సమంత 'శాకుంతలం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. రొమాంటిక్‌ పోస్టర్‌ విడుదల | Samantha Shaakuntalam Release Date Announced | Sakshi
Sakshi News home page

Samantha: సమంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. 'శాకుంతలం' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Mon, Jan 2 2023 12:11 PM | Last Updated on Mon, Jan 2 2023 12:20 PM

Samantha Shaakuntalam Release Date Announced - Sakshi

గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మూవీ టీం. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాకుంతలంను 3D వెర్షన్‌లో కూడా రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు సమంత, దేవ్‌ మోహన్‌ రొమాంటిక్‌ పిక్‌తో ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement