
భారూచ్: గుజరాత్ లోని ఓ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్ జిల్లాలోని దహెజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు. మరణించిన వారంలో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణిం చా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment