విడుదలకు ముందే రికార్డులు | Bhairawa movie creating records before release | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే రికార్డులు

Published Mon, Jan 9 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

విడుదలకు ముందే రికార్డులు

విడుదలకు ముందే రికార్డులు

ఇళయదళపతి చిత్రం వస్తుందంటే ఇటు పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా విజయ్‌ నటించిన ఆయన 60వ చిత్రం భైరవా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్ దివంగత ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం భైరవా. విజయ్‌ సరసన తొలిసారిగా కీర్తీసురేశ్‌ నాయకిగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ముఖ్య పాత్రను పోషించారు. భరతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతుంది. 2017లో తెరపైకి రానున్న తొలి భారీ చిత్రంగా నమోదవుతున్న భైరవా చిత్ర ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొంటున్నాయి. దీంతో చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇక అడ్వాన్స్ బుకింగ్‌ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వారానికి పైగా ఫుల్‌ అయిపోయింది. భైరవా చిత్రం విడుదలలో మరో రికార్డు సాధించింది. ఈ చిత్రం ఐరోపా దేశాలు సహా 55 దేశాల్లో విడుదల కానుంది. భైరవా చిత్ర ఓవర్‌సీస్‌ విడుదల హక్కులను పొందిన ఏ అడ్‌ పీ సంస్థ చిత్రాన్ని 55 దేశాల్లో విడుదల చేయనుంది. అందులో నైజీరియా, ఘనా, కెన్యా, ఉంగాండా, జాంజియా, టాంజానియా, కాంగో, ఉక్రెయిన్, అల్బేనియా, మెక్సికో, లితేనియా, పోలెండ్, మాస్కో దేశాలు చోటు చేసుకోవడం విశేషం. ఇన్ని దేశాల్లో ఒక తమిళ సినిమా విడుదల కావడం ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement