GHMC areas
-
ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకుని అద్దె చెల్లించని 9 బడా కంపెనీలు
-
బడా కంపెనీల ఇష్టారాజ్యం.. కేసీఆర్ సర్కార్‌కు వందల కోట్లు లాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకున్న 9 బడా కంపెనీలు అద్దె చెల్లించడంలేదు. జీహెచ్ఎంపీ పరిధిలో ఉన్న పెద్ద కంపెనీలు 2009 నుంచి ప్రభుత్వానికి లీజ్ చెల్లించడంలేదు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 272కోట్లు బకాయిపడ్డాయి. ఈ క్రమంలో లీజ్ చెల్లించని వారి లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా సదరు సంస్థలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు లీజ్‌కు తీసుకోవడం గమనార్హం. 9 బడా కంపెనీలు ఇవే.. -ట్రైడెంట్ హోట్.. రూ. 87.86 కోట్లు. - అర్బన్దేవ్ సెంటర్ రూ. 62.77 కోట్లు. - త్రిస్టార్ హోటల్ రూ. 50.35 కోట్లు. - ప్రసాద్ ఐమాక్స్ రూ. 27. 45 కోట్లు. - ఎక్స్‌పోటెల్ హోటల్ రూ. 15.13 కోట్లు. - స్నో వరల్డ్ రూ. 15 కోట్లు. - జల విహార్ రూ. 6.51 కోట్లు. - గోల్ఫ్ కోర్స్(శామీర్‌పేట్) రూ. 5.58 కోట్లు. - దస్పల్లా హోటల్ రూ. 1.8 కోట్లు. ఇది కూడా చదవండి: ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్! -
ఫ్లైఓవర్లు రాకముందు.. వచ్చాకా..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద వేల కోట్ల పనులు చేసి పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు. ఇంతకీ వీటివల్ల ప్రజలకు కలిగిన సదుపాయాలేమిటి? మారిన పరిస్థితులేమిటి? ఒనగూరిన ఆర్థిక ప్రయోజనాలేమిటి? వంటి వాటితోపాటు ఇతరత్రా అంశాల అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. సిగ్నల్‌ఫ్రీ ప్రయాణం వల్ల కేవలం ట్రాఫిక్ చిక్కులు తప్పడమే కాదని పర్యావరణ పరంగా వాయు కాలుష్యం, ఇంధన కాలుష్యం తగ్గుతుందని, వాహనాల నిర్వహణ ఖర్చులతోపాటు కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయని, తద్వారా జీవనప్రమాణాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కేవలం ప్రయాణ మార్గాలుగా మాత్రమే చూడరాదని, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటన్నింటినీ సర్వేద్వారా శాస్త్రీయంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాకముందు.. వచ్చాకా.. ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేపట్టారు. వాటిని పూర్తిచేసేందుకు మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో, శ్మశానవాటికల వద్ద సైతం పనులు చేయాల్సి వచ్చింది. మరోవైపు భూసేకరణ సమస్యలు సరేసరి. యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి కష్టాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తూ పూర్తిచేస్తున్న పనుల వల్ల ఇతరత్రా విధానాలుగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి గురించి అందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా పరిగణిస్తూ సదరు జోన్లలో ఫ్లై ఓవర్లు రాకముందు.. వచ్చాక స్థానికుల పరిస్థితులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి కలిగిన సదుపాయాలు, పెరిగిన దుకాణాలు, వ్యాపారాలు, తొలగిన ట్రాఫిక్ చిక్కులు, సాధ్యమైన సాఫీ ప్రయాణం ఇలా వివిధ అంశాలతో జాతీయస్థాయి కన్సల్టెన్సీ సంస్థతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 మాసాల్లో ఈ సర్వే పూర్తి చేసి నివేదికను వెలువరించనున్నట్లు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో పెరిగిన మొబిలిటీ, తగ్గిన ప్రయాణ సమయం, రహదారి భద్రత తదితర అంశాలు కూడా అధ్యయనంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులతోపాటు విద్య, వైద్యం, బ్యాంకింగ్,మార్కెటింగ్, తదితర రంగాల్లోని వారి అనుభవాలు సైతం పరిగణనలోకి తీసుకొని వారికి కలిగిన ప్రయోజనాలు సైతం నివేదికలో పొందుపరచనున్నారు. ఈ ప్రాంతాల్లో అధ్యయనం.. నగరంలో ఇప్పటికే పూర్తయిన బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్‌పాస్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఫ్లైఓవర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, షేక్‌పేట ఓయూకాలనీ ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్, కామినేని దగ్గరి రెండు ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ రెండు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, బైరామల్‌గూడ రెండు ఫ్లైఓవర్లు, బహదూర్‌పురా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్లు, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జిలు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో పూర్తికానున్న నాగోల్ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ ఫ్లైఓవర్లు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ తదితర ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు, ఆర్యూబీల వల్ల ప్రయోజనాల్ని సైతం నివేదికలో పొందుపరచనున్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఎస్సార్డీపీలో భాగంగా దానివల్ల కలిగిన ప్రయోజనాలనూ పొందుపరచనున్నారు. (చదవండి: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు) -
హైదరాబాద్‌లో పదే పదే.. అదే సీన్
వర్షం కురిసిన ప్రతిసారీ నగరం వణికిపోతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఎప్పటిలాగే పలు కాలనీలు, బస్తీలతోపాటు ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల మేరకు నగరంలో 200 వాటర్‌లాగింగ్ ప్రాంతాలుండగా, లెక్కలో లేనిప్రాంతాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో శుక్రవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగ రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటి ంచింది. బేగంపేటలోని ద్వారకాదాస్ సొసైటీలో ఇలా.. కాగా గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో 9–10 సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీ ల వా సులు నానా అవస్థలు పడ్డారు. కాగా రాత్రి 10 గంటల వరకు ఆర్సీ పురంలో 4.8 సెం.మీ., శేరిలింగంపల్లి 3.0, ఖాజాగూడ 2.6, మణికొండ 2.5, బీహెచ్ఈఎల్ 2.4, రాయదుర్గం 1.9, షేక్‌పేట్ 1.9, లింగంపల్లి 1.6, మెహిదీపట్నం 1.5, గుడిమల్కాపూర్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం ► మూడు గంటల్లోనే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ ప్రభావం కనిపించింది ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, కూకట్పల్లి, కృష్ణాగర్, లక్డీకాపూల్,పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్ష తాకిడికి ప్రజలు అల్లాడిపోయారు ► ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిపోవడంతో ముందుకు కదల్లేక వాహనవారులు పడరాని పాట్లు పడ్డారు ► నగర ప్రజలకు సుపరిచితమైన రాజ్‌భవన్‌రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, మైత్రీవనం, విల్లామేరీ కాలేజ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వంటి ప్రాంతాల్లోనే కాక పలు కొత్తప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది ► జీహెచ్ఎంసీకి 59 ఫిర్యాదులందాయి. వీటిల్లో 40 నీటినిల్వలకు సంబంధించినవి కాగా, 19 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫిర్యాదులందని సమస్యలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి -
Hyderabad: రేపటి నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలోని మొత్తం 4,846 కాలనీ లు, మురికివాడలు తదితర ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వందశాతం కోవిడ్ టీకాలు వేసిన నగరంగా హైదరాబాద్‌ను మార్చడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు జీహెచ్ఎంసీలో 150, కంటోన్మెంట్ ఏరియాలో 25 వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్స్ టీకాలు తీసుకోని వారిని ముందుగానే గుర్తించి, వ్యాక్సిన్ వేసే తేదీ, సమయాన్ని తెలియజేయడంతో పాటు టీకా వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షణకు జీహెచ్ఎంసీలోని 12 సర్కిళ్లకు 12 మంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు -
తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే 'జాకెట్'
సాక్షి, హైదరాబాద్: కేన్సర్.. మనుషులను కబళిస్తున్న మహమ్మారి. ముఖ్యంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ఇందులో అగ్రభాగంలో ఉంది. ముందస్తు పరీక్షలతో తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే దీన్ని నివారించొచ్చు. ఓవైపు అవగాహన లేక.. మరోవైపు పరీక్షలకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పారిశుధ్య మహిళా కార్మికులకు రొమ్ము కేన్సర్ ఉచిత స్క్రీనింగ్‌లను జీహెచ్ఎంసీ చేపట్టింది. దేశంలోని అతి తక్కువ క్లినిక్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ జాకెట్‌ను... పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ఎక్కువ మందికి వినియోగించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ సాంకేతికతతో దాదాపు 8 ఏళ్ల ముందే కేన్సర్ సోకే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక నిర్ధారణతో తదుపరి అవసరమైన చికిత్సలు పొందే అవకాశం ఉంది. కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. ఈ జాకెట్ ధరించేందుకు ఇష్టపడని వారికి శరీరాన్ని తాకకుండానే దాదాపు ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు. థెర్మలిటిక్స్ టెక్నాలజీతో యాక్టివ్ కేన్సర్ కణాల్ని ప్రాథమిక దశలో గుర్తిస్తారు. కేన్సర్ కణాలున్న భాగంలోని శరీర ఉష్ణోగ్రతను బట్టి థర్మల్ ఇమేజెస్ ఏర్పడతాయని పరీక్షలు నిర్వహిస్తున్న మురాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉపకరణాలతో ఎలాంటి నొప్పి ఉండదు. రేడియేషన్ ప్రభావం ఉండదు. కోత, గాట్లు వంటివి ఉండవు. నలభై ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని తాకకుండానే స్క్రీనింగ్, పూర్తి గోప్యత, కణతి ఏర్పడకముందే కేన్సర్ లక్షణాల్ని గుర్తించవచ్చు. సీమెట్ రూపకల్పన... కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో దాని అనుబంధ సంస్థ సీమెట్ ఈ సాంకేతికతను రూపొందించింది. త్రివేండ్రంలోని సీడాక్, కాన్పూర్ మలబార్ కేన్సర్ సెంటర్, నిరామయి స్టార్టప్‌లతో కలిసి ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వినియోగానికి పేటెంట్ పొందిన జపాన్ మురాటా కంపెనీకి అనుబంధ సంస్థగా నగరంలో ఉన్న మురాటా బిజినెస్ ఇంజినీరింగ్(ఇండియా) లిమిటెడ్ ఉపకరణాల ఉత్పత్తితో పాటు స్క్రీనింగ్ పరీక్షలూ నిర్వహిస్తోంది. పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇదీ పరిస్థితి థర్మల్ ఇమేజెస్ ద్వారా కేన్సర్ కణాల పెరుగుదలను రెండో సంవత్సరం నుంచే గుర్తించవచ్చు. మామోగ్రామ్ ద్వారా నాలుగేళ్ల వరకు కూడా కనుక్కోవడం కష్టం. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే రొమ్ము కేన్సర్లు ఉండేవి. ప్రస్తుతం యుక్త వయసులోనూ పెరుగుతున్నాయి. రొమ్ము కేన్సర్ లక్షణాలు చాలా వరకు స్టేజ్ 2, ఆ తర్వాతి దశల్లోనే కనిపిస్తాయి. తరచూ పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. బస్తీ దవాఖానాల్లోనూ.. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య మహిళా కార్మికులందరికీ ఈ పరీక్షలు చేయిస్తాం. పేద మహిళల సదుపాయార్థం నగరంలోని బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి తెస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్ అదే మా లక్ష్యం హైటెక్నాలజీతో కూడిన మెడికల్ ఉపకరణాలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనేదే మా లక్ష్యం. స్వదేశంలో స్థానికులతోనే ఉత్పత్తులు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందుకుగాను సాంకేతికంగా కొంత సహకారాన్ని జపాన్ నుంచి పొందుతున్నాం. – కరుణ్మల్హోత్రా, ఎండీ (మురాటా బిజినెస్ ఇంజినీరింగ్ ఇండియా) పేదల కోసం.. చాలామందికి రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండదు. పారిశుధ్య కార్మికులతో సహా పేద మహిళలెందరికో ఉపయోగపడుతుందనే ఆలోచనతో మురాటా నిర్వాహకులతో సీఎస్సార్ కింద ఉచిత స్క్రీనింగ్‌కు ఒప్పించాం. పరీక్షల శిబిరాలతో క్రమేపీ అవగాహన వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఒక్కో జోన్‌లోని ఒక్కో డివిజన్ వంతున దాదాపు 400 మందికి ఉచిత స్క్రీనింగ్‌కు నిర్వాహకులు ముందుకొచ్చారు. ఒకవేళ ఎవరికైనా తదుపరి పరీక్షలు అవసరమైతే ఈఎస్ఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. – హరిచందన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కేన్సర్ కణాల పెరుగుదల ఇలా... చురుగ్గా ఉండే కేన్సర్ కణాలు ప్రతి 90 రోజులకోమారు రెట్టింపవుతాయి. సమయం కణాలు 90 రోజులు 2 సంవత్సరం 16 రెండేళ్లు 256 మూడేళ్లు 4,896 నాలుగేళ్లు 65,536 ఐదేళ్లు 10,48,576 ఆరేళ్లు 1,67,77,216 ఏడేళ్లు 26,84,35,456 ఎనిమిదేళ్లు 429,49,67,296 -
రెండు రోజలపాటు విద్యాసంస్థలకు సెలవు: సీఎం
► హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు ► శుక్ర, శనివారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సీఎం ► ఢిల్లీ నుంచి హైదరాబాద్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష ► లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ► కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు నెంబర్లు తెలిపాలి ► ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నగరంలో అతి భారీ వర్ష సూచనల నేపథ్యంలో శుక్ర, శనివారాలు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల (పాఠశాలలు, కళాశాలలు సహా)కు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నందున అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో పరిస్థితిపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పురపాలక మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, రోనాల్డ్ రాస్‌ను అడిగి వరద పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. మున్సిపల్ మంత్రితో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రజలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రాణనష్టం జరగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిస్థితి అదుపులో ఉంది..: వర్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారీ వర్ష సూచనలు, సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ జీహెచ్ఎంసీలోని ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్ నుంచి గురువారం రాత్రి నగరంలోని పరిస్థితులను సమీక్షించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. వరద బాధితులకు ఉచిత భోజనం, వసతులు కల్పించాలని రెవెన్యూ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు. లుంబినీ పార్కులో బోటింగ్ రద్దు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం కంటే ఎక్కువ పరిమాణంతో ప్రవహిస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా గురువారం సాయంత్రానికి 513.79 మీటర్లకు చేరుకుంది. పైనుంచి నాలుగువేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు కూడా అంతే పరిమాణంలో వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్‌లోకి నిండుగా చేరిన నీరు లుంబినీపార్కులోకి ప్రవేశించడంతో పార్కులోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కులకు శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించారు. ‘ట్రాఫిక్ ’తో ‘సివిల్’ భాగస్వామ్యం కావాలి: డీజీపీ సాక్షి, హైదరాబాద్: వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ తదితర సీనియర్ అధికారులతో సమావేశమై వర్షాల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ఎఫ్.ఎం.రేడియో, టీవీ స్క్రోలింగ్స్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని ఆదేశించారు. సెల్లార్లలోకి నీళ్లు చేరితే డయల్-100 సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ జాంను క్లియర్ చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి రెండు మూడు రోజుల పాటు పనిచేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు.