ఐదుగురు మృతి
14 మందికి గాయాలు
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు.
తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్‌టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment