బాంబు పేలుడు : 28 మంది మృతి | 28 people killed in Ankara bombing | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు : 28 మంది మృతి

Published Thu, Feb 18 2016 7:00 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

బాంబు పేలుడు : 28 మంది మృతి - Sakshi

బాంబు పేలుడు : 28 మంది మృతి

అంకారా: టర్కీ రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 28 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టర్కీ ఉప ప్రధాని గురువారం వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉప ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని చెప్పారు. అయితే బాంబులు నింపిన వాహనాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని అంకారా గవర్నర్ తెలిపారు. మిలటరీ సిబ్బంది నివసించే ప్రాంతంలో ఈ కారు బాంబు పేలుడు చోటు చేసుకుందన్నారు.  

టర్కీ పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించిందని మీడియా పేర్కొంది. కాగా ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. ఈ దారుణం చోటు చేసుకున్న సమయంలో టర్కీ దేశాధ్యక్షుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రత సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ పేలుడును టర్కీ ప్రభుత్వం ఖండించింది. ఈ  పేలుడు బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. టర్కీలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement