
అంకారా : టర్కీ రాజధాని అంకారాలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైస్పీడు రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రైలు అంకారా నుంచి కోన్యకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment