విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా | Bhairava teaser out: Ilayathalapathy Vijays film is loaded with mass | Sakshi
Sakshi News home page

విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా

Published Sat, Oct 29 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా

విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా

తమిళ  ఇళయదళపతి అభిమానులిప్పుడు పుల్ జోష్‌లో ఉన్నారు. విజయ్ తన 60వ చిత్రం భైరవా టీజర్‌ను గురువారం విడుదల చేసి అభిమానులకు దీపావళి కానుకగా అందించారు. ఈ టీజర్ వారిని యమ ఖుషీ పరుస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భైరవా. ఇంతకు ముందు విజయ్ హీరోగా అళగీయతమిళ్‌మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ ఈ భైరవా చిత్రానికి దర్శకుడు.ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్‌‌స పతారంపై బి.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్‌కు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు.

సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారం విడుదల చేసిన చిత్ర టీజర్‌కు సినీ ప్రేక్షకులు, విజయ్ అభిమానుల మధ్య అనూహ్య స్పందన వస్తోంది. ఫుల్ యాక్షన్, పంచ్‌డైలాగ్‌‌సతో కూడిన ఈ టీజర్‌లో విజయ్ నీటితో ఉన్న భూమిపై అడుగు పెట్టే సన్నివేశంతో మొదలై రౌడీని ఎత్తి గాలిలో తిప్పి కిందపడేసే దృశ్యం. అది చూసిన జగపతిబాబు యార్‌డా అవన్(ఎవడురా అతను)అని ఆవేశంగా గర్జించే దృశ్యం, తెరింజ ఎదిరియై విడ తెరియాద ఎదిరిక్కుదాన్ ఆళు అధికమాగ ఇరుక్కమ్(తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువుకే మంది ఎక్కువగా ఉంటారు), నెరియపేరుకిట్ట ఇల్లాద కెట్ట పళక్కం ఎన్‌కిట్ట ఉరుక్కు( చాలా మందికి లేని చెడ్డ గుణం నాకు ఉంది) లాంటి పంచ్ డైలాగ్‌‌సతో కూడిన భైరవా టీజర్‌కు విశేష స్పందన వస్తోంది.

ఈ టీజర్‌ను 20 గంటల్లోనే 22 లక్షల మంది తిలకించారని, 1.53 లక్షల మంది లైక్ చేశారని నెటిజన్లు గణాంకాలు చెబుతున్నారు. అంతే కాదు 24 గంటల్లో మూడు మిలియన్లు దాటే అవకాశం ఉందంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంతో ఫుల్‌జాయ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement