U-turn Remake
-
మంచి టర్న్
కొన్ని సినిమా కథలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించలేం. ‘యు–టర్న్’ సినిమా కథ అలాంటిదే. ఈ కథలో వచ్చిన మలుపులను ప్రేక్షకులు ముందే ఊహించలేకపోయారు. అంత పకడ్బందీగా ఆ కథ రాసుకున్నారు చిత్రదర్శకుడు పవన్ కుమార్. అందుకే కన్నడంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయి, రెండు భాషల్లోనూ హిట్ అయింది. ఇప్పుడు ‘యు–టర్న్’ మరో మంచి టర్న్ తీసుకోబోతోంది. ఈ చిత్రం ఫిలిపైన్ భాషలో రీమేక్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మా ‘యు–టర్న్’ ఫిలిపైన్లో రీమేక్ కానుంది. కిమ్ చియు, జెఎమ్‌డి గుజ్‌మ్యాన్, టోనీ లబ్రుస్కా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. ఫిలిపైన్ దర్శకుడు డెరిక్ కాబ్రిడో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. మనం తీసిన సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవుతోందంటే చాలా ఆనందంగా ఉంటుంది. పైగా దర్శకుడిగా కన్నా ఈ కథ రాసినందుకు రచయితగా ఎక్కువగా ఆనందపడుతున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నప్పుడు లోకల్ స్టోరీ అనుకుని రాశాను. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రీచ్ ఉంటుందనుకోలేదు. గత నెల సింహళ భాషలో ఈ చిత్రం రీమేక్ అయింది. ఇంకా థాయ్, చైనీస్ భాషల్లోనూ రీమేక్ కానుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాని రీమేక్ చేస్తారా? అని మా అంతట మేం ఎవరినీ అడగలేదు. సినిమా చూసి రీమేక్ చేయడానికి వాళ్లంతట వాళ్లే ముందుకొచ్చారు’’ అన్నారు. ‘‘భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మేం రీమేక్ చేయబోతున్న ‘యు–టర్న్’ మా ఫిలిపైన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. -
డైనమిక్ జర్నలిస్ట్
జోరున వర్షం పడుతోంది. ఓ లేడీ జర్నలిస్ట్ స్కూటర్ డ్రైవ్ చేస్తూ హడావిడిగా వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఆమె డైనమిక్ జర్నలిస్ట్. అందుకే ఓ ఇన్వెస్టిగేషన్ వర్క్‌పై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నెక్ట్స్ ఏం జరిగింది? అంటే.. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? థియేటర్స్‌లో చూస్తేనే కదా ఫుల్ మజా. పవన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ హిట్ ‘యు–టర్న్’ సినిమాను అదే టైటిల్‌తో, సేమ్ డైరెక్టర్‌తో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీస్ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సమంత బాయ్ ఫ్రెండ్‌గా రాహుల్ కనిపించనున్నారని సమాచారం. ఇటీవల ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్లో పోలీస్ స్టేషన్ సెట్లో సమంత, ఆది పినిశెట్టి పాత్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదే యు–టర్న్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. -
సెకండ్ టర్న్
అతను పవర్ఫుల్ పోలీసాఫీసర్. ఆమె పవర్ఫుల్ జర్నలిస్ట్. ప్రెస్, పోలీస్ పవర్ కలిస్తే క్రిమినల్స్‌కి ఫీవరే. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫ్లై ఓవర్‌పై జరుగుతున్న హత్యలను ఎలా ఛేదించారు? అనే అంశంతో పలు మలుపులతో రూపొందుతున్న చిత్రం ‘యు–టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు–టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్‌నే తెలుగు, తమిళ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టారై్టంది. అంటే.. యు–టర్న్‌లో సెకండ్ టర్న్ స్టారై్టందన్న మాట. ‘‘ఒక ఫ్లై ఓవర్ మీద జరుగుతున్న మర్డర్ మిస్టరీస్ను ఛేదించే జర్నలిస్ట్ కథే ‘యు–టర్న్’. హైదరాబాద్‌లో వేసిన భారీసెట్లో సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. జర్నలిస్ట్‌గా సమంత, పోలీసాఫీసర్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. సినిమాలో నరేన్, భూమిక పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. తెలుగు నేటీవిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్ కుమార్ బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి. -
సమంత యూటర్న్ తీసుకోనున్నారా?
నటి సమంత యూ టర్న్ తీసుకోనున్నారా? ఇందుకు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్ సమంత. తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ తరువాత కొత్త చిత్రం ఏదీ చేయని ఈ బ్యూటీ త్వరలో కోలీవుడ్‌లో ఇళయదళపతి 61వ చిత్రంలో జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనితో పాటు ఇరుంబు కుదిరై, అనీతి కథైగళ్ చిత్రాలకు పచ్చజెండా ఊపిన సమంత తెలుగులోనూ యువ స్టార్ నటుడు రామ్‌చరణ్‌కు జంటగా నటించే అవకాశం వరించినట్లు తెలిసింది. త్వరలో తన ప్రియుడు నాగచైతన్యతో వివాహ నిశ్చితార్థానికి సిద్ధం అవుతున్న ఈ చెన్నై చిన్నది నిర్మాతగా అవతారమెత్తనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్రం సమంతకు బాగా నచ్చేసిందట. అందులో నాయకిగా నటించాలని ముచ్చట పడుతున్న సమంత ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తానే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు, ఈ విషయమై తన కాబోయే భర్త నాగచైతన్యతో పాటు ఆ చిత్ర దర్శకుడు పవన్ కుమార్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. సమంత నాయకిగా ఆమె నిర్మాణంలోయూ టర్న్ చిత్రాన్ని రీమేక్చేయడానికి పవన్ కుమార్ అంగీకరించినట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక వార్త త్వరలో వెల్లడయ్యే ఆవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.