
బాయిలర్ నుంచి ఎగసిపడుతున్న పొగ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్‌లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment