boiler balst
-
శ్రీశైలంలో పేలిన స్టీమ్ బాయిలర్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీశైల దేవస్థానంలోని అన్నదాన భవనం వంటశాల వద్ద ఉన్న స్టీమ్ బాయిలర్ మంగళవారం పేలింది. దేవస్థానం పరిపాలన కార్యాలయానికి దగ్గరలో అన్నదాన భవనాన్ని నిర్మించి భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేసి అందిస్తున్నారు. భోజనాలు సిద్ధం చేసేందుకు రెండు స్టీమ్ బాయిలర్లను వాడతారు. చదవండి: జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా కార్తీకమాసం కావడంతో రోజూ 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భోజనం, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బంది వేకువజాము నుంచే వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు వాటర్ ప్రెజర్ పెరిగి ఒక స్టీమ్ బాయిలర్ పేలింది. -
గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..
భారూచ్: గుజరాత్ లోని ఓ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్ జిల్లాలోని దహెజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు. మరణించిన వారంలో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణిం చా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. -
నైవేలీ విద్యుత్ ప్లాంట్‌లో పేలిన బాయిలర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు. -
పేలిన బాయిలర్
కాశీబుగ్గ: దివాన్ జీడి పరిశ్రమలో బాయిలర్ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేటర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ అనంతపురం రెవెన్యూ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమ యజమాని తాళాసు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల సమయంలో ఆపరేటర్ పల్లెటి ఢిల్లేశ్వరరావు బాయిలర్‌ను ఆన్ చేశారు. నాలుగు బస్తాల (320 కేజీల) జీడి పిక్కలను బాయిలర్‌లో వేశారు. వెంటనే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆపరేటర్ చిక్కుకున్నాడు. కళ్లల్లోకి కెమికల్‌తో కూడిన ఉష్ణం తగలడంతో చూపుపోయే పరిస్థితి నెలకొంది. చెతులు కాలిపోయాయి. కాలుకు తీవ్రగాయమైంది. ఢిల్లేశ్వరరావు కేకలు వేయడం స్థానికంగా ఉన్న మహిళలు బయటకు తీసుకువచ్చారు. వెంటనే పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కళ్లు, ఎముకల డాక్టర్లు వైద్యం అందించారు. పదిహేను రోజులు దాటితే కాని పరిస్థితి చెప్పలేమన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు, జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి చిన్నారావు పరిశీలించారు. ప్రమాద తీరును స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. 100 మీటర్ల దూరంలో ఎగిరిపడిన పైపు.. బాయిలర్ పేలుడు ధాటికి గొడలతోపాటు యంత్రం విడిభాగాలు పగిలిపోయాయి. పరిశ్రమ కాలుష్యాన్ని బయటకు పంపే పైపు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న మరో జీడి పరిశ్రమ రక్షణ గొడపై పడింది. ప్రతి రోజు 30 మందికి పైగా కూలీలు పనిచేయనున్నారు. ఉదయం సమయంలో ప్రమాద జరగడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ.. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడు ఢిల్లీశ్వరరావును కలిసి పరామర్శించారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ఇండస్ట్రీయల్ ప్రాంతం అధ్యక్షుడు మల్లా రామేశ్వరం తదితరులున్నారు. పేద కుటుంబానికి పెద్ద కష్టం.. దివాన్ కాష్యూ ఇండస్ట్రీలో 13 ఏళ్లుగా ఢిల్లేశ్వరరావు కుటుంబం పనిచేస్తుంది. స్వగ్రామం మొగిలిపాడు నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. పరిశ్రమలోని చిన్న గదిలో ఉంటున్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు క్యాన్సర్ బారినపడి ఐదేల్ల కిత్రం మృతి చెందాడు. పెద్ద కుమారుడు అనీల్‌కుమార్ ఇంటర్ చదువుతున్నాడు. భార్య పార్వతీ ఇదే పరిశ్రమలో పిక్కలు వలిచే పని చేస్తోంది. పరిశ్రమకు నైట్ వాచ్‌మేన్, గేట్‌మేన్‌గా కూడా ఈ కుటుంబ సభ్యులే ఉంటున్నారు. -
వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం
-
ద్వారకా తిరుమలలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అన్నదాన భవనం పక్కన బాయిలర్ పేలడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్ చేసే బాయిలర్ సేఫ్టీ వాల్వ్ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. -
చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బాయిలర్ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. కాటేదాన్‌లోని చాక్లెట్స్ తయారు చేసే ఎస్ఏ ఫుడ్ కంపెనీలో సోమవారం ఉదయం బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కారన్ అనే కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
బాయిలర్ పేలి ఇద్దరికి గాయాలు
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అన్నవరం పట్టణానికి చెందిన కె.కొండబాబు, జి.శివప్రసాద్ అనే యువకులు స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హోటల్ లోని బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాద సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.