Ankara
-
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. కార్మికుల దుర్మరణం
అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్నజ్ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. Update- #Rescue operation underway.. At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ — Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022 -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
ఆఖరి క్షణాలు.. ‘నాకు చావాలని లేదు’..
అంకారా : ‘‘నాకు చావాలని లేదు’’ మాజీ భర్త చేతిలో పాశవికంగా పొడవబడి.. రక్త మోడుతూ ఓ మహిళ అన్న ఆఖరి మాటలివి. కూతురిని తనకు అప్పగించటం లేదన్న కోపంతో ఓ మాజీ భర్త కన్న కూతురిముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన టర్కీలోని సెంట్రల్ అనటోలియన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ అనటోలియన్ కిరిక్కాలేకు చెందిన ఇమినే బులట్ భర్త ఫెడాయ్ వెరన్‌తో 4 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. వీరికి ఓ కూతరు ఉంది. కూతురి కస్టడీ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలనుంచి గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు కూతురి కస్టడీని బులట్‌కు అప్పగించింది. అయినప్పటికి కూతురిని తనకు అప్పజెప్పాలంటూ తరుచూ ఫెడాయ్, బులట్‌తో గొడవపడేవాడు. ఎంత గొడవపడినా ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. ఆగస్టు 18న కూతురిని చూడాలంటూ ఫెడాయ్,బులట్‌ను కోరాడు. ఇందుకు అంగీకరించిన బులట్ కూతుర్ని వెంటబెట్టుకుని అక్కడి ఓ కేఫ్‌కు వచ్చింది. అక్కడ కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఫెడాయ్.. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పాశవికంగా పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. ఆఖరి క్షణాల్లో ‘‘నాకు చావాలని లేదు’’ అన్న ఆమె మాటలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ఫెడాయ్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. అతడిని కఠినంగా శిక్షించాలని, మహిళలపై దాడులను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ టర్కీస్ ప్రజలు నిరసనలు చేపట్టారు. చదవండి: మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో.. వైరల్: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా! -
ఘోర రైలు ప్రమాదం ఫోటోలు చూడండి
-
ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి
అంకారా : టర్కీ రాజధాని అంకారాలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైస్పీడు రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రైలు అంకారా నుంచి కోన్యకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
అంకార: అంకారలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. టర్కీలో రష్యా రాయబారి హత్యకు గురైన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు షాక్ తిన్నారు. నల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి రాయబార కార్యాలయం ముందుకు వచ్చి ఎనిమిది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న గార్డులు చాలా ధైర్యంగా అతడిని నిలువరించి చేతిలోని గన్ లాక్కుని ఎలాంటి నష్టం లేకుండా చూశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. అంకారాలోనే రష్యా రాయబారిని పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు వేదికపైనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడికి యత్నం జరగడాన్ని అక్కడి అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. -
సముద్రపు దొంగలు విరుచుకుపడ్డారు
అంకారా: సముద్రపు దొంగలు విరుచుపడ్డారు. టర్కీకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై తెగబడ్డారు. నైజీరియా కోస్తా తీరంలో పులి అనే ఆయిల్ ట్యాంకర్‌తో ఉన్న నౌకను నిలిపి ఉంచగా అనూహ్యంగా పెద్ద గుంపుగా వచ్చి దాడి చేసి అందులోని కెప్టెన్‌ను, ఆరుగురు సిబ్బందిని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టర్కీకి చెందిన కాప్టానోగ్లూ అనే షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ గల నౌకపై పైరేట్స్ దొంగతనానికి పాల్పడ్డారు. మాల్టా జెండాతో ఉన్న ఈ పులి ఆయిల్ ట్యాంకర్ ఐవరీ తీరంలోని అబిద్ జాన్, గాబన్ ప్రాంతాల నుంచి ఈ నౌక నైజీరియా వైపునుంచి వస్తుండగా ఈ దాడి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
కారు బాంబు దాడిలో 34 మంది మృతి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి కారు బాంబుదాడిలో కనీసం 34 మంది మరణించగా, మరో 125 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సెంట్రల్ అంకారాలోని కిజిలే స్క్వేర్ సమీపంలో ఓ బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. వాణిజ్య సముదాయాలు, ట్రాన్స్పోర్ట్ హబ్ గల ఈ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. పేలుడు పదార్థులు నింపిన కారులో ఒకరు లేదా ఇద్దరు వచ్చి, బస్ స్టాప్ లక్ష్యంగా ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత ఐదు నెలలలో అంకారాలో ఉగ్రవాద దాడి జరగడమిది మూడోసారి. టర్కీ ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, విదేశీ ఎంబసీలు గల ప్రాంతానికి సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, కుర్దీష్ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. కాగా ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థా ఇంకా ప్రకటించలేదు. సెంట్రల్ అంకారాలో దాడి జరిగే అవకాశముందని, ఆ ప్రాంతానికి వెళ్లవద్దంటూ గత శుక్రవారం అమెరికా ఎంబసీ ఆ దేశ పౌరులను హెచ్చరించింది. -
బాంబు పేలుడు : 28 మంది మృతి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 28 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టర్కీ ఉప ప్రధాని గురువారం వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉప ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని చెప్పారు. అయితే బాంబులు నింపిన వాహనాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని అంకారా గవర్నర్ తెలిపారు. మిలటరీ సిబ్బంది నివసించే ప్రాంతంలో ఈ కారు బాంబు పేలుడు చోటు చేసుకుందన్నారు. టర్కీ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించిందని మీడియా పేర్కొంది. కాగా ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. ఈ దారుణం చోటు చేసుకున్న సమయంలో టర్కీ దేశాధ్యక్షుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రత సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ పేలుడును టర్కీ ప్రభుత్వం ఖండించింది. ఈ పేలుడు బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. టర్కీలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. -
రష్యాకు టర్కీ సమన్లు
అంకారా: టర్కీ మరోసారి రష్యా జోలికెళ్లింది. ఆ దేశానికి సమన్లు పంపించింది. తమ దేశ గగనతలంపై అనుమతి లేకుండా రష్యా విమానాలు వెళ్లాయని పేర్కొంటూ వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. ఈ మేరకు టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 'టర్కీ వైమానిక అధికారులు పలుమార్లు రష్యా యుద్ధ విమానం సు-34కు హెచ్చరికలు జారీ చేశారు. మా గగన తలంలోకి రావొద్దని రష్యా భాషలో, ఆంగ్లంలో చెప్పారు. అయినా వినలేదు. ఇలా జరగడం ఇప్పటికి చాలాసార్లు. అందుకే మేం సమన్లు పంపించాం. నాటో కూడా పంపించింది' అని టర్కీ అధికారులు తెలిపారు. రష్యాపై ఎంతోనమ్మకంతో మేం ఇప్పటి వరకు ఎలాంటి వివాదానికి దిగదలుచుకోలేదని కూడా మరోమాటగా చెప్పారు. గతంలో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చినప్పటి నుంచి రష్యాకు టర్కీకి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. -
టర్కీలో ఉగ్రవాదదాడి
అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. టర్కీలో జీ 20 సమావేశాలు జరుగుతున్నసమయంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జీ 20 సమావేశాల సందర్భంగా హైఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ దళాలు ఘజియాంటెప్ ప్రావిన్స్ లోని ఒక ఇంటిపై సోదాలు జరుపుతున్న సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు చెలరేగారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు దేశాధినేతలు జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీలోనే ఉన్నారు. గత అక్టోబర్ లో టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో100 మందికి పైగా చనిపోయాగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. -
శాంతి కోసం వెళ్లి శవాలుగా మారారు..
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరగడంతో శాంతి కోరుకోవాలంటూ ర్యాలీలో పాల్గొన్న చాలా మంది శవాలుగా మిగిలారు. కానీ, మరణించిన వారి శవాల మధ్య 'శాంతి, ప్రజాస్వామ్యం కావాలి' అని ర్యాలీ కోసం వచ్చిన వారు తీసుకొచ్చిన ప్లకార్డులు పడి ఉండటం చూపరులను కంటతడి పెట్టించక మానదు. శాంతి, ప్రజాస్వామ్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటూ తలపెట్టిన ర్యాలీలో పేలుళ్లు జరిగి బీతావహ వాతావరణం నెలకొనడం గమనార్హం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఘటనలో మృతిచెందిన వారి పట్ల సంతాపం ప్రకటించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. -
కరెన్సీ, మార్కెట్ల అస్థిరతకు అడ్డుకట్టవేయాలి
జీ-20 సమావేశంలో జైట్లీ అంకారా: కరెన్సీలోను, స్టాక్‌మార్కెట్లలోను తీవ్ర స్థాయి హెచ్చుతగ్గుల్ని నివారించడానికి అంతర్జాతీయ స్థాయి రక్షణ చర్యలు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. దేశీయంగా తీసుకునే చర్యల వల్ల పలు ప్రతికూలతలు తలెత్తుతుంటాయని, వీటిని అధిగమించేందుకు ఐఎంఎఫ్ లాంటి సంస్థల నేతృత్వంలో తక్షణం ఫలితాన్నిచేలా, అత్యుత్తమ స్థాయిలో రూపొందించిన రక్షణాత్మక చర్యలు అవసరమని చెప్పారు. ఇందుకు సభ్యదేశాల మధ్య లిక్విడిటీ ఉండేలా వివిధ రకాల సర్దుబాట్లు ఉండాలన్నారు. ఇటీవల చైనా తన యువాన్ విలువను తగ్గించి కరెన్సీ వార్‌కు తెరతీసిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం టర్కీ రాజధాని అంకారాలో జీ-20 సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘‘వ్యక్తిగతంగానో, ప్రతిస్పందనగానో తాత్కాలికంగా తీసుకునే చర్యలు ప్రతికూలతల్ని కూడా తాత్కాలికంగానే ఆపగలవు. పూర్తిస్థాయి పరిష్కారాన్ని అందించలేవు. ఇది వివిధ దేశాల విధానాల్లో సమన్వయం ఉంటేనే సాధ్యం’’ అన్నారాయన. జీ 20 భేటీ నేపథ్యం గురించి మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్య సమస్యతో సతమతమౌతున్నాయని, భారత్‌లో మాత్రం యువశక్తే అత్యధికమన్నారు. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించి భారత్ వారి సమస్యను తీరుస్తుందని తెలియజేశారు. కాగా రేట్ల పెంపునకు అనువుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలని జైట్లీతోపాటు జీ-20 సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మెరుగైన ఆర్థిక వ్యవస్థ: లగార్డే అంతర్జాతీయంగా ఉన్న మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే తెలిపారు. అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్నప్పుడు కూడా భారత్ మంచి వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. వర్ధమాన దేశాల్లో వృద్ధి ఉందంటే అది భారత్‌లోనే అని తెలిపారు. కార్పొరేట్లకు కొత్త నియమావళి షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడటానికి, నిధుల సమీకరణకు స్టాక్‌మార్కెట్లను కీలక సాధనంగా మలచటానికి జీ-20, ఓఈసీడీ కలిసి... లిస్టెడ్ కంపెనీలు, నియంత్రణ సంస్థలు పాటించాల్సిన కార్పొరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశాయి. ఈ మార్గదర్శకాలు భారత్‌తో సహా సభ్యదేశాలన్నిటికీ వర్తిస్తాయి. వీటిని అనుసరించి సెబీతో సహా నియంత్రణ సంస్థలన్నీ తమ నియంత్రణ విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇనె ్వస్టర్లకు అన్ని విషయాలనూ తెలియజేయటంతో పాటు సీఈఓల జీతాలను నియంత్రణలో ఉంచటం... వివిధ దేశాల్లోని నియంత్రణ సంస్థలు పరస్పరం సహకరించుకోవటం వంటివన్నీ తాజా నియమాల్లో ఉన్నాయి. ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా, టర్కీ ఉపప్రధాని సెవ్‌డెట్ యిల్మాజ్ వీటిని విడుదల చేశారు. నిధుల సమీకరణలో క్యాపిటల్ మార్కెట్ల పాత్రను మరింత మెరుగు పరచటానికి జీ-20 ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా యిల్మాజ్ చెప్పారు. 2007-08 సంక్షోభం తరవాత నిధుల సేకరణ కష్టంగా మారిందని కూడా మంత్రి తెలియజేశారు. -
యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు
అంకారా : టర్కీలో ఇస్తాంబుల్ నగరంలోని యూఎస్ రాయబారి కార్యాలయంపై సోమవారం తీవ్రవాదుల విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... తీవ్రవాదులపై ఎదురు కాల్పులకు తెగబడింది. దాంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది. కాగా స్థానిక మూడంతస్థుల పోలీస్ స్టేషన్ భవనంపై తీవ్రవాదులు గత రాత్రి బాంబులతో దాడి చేశారు. దాంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని మీడియా పేర్కొంది. -
టర్కీ
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 7,79,452 చదరపు కిలోమీటర్లు, జనాభా:7,66,67,864 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అంకారా, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: లీరా, భాషలు: అధికార భాష - టర్కిష్, ఇతర భాషలు - అరబిక్, సిర్కాసియన్, ఆర్మేనియన్, ఇద్దిష్, కుర్దిష్, మతం: 98 శాతం మంది ముస్లిములు, వాతావరణం: జనవరిలో మైనస్ 4 నుండి 4 డిగ్రీల వరకు. ఆగస్టులో 15 నుండి 31 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: నల్లసముద్రం, మధ్యధరాసముద్రం, బల్గేరియా, రష్యా, ఇరాన్, సిరియా దేశాలు, స్వాతంత్య్రం పొందినది: 1923 అక్టోబర్ 29. పంటలు - పరిశ్రమలు - ఆహారం పంటలు -పరిశ్రమలు: టర్కీ దేశంలో గోధుమలు, బార్లీ, పత్తి, చెరకు, పొద్దుతిరుగుడు, బంగాళదుంపలు, పొగాకు, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. 75 శాతం తృణధాన్యాలు, సంవత్సరానికి 21 మిలియన్ల టన్నుల గోధుమలు, 22 మిలియన్ల టన్నుల చెరకు, పది మిలియన్ టన్నుల బార్లీ పండిస్తారు. ఈ దేశం నుండి టొమాటోలు, అలంకారానికి వాడే పూలు, పత్తి, కోడి మాంసం, గుడ్లు, టీ పొడి, డ్రై ఫ్రూట్స్ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, దుస్తులు, మోటారు వాహనాలు, కార్లు, రైలు ఇంజన్లు, బోగీలు, ఓడల నిర్మాణం, ఆయుధాల ఉత్పత్తి పరిశ్రమలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహారం: టర్కీయులు ఉదయం ఎక్కువగా వెన్న, పనీర్, టమాటాసూప్, గుడ్లు తింటారు. దీనిని మెనెమెన్ అంటారు. కూరగాయలు, మాంసం బాగా ఉడికించి తింటారు. గోధుమ రొట్టెలు, కోఫ్తా లాంటివి ఎక్కువగా తింటుంటారు. రంజాన్ మాసంలో ఎవరూ మద్యం తాగరు. మిగతా సమయాలలో రాకీ అనే స్థానిక మద్యం తాగుతారు. ఇక టర్కీయులు బ్లాక్ టీ ఎక్కువగా తాగుతారు. దీనితో పాటు కాఫీ కూడా బాగా తాగుతారు. అంకారా: ఇది టర్కీ రాజధాని. పూర్వం దీనికి అంగోరా అనే పేరు ఉండేది. ఆ తర్వాత అంకారా అనే పేరు వచ్చింది. 930 మీటర్ల ఎత్తై కొండల పైన నిర్మితమైన అంకారా నగరం అంతర్జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. రైలు రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల అంతర్ జాతీయ స్థాయిలో పారిశ్రామిక నగరంగా, గొప్ప వాణిజ్యకేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. పొడవాటి వెంట్రుకలున్న మేకలకు, బలిష్ఠమైన రంగురంగుల పిల్లులకు, తెల్లని బొచ్చున్న కుందేళ్లకు, అంకారా ఉన్నికి, ద్రాక్షపళ్లకు ప్రపంచ స్థాయిలో పేరుంది. ఇది అతి ప్రాచీనమైన నగరం కావడం వల్ల రోమ్, ఒట్టావా తదితర ప్రాచీన నాగరకతలకు, సంస్కృతులకు ఆలవాలంగా ఉంది. పురాతన కట్టడాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు అంకారాలో అధికంగా కనిపిస్తాయి. మౌంట్ నెమ్రుట్: క్రీస్తుపూర్వం 62లో ఆంటియోచస్ అనే రాజు ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇది 2134 మీటర్ల ఎత్తై పర్వత ప్రదేశం. ఆ రాజు తన ముఖాన్ని రెండు ఎత్తై రాళ్ల మీద చెక్కించాడు. దానితో పాటు, రెండు సింహాలు, రెండు గ్రద్దలు, ఇతర గ్రీకు, రోమన్ దేవతల బొమ్మలను కూడా చెక్కించాడు. జర్మనీ ఇంజనీరు ఒకరు క్రీ.శ.1881లో ఈ ప్రదేశాన్ని చూసి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ ప్రకటించింది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ అత్యద్భుతంగా కనిపిస్తాయి. అందుకే పర్యాటకులు ఈ ప్రదేశానికి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడం కోసమే ప్రత్యేకంగా వస్తుంటారు. కప్పడోసియా: క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన ఈ నగరంలో రాతి కట్టడాలు అయిన ఫెయిరీ చిమ్నీలు ఒక అద్భుత ప్రదేశం. రాతి ఇళ్లు, మౌంట్ ఎర్సియస్, రాతిని తొలిచి నిర్మించిన దేవాలయం చూడదగిన ప్రదేశాలు. ఉర్గుప్, జోరెమె, ఇహలారా లోయలు, సెలిమ్, గుజెల్యుట్, ఉచిసార్, అవనోస్, జెల్వెలతో పాటు, భూమి లోపల నగరం డెరిన్కుయు, కయమాక్లి, గాజిమీర్ ఓజ్కనక్లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరవేయడం ఒక సరదా ఆట. ఈ నగరంలో నివసించే ప్రజలు కూడా కొండలలో రాళ్లు తొలిచి ఇళ్లు నిర్మించుకున్నారు. అందుకే ఈ నగరంలో ఇళ్లు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి. బోడ్రమ్ క్యాజిల్: ఇదొక విశాలమైన రాతి కట్టడం. ఇది దేశానికి నైరుతి భాగంలో ఉంది. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. దీనినే సెయింట్ పీటర్ క్యాజిల్ అంటారు. ఇది ప్రస్తుతం మ్యూజియంగా మారింది. ఇందులో వేల మిలియన్ల డాలర్ల విలువైన నౌకాయాన పరికరాలు, ఇతర సామగ్రి ఉన్నాయి. ఇక్కడ సముద్ర గర్భంలో నౌకాయానం ఎలా చేయాలో తెలిపే పరిశోధనశాల ఉంది. ఇది ప్రపంచంలోనే గొప్ప నిర్మాణంగా ఖ్యాతికెక్కింది. ఇక్కడి సముద్రతీరం చెట్లూ చేమలతో నిండి ఉంటుంది. అస్పెండోస్ థియేటర్: దీనిని క్రీ.పూ. 5వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ నిర్మించిన ఇండోర్ స్టేడియం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దాదాపు 18 వేల మంది కూర్చొనే విధంగా దీనిని నిర్మించారు. అప్పటి రాజులు ఈ నగరంలోనే కరెన్సీ నాణాలు ముద్రించేవారు. క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ చక్రవర్తి ఇక్కడికి వచ్చాడట. అతడు దీన్ని ఆక్రమించుకోకుండా అక్కడి ప్రజలు ఒప్పందం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని గ్రీకులు పరిపాలించిన కాలంలో నిర్మించిన కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న బాసిలికా, అగోరా, నింఫేయం, నది మీద నిర్మించిన వారధులు. పముక్కాల్: ఒకప్పుడు ఇది రోమన్లకు, గ్రీకులకు, బైజాన్టైన్ రాజులకు ముఖ్యమైన ప్రదేశం. రాతి పర్వతం లాంటి ఈ ప్రదేశం డెనిజ్లి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీనిలో వేడి నీటి చలమలున్నాయి. సున్నపు నిల్వలు అధికంగా ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నీటి చలమలతో పాటు సున్నపురాయి పక్కనే హిరాపొలీస్ అనే పురాతన నగర నిర్మాణాలు కనిపిస్తాయి. చరిత్ర - సంస్కృతి చరిత్ర: యూరప్, ఆసియా ఖండాలలో భూభాగాన్ని కలిగిన దేశం టర్కీ. నల్ల సముద్రం, మధ్యధరా సముద్రాలు దేశానికి రెండువైపులా ఉండడం వల్ల అటు ఇటు వెళ్లే ఓడలను సురక్షించే బాధ్యత టర్కీ దేశం మీద ఉంది. వెయ్యేళ్ల క్రితం ఈ దేశం బైజాన్టైన్ రాజవంశపు పాలనలో ఉండేది. ఆ తర్వాత 500 ఏళ్లు ఒట్టోమాన్ వంశపు రాజుల పాలనలో ఉంది. ఒకప్పుడు ఈ దేశపు రాజులు యూరప్ ఖండంలోని చాలా భూభాగాన్ని తన అధీనంలో ఉంచుకున్నారు. క్రీ.పూ. 7 వేల సంవత్సరాల క్రితం ఈ దేశపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ కాలంలో అనటోలియా వంశస్థులు, హైతీలు రాజ్యపాలన చేస్తూ వచ్చారు. క్రీ.పూ. 1800లో పర్షియన్లు, మెసిడోనియన్లు, రోమన్లు పరిపాలన చేశారు. ఒకప్పటి రాజధాని ఇస్తాంబుల్‌ను బైజాన్టియంగా పిలిచేవాళ్లు. క్రీ.శ.330 లో దానిపేరు కాన్స్టాంట్ నోపుల్గా మార్చారు. టర్కీ దేశంలో పుట్టిన ఒట్టోమాన్ రాజవంశం 14వ శతాబ్దంలో టర్కీ దేశాన్ని పాలించింది. 16వ శతాబ్దంలో ముస్లిం రాజులు టర్కీ దేశాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత తిరిగి ఒట్టోమాన్లు అధికారంలోకి వచ్చి మొదటి ప్రపంచయుద్ధ సమయం దాకా పరిపాలన చేశారు. 1923లో స్వతంత్రరాజ్యంగా అవతరించింది. సంస్కృతి: టర్కీ దేశంలో ప్రజలు వివిధ దేశాల నుండి పూర్వం వలస వచ్చి స్థిరపడడంతో భిన్నసంస్కృతులు దర్శనమిస్తాయి. ముఖ్యంగా మొదట ఆసియా ఖండంలోని స్టెప్పీలు టర్కీకి వచ్చారు. వీరే మొట్టమొదటి తుర్కులు. మధ్యధరా సముద్రంలోని ద్వీపాల నుండి, ఆర్మేనియా ప్రాంతం నుండి ప్రజలు వలస వచ్చారు. అలాగే కుర్దులు, ఇరానియన్లు ఈ దేశంలో మనకు కనిపిస్తారు. 90 శాతం ప్రజలు టర్కిష్ భాషను ఉపయోగిస్తారు. ప్రభుత్వ సహాయం అందడం వల్ల రైతులు వ్యవసాయం బాగా చేస్తారు. దేశ భూభాగంలో 25 శాతం భూమి అటవీ ప్రాంతం. దేశంలో అన్ని రంగాలలో పురుషాధిక్యత ఉంటుంది. మసీదులలో మగవాళ్ళు మాత్రం ప్రార్థనలు చేస్తారు. మహిళలు ఇంటి వద్దే చేస్తారు. జనాభాలో అధికశాతం మంది ప్రజలు దారిద్య్రంలో ఉండడం, ప్రభుత్వపరంగా ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు పశ్చిమ జర్మనీ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి చమురు దేశాలలో పనుల కోసం వలస వెళుతూ ఉంటారు. దేశంలో ముస్లిములు ఎక్కువ కాబట్టి మహిళలు టెసెట్టూర్ అనే దుస్తులు ధరిస్తారు. తలకు స్కార్ఫ్ చుట్టుకుంటారు. కొంతమంది మహిళలు బురఖా ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో సల్వార్ కమీజ్‌లు ధరిస్తారు. యువత మాత్రం ప్యాంటు, షర్టు ధరిస్తారు. అయితే తలకు స్కార్ఫ్ తప్పనిసరి. పురుషులు ప్యాంటు, షర్టు, కుర్తా, పైజమా ధరిస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నవారు మంచి సూట్ ధరిస్తారు. ఇస్తాంబుల్: ఇస్తాంబుల్ నగరం రాజధానులకే రాజధానిగా పేరొందింది. రోమన్లకు, బైజాన్టైన్ రాజులకు, ఒట్టోమాన్ రాజులకు రాజధానిగా వెలుగొందింది. ప్రపంచ పర్యాటకులకు కేంద్ర బిందువు లాంటి ఈ నగరంలో చర్చిలు, రాజభవనాలు, మసీదులు, షాపింగ్ బజార్ , మ్యూజియాలు ఉన్నాయి. దక్షిణం వైపు నల్ల సముద్రం, ఉత్తరం వైపు మధ్యధరా సముద్రం మధ్యలో ఇస్తాంబుల్ నగరం ఉండడం వల్ల పర్యాటకులను ఆకర్షిస్తోంది. టాప్కాపి రాజప్రాసాదం, హగియా సోఫియా మ్యూజియం, రెండు సముద్రాలను ప్రత్యక్షంగా చూడగలగడం ఈ నగరం ప్రత్యేకత.