injured people
-
ఘోర ప్రమాదం... ఓవర్ టెక్ చేయబోయి ట్రక్‌ని ఢీ కొట్టిన బస్సు
వడోదర: వడోదర కపురై బ్రిడ్జ్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. నివేదిక ప్రకారం.... లగ్జరీ బస్సు ట్రక్‌ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ట్రక్కుని ఢీ కొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్స్సు రాజస్తాన్‌లోని భిల్వారా నుంచి ముంబైకి బయలు దేరుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. #Vadodara 04 died, 15 injured in a collision between a bus and a truck. The bus was going from Bhilwara, #Rajasthan to #Mumbai, collided with the truck while trying to overtake. pic.twitter.com/m7YaHFGJDz — Our Vadodara (@ourvadodara) October 18, 2022 (చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....) -
కుటుంబం విధివశం
సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు–లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. సింధనూరు తాలూకా జవళగెరె సమీపంలోని బాలయ్య క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు బెంగళూరు నుంచి కారు (టీఎస్–08 హెచ్‌జీ–5584)లో హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఎదురుగా తెలంగాణ వైపు నుంచి సింధనూరు వైపు వస్తున్న లారీ (ఏపీ–21 వై–6498) ఢీకొంది. ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా రోడ్డు రక్తమోడింది. కారులోని నలుగురూ మరణించారు. మృతులు ప్రదీప్ (35), పూరి్ణమ (30), వీరి కూతుళ్లు జతిన్ (12), మాయిన్(7). స్థానిక సీఐ ఉమేష్ కాంబ్లె, బళగానూరు ఎస్ఐ వీరేష్ సిబ్బందితో లారీలోకి దూసుకుపోయిన కారును పొక్లెయినర్‌తో బయటకు లాగి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్ల నిద్రమత్తే ప్రమాదానికి కారణమనే అనుమానం ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు) -
అతివేగం.. తీసింది ప్రాణం
సాక్షి, బెంగళూరు: భద్రత మరిచి అతి వేగాన్ని నమ్ముకుని జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్నారు. గమ్యం చేరే ఆతృతలో సమిధలవుతున్నారు. రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో రోడ్లపై నెత్తుటేర్లు పారాయి. నాలుగు పెద్ద ప్రమాదాల్లో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. బెళగావి జిల్లా, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య జిల్లాల్లో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బెళగావిలో ఏడుగురు కూలీలు.. ఆదివారం తెల్లవారుజామున బెళగావి తాలూకా కల్కాళ బ్రిడ్జ్ వద్ద ట్రాక్స్ క్రూయిజర్ వాహనం పల్టీ కొట్టడంతో 7 మంది మృత్యువాత పడ్డారు. రెండు వాహనాల్లో కూలీలు బయల్దేరారు. డ్రైవర్లు పోటాపోటీగా దూసుకెళ్తుండగా ఒక క్రూయిజర్ కల్యాళ బ్రిడ్జ్ వద్ద పల్టీ కొడుతూ పడిపోయింది. ఏడు మంది అక్కడికక్కడే మరణించారు. మృతులను అడియప్ప చిలబావి (32), బసవరాజ్ దళవి (32), బసవరాజ్ హనుమన్నవర్ (35), ఆకాశ్ (40), రామన్న (29), ఫక్కీరప్ప (34), మల్లప్ప (39)గా గుర్తించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. మండ్యలో గ్రామ ఉద్యోగులు... వేగంగా వచ్చిన లారీ ఒకటి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నాగమంగళ తాలూకా ఎం. హోసూరు గేట్ వద్ద శనివారం రాత్రి జరిగింది. నాగమంగళ తాలూకా బీరేశ్వరపురకి చెందిన దేవరాజు (42), పాండవపుర తాలూకా దేసముద్ర గ్రామానికి చెందిన మంజునాథ్ (35), కెన్నాళు గ్రామానికి చెందిన రైతు మంజునాథ్ (64) మృతి చెందారు. గ్రామ లెక్కాధికారిగా పనిచేసే దేవరాజు సొంత పని కోసం గ్రామ సహాయకుడు మంజునాథ్, స్వామిని కారులో తీసుకుని వెళ్లాడు. తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. టెక్కీ ప్రాణాలు తీసిన బైక్ రేస్ సరదా బైక్ రైడింగ్ ఒక టెక్కీ ప్రాణం తీసింది. సూరజ్ (27) అనే బైకిస్టు మృత్యువాత పడ్డాడు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా గవిమఠం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సూరజ్ స్నేహితుడు అజయ్‌తో కలసి వీకెండ్ రైడ్‌కు డుకాటీ బైక్‌లలో వెళ్లారు. బెంగళూరు నుంచి అతివేగంగా వెళ్లిన ఇద్దరు గవిమఠం జాతీయ రహదారి–72 వద్ద పరస్పరం పోటీ పడుతూ వాయువేగంతో దూసుకెళ్తున్నారు. సూరజ్ అదుపుతప్పి ఒక టెంపో ట్రావెలర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టి బైక్‌తో సహా పల్టీలు కొడుతూ వంతెన పైనుంచి కిందకి పడిపోయాడు. సూరజ్ అక్కడికక్కడే మరణించాడు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిత్రదుర్గలో మహిళ చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె పట్టణం బళ్లారి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టింది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన బైకిస్టు అలీ (55) తీవ్రంగా గాయపడగా, భార్య ఇర్ఫాన (47) మరణించింది. మృతదేహాన్ని, క్షతగాత్రున్ని చెళ్లకెరె ఆస్పత్రికి తరలించారు. (చదవండి: షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!) -
ఘాట్రోడ్లో ఆటో బోల్తా
సీతంపేట: వివాహ శుభకార్యానికి వెళ్లి మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసుకుని అనంతరం ఆటోలో తిరుగుప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలో అదుపు తప్పి ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా పడడంతో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగతా 14 మంది స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతాడలో ఓ వివాహ శుభకార్యానికి మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన 16 మంది ఆటోలో వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. గెడ్డగూడ సమీపంలో ఘాట్ రహదారి వద్ద ఆటో దిగుతుండగా ముందు ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్తున్నారు. ఎదురుగా మరో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 16 మందితో పాటు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు గాయపడడంతో వెంటనే ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కోవిడ్ బాధిత బాలలకు ప్రభుత్వం అండ) -
పెళ్లి వ్యాన్ బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం
గూడెంకొత్తవీధి : వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ పెళ్లి వ్యాను అదుపుతప్పిన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం వివరాలివి. మండలంలోని గాలికొండ గ్రామానికి చెందిన వధువు, లక్కవరం గ్రామానికి చెందిన వరుడికి బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఓ వ్యానులో గాలికొండ నుంచి లక్కవరం గ్రామానికి రాత్రి వారంతా చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విందు భోజనం అనంతరం స్వగ్రామానికి పయనమయ్యారు. బూసుల ఘాట్ రోడ్డులో బొలేరో వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. ప్రమాదంలో గుమ్మాలగొంది గ్రామానికి చెందిన కాకూరి నర్సింగరావు(45), బత్తునూరు గ్రామానికి చెందిన శ్రీహరి(18), శామ్యూల్(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జి.కె.వీధి పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారి రామ్‌నాయక్ వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 15 మంది కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. వాహనంలో ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఘాట్‌లో రక్షణ గోడ లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెను ప్రమాదం సంభవించేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సమీర్ తెలిపారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
కొట్లాటలో ముగ్గురికి గాయాలు
పార్వతీపురం టౌన్: కొట్లాటలో ముగ్గురికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన కర్రి అన్నపూర్ణమ్మ తన ఖాళీ స్థలంలో బోరు తీయడానికి ప్రయత్నించగా, ఆమె సోదరుడు ముదిలి కన్నంనాయుడు, అతని భార్య సంతోషి, కుమారుడు రామారావు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొట్లాటకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన అన్నపూర్ణమ్మ, కృష్ణమూర్తి, సంతోషి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నారాయణపట్నం బ్లాక్ రాయివలస గ్రామానికి చెందిన తాడంగి లచ్చయ్య గేదెగొమ్మి గ్రామం నుంచి తన గ్రామానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా.. పార్వతీపురం మండలం అడారు గ్రామం దాటిన తర్వాత చెరువు మలుపు వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెయ్యి సారా ప్యాకెట్లు స్వాధీనం) -
TS: మానవత్వం చాటుకున్న మంత్రి సబితా
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ డెంటల్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిఫ్ట్ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చదవండి: Fine For No Mask In Telangana: మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రిని తరలించారు. వారికి వికారాబాద్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించి మానవత్వాన్ని చాటుకున్నారు. చదవండి: ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం -
రోడ్డు ప్రమాదం: బస్సును ఢీ కొట్టిన డంపర్
నోయిడా: గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమున ఎక్స్‌ప్రెస్ హైవేపై డంపర్, బస్సును ఢీకొట్టడంతో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దన్‌కూర్ పోలీసులు తెలిపారు. కాగా ఈ బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ బుద్దానగర్కు చెందిన డంపర్ నోయిడా నుంచి జేవర్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో జమున ఎక్స్‌ప్రెస్‌వేకు 13 కిమీ దూరంలో ఉండగా డంపర్ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ పైకి దూసుకేళ్లి అటూగా వెళుతున్న యూపీ రోడ్‌వే బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ బస్సు ఆగ్రా నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై దన్‌కూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన 14 మందిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఆయన చెప్పారు. -
నైవేలీ విద్యుత్ ప్లాంట్‌లో పేలిన బాయిలర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు. -
‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పరామర్శించారు. ఈ అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని జీటీబీ, మాక్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అల్లర్లలో గాయపడిన బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలో ఎవరు గాయపడకుండా తప్పించుకోలేదు. హిందువులు, ముస్లింలు, పోలీసులు అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’ అని సీఎం కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. (అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్) Met with victims of violence being treated at the GTB Hospital and Max Hospital. Hindus, Muslims, policemen - none have escaped unhurt.. this madness must end immediately pic.twitter.com/Nh2VI6BRTG — Arvind Kejriwal (@ArvindKejriwal) February 25, 2020 ఈ అల్లర్లు పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఇప్పటివరకూ ఒక హెడ్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మరణించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. నిరసనలు తలెత్తిన ప్రాంతంలో చర్యలు తీసుకువడంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
ఒడిశాలో బస్సుకు షాక్..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ బస్సుపై 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గంజాం జిల్లా గోళాంతర ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో జంగల్పాడు నుంచి చికరాడ వెళ్తున్న బస్సు మందరాజ్పూర్ వద్ద విద్యుదాఘాతానికి గురైంది. బస్సులోని వారంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నారని బెర్హంపూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో) సర్దార్ జయంత్‌కుమార్ మహాపాత్ర వెల్లడించారు. మృతులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పద్మనాభ బెహరా తెలిపారు. -
దేవరగట్టులో హైటెన్షన్
-
బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది!
సాక్షి, మోత్కూరు: అంతిమ యాత్రలో కాల్చిన బాణసంచా వారికి ప్రాణసంకతమైంది. అంతిమయాత్ర నిర్వహించే సమయంలో తేనెటీగలు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియల్లో భాగంగా బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చారు. బాణసంచా అక్కడి వేపచెట్టు పై ఉన్న తేనె తుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 40మంది గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
ఎస్కార్ట్ ప్రమాద బాధితులకు అందిన సాయం
* మెరుగైన వైద్యసేవలు డిప్యూటీ సీఎంకు, ‘సాక్షి’కి బాధితుల కృతజ్ఞతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇందుకు అవసరమైన బిల్లును మంజూరు చేయడంతో వారిని మంగళవారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నవంబర్ 30వ తేదీన వరంగల్ జిల్లా రఘునాధపల్లి సమీపంలోని యశ్వంత్‌పూర్ వద్ద రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన నయీముల్లాఖాన్, బంధువులు గులాంగౌస్, ఆయన భార్య సాదిక్ ఉన్నీసా బేగం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరికి చేసిన వైద్యానికి సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధితుల గోడును ఈ నెల 6న ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి ఉపముఖ్యమంత్రి రాజయ్య స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు బాధితుల వైద్య చికిత్స బిల్లులను చెల్లించారు. పరిస్థితి మెరుగుపడటంతో బాధితులు గులాంగౌస్, సాదిక్ ఉన్నీ సాబేగం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యకు, ‘సాక్షి’కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.