
భువనేశ్వర్: ఒడిశాలో ఓ బస్సుపై 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గంజాం జిల్లా గోళాంతర ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో జంగల్పాడు నుంచి చికరాడ వెళ్తున్న బస్సు మందరాజ్‌పూర్ వద్ద విద్యుదాఘాతానికి గురైంది. బస్సులోని వారంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నారని బెర్హంపూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీవో) సర్దార్ జయంత్‌కుమార్ మహాపాత్ర వెల్లడించారు. మృతులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పద్మనాభ బెహరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment