ఢాకా : బంగ్లాదేశ్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. సిరాజ్గంజ్ జిల్లాలో జమునా నది బ్రిడ్జ్పై శనివారం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే శుక్రవారం రాత్రి భారీ వర్షాల కారణంగా చిట్టిగాంగ్లో మట్టి చరియలు పడి మూడు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురు మరణించారని పోలీసులు వెల్లడించారు.