్ క్రైం సీఐ వి.బాబ్జీరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు..ఇక బ్యూటీ స్పాట్స్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు ఇక బ్యూటీ స్పాట్లుగా మారనున్నాయి. ఇవి చెత్త డంప్‌లుగా మారకుండా సర్వాంగ సుందరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాల్లో సైతం చెత్తను వేయకుండా కట్టడి చేసేందుకు ఒక బృహృత్తర ప్రణాళిక రూపొందించింది. ముందుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు వాటి చుట్టూ కీపాండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి అందమైన పూల మొక్కలు, షో చెట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో స్థానికుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీంతో విలువైన స్థలాలను పరిరక్షించడంతో పాటు వీటిని ఆట స్థలాలు, పార్కులుగా అభివృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు వీలవుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు ఆయా స్థలాల సుందరీకరణపై నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాలా ప్రాంతాఆల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఫలితంగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలో వేసే డంపింగ్ పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడం సర్వసాధారణంగా మారాయి. నేటి నుంచి సుందరీకరణ మాసం నగరంలోని ఖాళీ స్థలాల సుందరీకరణ కోసం ఒక నెల రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఖాళీ స్థలాల సుందరీకరణ మాసంగా పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి డిప్యూటి, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని తమ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు అయితే వెంటనే ప్రహారీ గోడలను తగు అనుమతితో నిర్మించి మొక్కలను నాటించడం, మంచి ప్లే గ్రౌండ్లుగా మార్చాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి అయితే ఆ స్థలం యజమానులను పొరుగువారితో కలిసి గుర్తించనున్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థలాల్లో తిరిగి చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శిస్తారు. ఖాళీ స్థలాల ఇంటి యజమానులతో ప్రహరీ గోడలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టి తిరిగి ఎవ్వరు కూడా చెత్తను వేయకుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి ఖాళీ స్థలాలను ఒక జవాను లేదా ఎస్.ఎఫ్.ఏ లేదా ఇతర కార్మికుడిని ఇన్చార్జిగా నియమిస్తారు. ఎవ్వరూ కూడా చెత్త వేయకుండా నిరోధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అధికంగా సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించనున్నారు. ఈ ఖాళీ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. -
జల విహార్‌లో ‘వన’ సుందరి
ఖైరతాబాద్: మహిళలకు ఇష్టమైన ఫ్లేవర్స్‌లో వివిధ రకాల బాడీ, బాత్ ఉత్పత్తులను ‘వన’ సంస్థ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సాయంత్రం జలవిహార్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్ ఎస్మా వొలోడర్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. తమ ఉత్పత్తులు సిటీ మహిళలకు ఎంతగానో నచ్చుతాయని వన సంస్థ ఫౌండర్ సైబా ఇస్మాయిల్, కో ఫౌండర్ వనజా ఇస్మాయిల్ తెలిపారు. ఇందులో 100కు పైగా ప్లేవర్స్ ఉన్నాయని, త్వరలో సిటీలో ఔట్లెట్ ప్రారంభిస్తామని చెప్పారు. -
అందం పాదాల్లో ఉంటుందా?
సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయేలీయులు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్న భ్రమ కల్పిస్తూ గుర్రాలు, రథాల ఉరుకులు, పరుగుల ధ్వని వారికి వినిపించడంతో శత్రువులు తమ గుడారాల్లో రెండేళ్ల కోసం దాచుకున్న ఆహార సరుకుల్ని పడవేసి ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రి పారిపోయారు. పట్టణం చుట్టూ శత్రువులు లేరు కాని వారు వదిలివెళ్లిన ఆహారం విస్తారంగా పడి ఉంది. దేవుణ్ణి నమ్మక, అది తెలియక పట్టణం లోపల ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. తన మాటల్ని రాజులు, అధికారులు, ప్రముఖులు నమ్మకపోతే దేవుడు కుష్ఠురోగులనైనా వాడుకుంటాడు. పట్టణం లోపలికి ప్రవేశార్హత లేని కుష్ఠు రోగులు నలుగురు ఆకలికి తాళలేక శత్రువుల వద్దనైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో సిరియన్ల శిబిరానికి వెళ్ళారు. అక్కడ శత్రువులెవరూ లేకపోగా వాళ్లు వదిలి వెళ్లిన ఆహారం కనిపించింది. కరువుతీరా తిన్నారు. అయితే అంత ఆహారాన్ని తామే తినాలనుకోవడం అన్యాయమనుకున్నారు. ఆహారం సమృద్ధిగా పడి ఉందన్న ‘సువార్త’ను ఆ నలుగురు కుష్ఠురోగులూ పరుగెత్తుకెళ్లి పట్టణంలో ప్రకటించగా వాళ్లంతా వచ్చి తినగలిగినంతా తిని ఇళ్లకు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్లారు. దేవుడు చెప్పినట్టే 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది. అయితే రాజులు అధిపతులు అవిశ్వాసులు కాగా, దేవుడు అంటరానివారు, పరమ వికారమైన వ్యక్తులైన కుష్ఠురోగులను వాడుకున్నాడు. అందాన్ని వ్యక్తుల ముఖారవిందాల్లో వెదుకుతుంది లోకం. కాని పదిమందికీ సాయం చేయడానికి ఉరుకులు పరుగులెత్తే పాదాలల్లోనే నిజమైన అందం ఉందంటాడు దేవుడు. ‘నాకు నా కుటుంబానికే అంతా కావాలనుకునేవాడు చూసేందుకు పైకి ఎంత అందగాడైనా పరమ వికారి అంటాడు దేవుడు. పక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని పాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా, అతడు కుష్ఠురోగిౖయెనా అతనే నా దృష్టిలో అందగాడంటాడు దేవుడు. సమాధాన సువార్తను ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవని బైబిలు అందుకే చెబుతోంది (రోమా 10:14–15). – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్