Lifeless
-
విషాదం: నిమిషాల వ్యవధిలో భార్యాభర్తలు మృతి..
సాక్షి, పర్వతగిరి(జనగామ): వివాహ బంధంతో ఒక్కటైన వారు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. చివరకు మృత్యువులోనూ తమనెవరూ విడదీయలేరన్నట్లుగా నిమిషాల తేడాతో కన్నుమూసిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దారం అన్నపూర్ణ(65), దారం కాశయ్య(68) దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో నివనిస్తున్నారు. కాగా, అన్నపూర్ణ కొద్ది రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. అప్పటి నుంచి భార్యకు అన్నీ తానై కాశయ్య సేవలు చేస్తున్నాడు. ఇంతలోనే అన్నపూర్ణ సోమవారం అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఆమె భర్త కాశయ్య సైతం శ్వాస విడిచారు. దీంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పక్షవాతం బారిన పడిన తనకు భర్త సేవ చేస్తుండడాన్ని తట్టుకోలేక అన్నపూర్ణ మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కుమారుడు, కుమార్తెలు చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించగా, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు దారం పూర్ణచందర్, దారం రాము, దారం వెంకన్న, చిదురాల వేణుగోపాల్, దారం సంతోష్ పాల్గొన్నారు. -
పాపం.. 3 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు.. అంతలోనే..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): బొలెరో ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం తాలూకాలోని లింగన ఖాన్ దొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంటి వద్ద సిద్దార్థ(3)అనే చిన్నారి ఆడుకుంటుండగా అదే సమయంలో ఒక బొలెరో వాహనం రివర్స్ చేసుకునే క్రమంలో టైర్లు బాలుడిపైకి ఎక్కాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆడుకుంటున్న పిల్లవాడు అంతలోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ఉడాయించాడు. ఇడపనూరు ఎస్ఐ కరెమ్మ ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు -
ఆపదలో ఆదుకునే అంబులెన్స్.. వారి పాలిట మృత్యు శకటమైంది..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఆపదలో ఆదుకునే అంబులెన్స్ మృత్యు శకటమైంది. స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చిత్రదుర్గ పట్టణానికి సమీపంలో జరిగింది. హొళల్కెరె రోడ్డు తిరుమల డాబా వద్ద హొళెల్కెరె నుంచి కాంతరాజు (22), శ్రీకాంత(20), నంజుండ(20) అనే యువకుడు స్కూటీపై చిత్రదుర్గకు వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన అంబులెన్స్ వారిని వేగంగా ఢీకొనడంతో దూరంగా ఎగిరిపడి చనిపోయారు. అంబులెన్స్ చెట్టును ఢీకొని నిలిచిపోగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంబులెన్స్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. చదవండి: డీజే బంద్ చేయమన్నందుకు పోలీసులపైనే దాడి.. -
దారుణం: పుట్టింటికి వెళ్లొద్దన్నందుకు ఎంత పనిచేసింది..
సాక్షి, మైసూరు(కర్ణాటక): తన పుట్టింటికి వెళ్లడానికి భర్త ఒప్పుకోక పోవడంతో మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరు నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని మానసినగరలో నివాసం ఉంటున్న బాలాజీ, విద్యాలక్ష్మీ (24) తమిళనాడు వాసులు. బాలాజీ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే భార్య పుట్టింటికి వెళ్లడానికి అంగీకరించకపోవడంతో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన విద్యాలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మైసూరు దక్షిణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆపై -
టీకా తీసుకున్న డాక్టర్ మృతి
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ ఆస్పత్రి యజమాని, ఓ మెడికల్ కాలేజీలో ఆర్ధోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ జయప్రకాశ్ (58) ఈ నెల 17వ తేదీన కోవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య అధికారులు మాట్లాడుతూ డాక్టర్ జయప్రకాశ్ హృద్రోగంతో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పారు. ఆయన మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ కాదని అన్నారు. -
భారీ భూకంపం
మాముజు: భారీ భూకంపం ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తు న్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు. జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు. -
కోవాగ్జిన్‌కు ఎదురుదెబ్బ.. వలంటీర్ మృతి
భోపాల్: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్ మృతి చెందాడు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భోపాల్‌లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డిసెంబర్ 12న కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన కూలి అయిన దీపక్ మర్వాయి అనే వ్యక్తికి(వలంటీర్) సైతం వ్యాక్సిన్ ఇచ్చారు. అతడు డిసెంబర్ 21న మరణించాడు. అయితే, దీపక్ మర్వాయి విష ప్రయోగం కారణంగా మరణించినట్లు అనుమానాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ చెప్పారు. అసలైన కారణమేంటో నిర్ధారించాల్సి ఉందన్నారు. కోవాగ్జిన్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దీపక్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 21న ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తుదిశ్వాస విడిచాడని పేర్కొన్నారు. అసలైన వ్యాక్సిన్ ఇచ్చారా? లేదా? వలంటీర్ దీపక్ మృతిపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. ఫేజ్–3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు అతడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించలేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొంది. 9 రోజుల తర్వాత మరణించాడంటే అందుకు తమ వ్యాక్సిన్ కారణం కాదని ప్రాథమిక సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది. అయితే, హ్యూమన్ ట్రయల్స్‌లో భాగంగా దీపక్ మర్వాయికి అసలైన కోవాగ్జిన్ ఇచ్చారా? లేక సాధారణ ఔషధం(ప్లాసిబో) ఇచ్చారా? అనేది నిర్ధారణ కాలేదు. -
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
అహ్మదాబాద్: కెమికల్ గోడౌన్లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన అహ్మదాబాద్ నగర శివారులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మరణించిన 9 మంది కూలీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. గాయపడిన మరో 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కెమికల్స్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బలగాలు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని వెలికితీసి అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే అందులో 12 మంది మరణించారని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద అణువణువూ గాలిస్తున్నామని, ప్రమాదంపై విచారణ సాగిస్తున్నామని డీసీపీ అశోక్ మునియా చెప్పారు. కెమికల్ గోడౌన్‌లోని బాయిలర్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని స్థానిక ఫ్యాక్టరీల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో గోడలు పగిలి స్లాబ్ కూలిందని గోడౌన్ పక్కన భవనాల్లో పనిచేస్తున్న కూలీలు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ట్వీట్ చేశారు. -
మూడు వారాలు.. 128 మరణాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కొన్ని రోజులుగా వందల్లో నమోదవుతోంది. గత 3 వారాలుగా పాజిటివ్ కేసులు నమోదవు తున్న వేగంలోనే మరణాలు సైతం నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు (జూన్ 21 వరకు గణాంకాల ప్రకారం) కరోనా బారినపడి 210 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో జూన్ 1 నుంచి 21 వరకు ఏకంగా 128 మంది మరణించారు. మొత్తం మరణాల్లో ఈ సంఖ్య 60.95% కావడం గమనార్హం. అదే మే 21 నుంచి చూస్తే మరణాల శాతం 80.95గా ఉంది. మే 21 నుంచి జూన్ 21 మధ్య 170 మంది మృత్యువాతపడ్డారు. ఈ లెక్కన కేసులు పెరుగుతున్న క్రమంలోనే మరణాలు సైతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత 4రోజులుగా కేసుల నమోదు మరింత పెరిగింది. గత శుక్ర, శనివారాల్లోనే వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఏకంగా 730 మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరణాల శాతం 3.22గా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 2.69 శాతంగా ఉంది. దీంతో దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువ మరణాలే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఒక్కరోజులో 380 మంది మృతి
న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఒక్క రోజులో 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 3,43,091కు, మరణాలు 9,900కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,53,178. బాధితుల్లో 1,80,012 మంది(52.46 శాతం) చికిత్సతో కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి చేరింది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,661 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని, వీరిలో 42 మంది మృతి చెందారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. -
ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్..!
కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే గగనం. బెడ్ దొరికినా సరైన చికిత్స అందదు. దురదృష్టం వెంటాడి ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి గంటల తరబడి వేచి చూడాలి. శ్మశానంలో అంతిమ సంస్కారానికి మరో ఆరు గంటలు క్యూలో ఉండాలి. ఇదంతా ఏ సౌకర్యాలు లేని చోట కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో దుస్థితి... న్యూఢిల్లీ: ఢిల్లీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనాకి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క వారంలోనే ఢిల్లీలో కోవిడ్ మృతులు 156% పెరిగిపోయాయి. ఇప్పటివరకు 1,271 మంది మరణించారు. కేసుల సంఖ్య 39 వేలకు చేరుకుంది. జూలై 31 నాటికి కేసుల సంఖ్య 5 లక్షలు దాటిపోతుందని, అప్పటికి లక్ష పడకలు కావాలని ఢిల్లీలోని ఆప్ సర్కార్ అంచనా వేస్తోంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నగరం మొత్తమ్మీద ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 వేల వరకు పడకలు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా నిండిపోవడంతో కోవిడ్ రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్ ! ఢిల్లీలో కరోనా నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తోంది. . సగటున ముగ్గురికి పరీక్షలు చేస్తే ఒక కేసు పాజిటివ్‌గా నమోదు అవుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన ఢిల్లీవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే మూడింట ఒక వంతు మందికి కోవిడ్ నిర్ధారణ అవుతుందని తేలుతోంది. ముంబై, చెన్నై వంటి నగరాలతో పోల్చి చూస్తే ఢిల్లీ అత్యంత తక్కువగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత నెలలో రోజుకి 7 వేల పరీక్షలు నిర్వహించే రాజధానిలో హఠాత్తుగా వాటి సంఖ్య గతవారంలో 5 వేలకు తగ్గిపోయింది. దీంతో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఢిల్లీలో పరిస్థితి భయంకరంగా, బీభత్సంగా, అత్యంత దయనీయంగా మారిందని వ్యాఖ్యానించిన సుప్రీం వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. -
కరోనా వైరస్ మృత్యుపాశం
న్యూఢిల్లీ/ముంబై: ఇండియాలో కరోనా వైరస్ మృత్యుపాశం విసురుతోంది. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. కేసులు 3 లక్షలకు, మరణాలు 9 వేలకు చేరువవుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజులోనే 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు.. కేవలం 24 గంటల వ్యవధిలో 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 396 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దేశంలో కరోనా భూతం అడుగుపెట్టాక ఒక్క రోజులో ఇన్ని కేసులు, మరణాలు వెలుగుచూడడం ఇదే మొదటిసారి. భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 2,97,535 కరోనా కేసులు నమోదయ్యాయని, 8,498 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 1,41,842 కాగా, 1,47,194 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. అంటే 49.47 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తుండడంతో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. 17.4 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేసింది. తొలిసారిగా లాక్డౌన్ విధించిన (మార్చి 25న) సమయంలో కరోనా కేసులు కేవలం 3.4 రోజుల్లో రెండింతలు అయ్యాయని గుర్తుచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 53,63,445 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వివరించింది. ఇందులో 1,50,305 శాంపిళ్లను గత 24 గంటల్లో పరీక్షించినట్లు తెలిపింది. మహారాష్ట్ర మంత్రికి పాజిటివ్ మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ ముండేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. మంత్రి ధనుంజయ ముండే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రజారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే చెప్పారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడైన ధనుంజయ ఇటీవల రాష్ట్ర కేబినెట్ భేటీకి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఎన్సీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో కరోనా బారినపడిన మంత్రుల్లో మూడో వ్యక్తి ధనుంజయ ముండే. జితేంద్ర అహ్వాద్, అశోక్ చవాన్ అనే మంత్రులకు గతంలోనే కరోనా సోకింది. మళ్లీ లాక్డౌన్ లేదు లాక్డౌన్ నిబంధనల్లో ఇచ్చిన సడలింపులను ఉపసంహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం చెప్పారు. అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న ఆర్థి్థక వ్యవస్థను పునరుద్ధరించడానికి దశలవారీగా సడలింపులు ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని తప్పుపట్టారు. పుకార్లు పుట్టించడం నేరమని హెచ్చరించారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. మహారాష్ట్రలో కల్లోలం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. గత 24 గంటల్లో 3,493 మంది కరోనా బారినపడ్డారు. 127 మంది బాధితులు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,141కు, మరణాల సంఖ్య 3,717కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 47,796 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో 56 రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం బీజింగ్‌లో రెండు కేసులు నిర్థారణయ్యాయి. దీంతో చైనాలో కొత్తగా 10 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ఒకటి నుంచి మూడో తరగతి దాకా ప్రాథమిక పాఠశాలలు తెరవాలన్న నిర్ణయాన్ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..
భారూచ్: గుజరాత్ లోని ఓ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్ జిల్లాలోని దహెజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు. మరణించిన వారంలో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణిం చా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. -
కరోనా @ రెండు లక్షలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,909 కేసులు బయటపడ్డాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. తాజాగా 217 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,07,615కి, మరణాలు 5,815కి చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,01,497 కాగా 1,00,303 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31,333 మంది, తమిళనాడులో 13,706, గుజరాత్లో 11,894 మంది కోలుకున్నారని తెలియజేసింది. రికవరీ రేటు 48.31 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.80 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానానికి ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే, స్పెయిన్, ఇటలీ వరుసగా తొలి 6 స్థానాల్లో నిలిచాయి. అండమాన్‌లో 100% రికవరీ రేటు రికవరీ రేటు విషయంలో అండమాన్ నికోబార్ తొలిస్థానంలో నిలుస్తోంది. ఇక్కడ కరోనా బాధితులంతా(33 మంది) కోలుకున్నారు. పంజాబ్‌లో 86.12 శాతం, గోవాలో 72.15 శాతం, చండీగఢ్‌లో 71.09 శాతం మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 50 శాతానికిపైగానే నమోదైంది. 40 లక్షలు దాటిన ఆర్టీ–పీసీఆర్ టెస్టులు వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షల మార్కును దాటినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటలకల్లా 41,03,233 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 24 గంటల్లో 1,37,158 టెస్టులు చేసినట్లు తెలియజేసింది. మొత్తం 688 ల్యాబ్‌ల్లో రోజుకు 1.4 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రోజుకు 2 లక్షల టెస్టులు చేసేలా సామర్థ్యాన్ని పెంచుతున్నామని వివరించింది. 15 రోజుల్లో రెట్టింపైన కేసులు భారత్‌లో జనవరి 30న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి10 నాటికి 50 కేసులు బయటపడ్డాయి. మే 18న లక్షకు చేరుకున్నాయి. అంటే 110 రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. తర్వాత మరో లక్ష కేసులు నమోదు కావడానికి 15 రోజుల సమయమే పట్టింది. -
24 గంటల్లో 5 వేలకు పైగా కేసులు
-
ఒక్కరోజులో 194 మంది మృతి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇండియాలో కరోనా మహమ్మారి సృష్టించిన మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు.. కేవలం 24 గంటల్లో 194 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. కొత్తగా 6,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాలు 4,531కు, పాజిటివ్ కేసులు 1,58,333కు ఎగబాకాయి. దేశంలో మొత్తం క్రియాశీల కరోనా కేసులు 86,110 కాగా, 67,691 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అంటే 42.75 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా సంభవించిన 194 మరణాల్లో మహారాష్ట్రలోనే 105 మరణాలు వెలుగుచూశాయి. గుజరాత్లో 23, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 8 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 1,897 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటికే 56,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 18,545, ఢిల్లీలో 15,257, గుజరాత్లో 15,195, రాజస్తాన్‌లో 7,703, మధ్యప్రదేశ్‌లో 7,261, ఉత్తరప్రదేశ్‌లో 6,991 కేసులు బయటపడ్డాయి. కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావిస్తున్న కేరళలో తాజాగా ఒక్కరోజే 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1,088కు చేరింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కేరళలో కరోనాతో మృతి చెందాడు. అతడు రాజస్తాన్ నుంచి మే 22న కేరళకు వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడని కేరళ వెల్లడించింది. -
ఆర్థిక రాజధాని అతలాకుతలం
ఎందరికో అదొక కలల నగరం ఉపాధి అవకాశాలతో ఎందరినో అక్కున చేర్చుకున్న నగరం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శ్రమించే నగరం ఇప్పుడు కరోనా కాటుతో విలవిలలాడుతోంది. ముంబైవాసులకు ప్రతీ రాత్రి కాళరాత్రిగానే మారుతోంది. ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 62 శాతం ముంబైలోనే ఉన్నాయి. ఒకే రోజు 1,002 కేసులు నమోదు కావడంతో 32 వేలు దాటేశాయి. కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. కేసుల పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే జూన్ చివరి నాటికి ముంబైలో లక్ష కేసులు దాటిపోతాయని ఒక అంచనా. ఇక మృతుల సంఖ్య 1,065కి చేరుకుంది. కారిడార్లలోనే శవాలు ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రి రోగులతో కిటకిటలాడిపోతోంది. మరణాలు ఎక్కువగా ఉండడంతో మార్చురీ సదుపాయాలు సరిపోక కారిడార్లలోనే శవాలను ఉంచుతున్నారు. ‘మార్చురీలో ఒకేసారి 27 మృతదేహాలను మించి ఉంచడానికి సదుపాయం లేదు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో చేసేదేమీలేక స్ట్రెచర్లపై శవాలను కారిడార్లకి ఇరువైపులా ఉంచుతున్నారు’అని కేఈఎం ఆస్పత్రి ఉద్యోగుల సంఘం నేత సంతోష్ ధూరి చెప్పారు. ఇక ఆరోగ్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు లేని విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె అంగీకరించారు. ‘ఆక్సిజన్ సరఫరాతో కూడిన 10వేల పడకలు తక్షణమే కావాలి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకి చెందిన డాక్టర్లు కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. వైరస్ సోకుతున్న వారిలో అత్యధికులకి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది’అని మంత్రి చెప్పారు. ముగ్గురు రోగులకు ఒకే ఆక్సిజన్ ట్యాంక్ ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్సనందించే సియోన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకులకు కొరత ఉండడంతో ముగ్గురు రోగులకు ఒకటే అందిస్తున్నారు. ఎక్కువ రోగులకు చికిత్స అందించడానికి వీలుగా మంచాల మధ్య దూరాన్ని తగ్గిస్తున్నారు. ఒకవైపు మృతదేహాలను పక్కనే ఉంచుకొని మరోవైపు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆందోళన పెంచుతున్నాయి. ‘ముంబైలో వైద్య సౌకర్యాలు, సుశిక్షితులైన సిబ్బంది ఎక్కువగానే ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో కేసులు పెరిగిపోతుంటే ఆస్పత్రులు తట్టుకోలేకపోతున్నాయి. కలల నగరం కాళరాత్రి నగరంగా మారింది’’అని ప్రజారోగ్య వైద్య నిపుణురాలు డాక్టర్ స్వాతి రాణె అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ ముంబైలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆస్పత్రి సదుపాయాలు ఇలా.. ► ముంబైలో 20,700 పడకల సామర్థ్యం ఉన్న 70 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. మరో 20 వేల పడకలతో 1500 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ► సగటున ప్రతీ 550 మందికి ఒక పడక ఉండాలని ప్రపంచ ఆరోగ్య శాఖ అంచనా వేస్తే ముంబైలో ప్రతీ 3 వేల మందికి మాత్రమే ఒక పడక ఉంది. ► పదేళ్లలో ముంబై జనాభా విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో ముంబై కూడా ఒకటి. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 32 వేల మంది వరకు నివసిస్తారు. పెరిగిన జనాభాకి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు పెరగలేదు. కరోనా వ్యాప్తి కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఇప్పటికే 1.1 ట్రిలియన్ డాలర్లతో నిధిని ఏర్పాటు చేసిన జపాన్ మరో 296 బిలియన్ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ అనుబంధ బడ్జెట్‌కు జపాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిధులను దెబ్బతిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి, స్థానిక ప్రభుత్వాలకు రాయితీలకు ఖర్చు చేస్తారు. -
మహారాష్ట్రలో అనూహ్యం
సాక్షి ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రను హడలెత్తిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేలు చేరడానికి రెండు నెలల సమయం పట్టగా, ఆ తర్వాత కేవలం 16 రోజుల్లో 30 వేల కేసులు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 50 వేలు దాటింది. దేశవ్యాప్తంగా చూస్తే మే 25 నాటికి కరోనా బాధితుల సంఖ్య 1.38 లక్షలు ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 50,231 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మంది మృతి చెందారు. కోలుకున్నవారు 14,600 మంది... రాష్ట్రంలో ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా మరోవైపు కరోనా నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కోలుకున్న వారి సంఖ్య 29 శాతానికిపైగా ఉంది. ఇప్పటి వరకు 50 వేల మంది కరోనా బారిన పడగా 14,600 మందికి నయమైంది. ముంబైలో 30 వేల కేసులు.. రాష్ట్రంలో కేసులు 50 వేలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 30 వేలకుపైగా నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్ జోన్‌గా మారింది. నగరంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మే 17 వరకు 21 వేలు ఉండేది. గత వారం రోజుల్లో దీని బారినపడినవారి సంఖ్య మరో 10 వేలు పెరిగింది. దీంతో మే 24 నాటికి ముంబైలో కరోనా బారినపడిన వారి సంఖ్య 30,542కు చేరింది. 7,083 మంది వైరస్ నుంచి కోలుకోగా, 988 మంది దీని బారిన పడి మృతిచెందారు. ముంబైలో రైలు ఎక్కేందుకు వేచి చూస్తున్న వలస కూలీలు -
ఒక్కరోజులో 6,767 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్డౌన్ అమల్లో ఉండగానే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా ఆనవాళ్లు బయటపడిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. అలాగే గత 24 గంటల్లో 147 మంది కరోనా బాధితులు మరణించారు. అంటే గంటకు ఆరుగురు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,31,868కు, మరణాలు 3,867కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 73,560కి ఎగబాకాయి. 54,440 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 41.28 శాతానికి చేరడం కొంత సానుకూలాంశంగా మారింది. రాబోయే 2 నెలలు అత్యంత కీలకం ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత ఇప్పటికే అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ వసతితో కూడిన ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడ్డాయని తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, జనసాంద్రత అధికంగా ఉన్నచోట ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ శనివారం 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు అధికంగా నిర్వహించాలని ఆదేశించారు. -
లాటిన్ అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు
బెర్లిన్: లాటిన్ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను సరిగ్గా అమలు చేయకపోవడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాటిన్ అమెరికాలో ఇప్పటిదాకా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30వేల మందికిపైగా మరణించారు. చిలీ, పెరూ, ఈక్వెడార్‌లో కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. ఇక చైనాలో శనివారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తుగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసిన జర్మనీలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చర్చిలు, రెస్టారెంట్లు ప్రారంభించాక వైరస్ వ్యాప్తి పెరిగింది. ఎన్నో రకాలుగా భౌతిక దూరం నిబంధనల్ని అమలు చేసినప్పటికీ ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
ఇద్దరు తప్ప అందరూ..
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం కరాచీ విమానాశ్రయం దగ్గర్లోని ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలింది. శనివారం ఉదయానికి ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి సంఖ్య బయటకు వచ్చింది. విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో 51 మంది పురుషులు, 31 మంది మహిళలు, 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రులకు తరలించారు. 19 మృతదేహాలు ఎవరివనేది గుర్తించినట్లు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో 25 ఇళ్లు ధ్వంసం కాగా, 11 మంది నివాసితులు గాయపడ్డారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ అసోíసియేషన్ డిమాండ్ చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. సాంకేతిక సమస్యల వల్ల విమానం కూలి ఉండవచ్చని, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. -
కనికరం చూపని కరోనా
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. కేవలం 24 గంటల వ్యవధిలోనే 6,654 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం కావడం గుబులు పుట్టిస్తోంది. తాజాగా 137 మందిని కరోనా వైరస్ బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,25,101కు, మరణాలు 3,720కు చేరాయి. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 69,597 కాగా, 51,783 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆర్థిక ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రికవరీ రేటు 41.39 శాతానికి పెరిగిందని తెలియజేసింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. -
కుప్పకూలిన పాక్ విమానం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్డౌన్ అనంతరం పాకిస్తాన్లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ వెల్లడించారు. మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్ సజ్జాద్ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్ టవర్ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. -
ఒక్కరోజులోనే 4,987
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. అలాగే గత 24 గంటల్లో 120 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌కరోనా కేసులు 53,946 కాగా, 34,108 మంది బాధితులు చికిత్సతో కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మూడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 30,706, గుజరాత్లో 10,988, తమిళనాడులో 10,585 పాజిటివ్ కేసులు బహిర్గతం అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం మరణాలు 2,872 కాగా, ఇందులో 1,135 మరణాలు కేవలం మహారాష్ట్రలో సంభవించాయి. గుజరాత్లో 625 మంది, మధ్యప్రదేశ్‌లో 243, పశ్చిమ బెంగాల్లో 232, ఢిల్లీలో 129, రాజస్తాన్‌లో 126, ఉత్తరప్రదేశ్‌లో 104, తమిళనాడులో 74 మంది కరోనా బారినపడి మృతి చెందారు. 13.6 రోజుల్లో రెట్టింపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు ప్రస్తుతం 13.6 రోజుల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ తెలి పింది. 14 రోజుల నుంచి 11.5 రోజులుగా ఉన్న ఈ గడువు గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 3.1 శాతమని పేర్కొంది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని తెలిపింది. కరోనా కేసులు 106 రోజుల్లో 80 వేల మార్కును దాటాయని, అభివృద్ధి చెందిన యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇందుకు 44–66 రోజుల సమయం పట్టిందని పేర్కొంది. -
వదల బొమ్మాళీ..!
లాక్‌లు ఎత్తేస్తున్నారు. ఆంక్షల చట్రంలోంచి జనం బయటకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేలా మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. కానీ కరోనా భూతం ఇంకా భయపెడుతోంది. రోజుకి 20వేలకి పైగా కేసులు, వెయ్యికి పైగా మృతులు నమోదవుతూ అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కొమ్ములు వంచడానికి అగ్రరాజ్యం చేస్తున్న కృషిలో విజయాలెన్ని ? వైఫల్యాలేంటి ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో వైరస్‌ను తేలిగ్గా తీసుకున్నారు. జనవరిలో కరోనా అదుపులో ఉందని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫిబ్రవరిలో కరోనాపై పోరాటంలో విజయం సాధించామని ధీమాగా చెప్పారు. మార్చి వచ్చేసరికి స్వరం మారింది. ఇది చైనా వైరస్ అని, వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందని ఆరోపిస్తూ ఆ దేశంపై పరోక్ష యుద్ధానికి దిగారు. దీనిని మహమ్మారిగా పేర్కొని జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. చిమ్మ చీకటి సొరంగం ప్రయాణంలో వెలుగు రేఖ కనిపిస్తోందని ఏప్రిల్ అంతా ఆశతో చూశారు. మే వచ్చేసరికి అమెరికా చరిత్రలోనే కోవిడ్–19ని అతి పెద్ద దాడిగా అభివర్ణించారు. పెరల్ హార్బర్ కంటే, సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి కంటే అతి పెద్దదని ప్రకటించారు. దీనిపై చైనా ఎందుకు ముందే హెచ్చరించలేదని, ఆ దేశమే వైరస్ వ్యాప్తిని అరికట్టి ఉండాల్సిదంటూ ప్రత్యక్ష పోరాటానికే తెరతీశారు. మే 16 నాటికి 15 లక్షల కేసులు, 90 వేల మరణాలతో అగ్రరాజ్యం అతలాకుతలమవుతోంది. అయితే న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నిలకడగా ఉంటే అరిజోనా, అలబామా, మినోసెటా వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. విజయాలు ► సామాజిక దూరం పాటించడంలో అమెరికాలో చాలా రాష్ట్రాలు విజయం సాధించాయి. ఒక పది రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల కరోనాని బాగా కట్టడి చేశాయి. లేదంటే ఈ పాటికి కోటి మందికి వైరస్ సోకేదని ఒక అంచనా. ► కోవిడ్–19 కేసులు లక్షల్లో నమోదు కావడంతో ఆస్పత్రి సదుపాయాలు లేక జనం అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్ మసాచుసెట్స్ రాష్ట్రాల్లో కొత్త ఆస్పత్రుల్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరికైనా కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్ ఖాళీ లేదు అన్న మాటే అక్కడ వినిపించదు. ► వెంటిలేటర్స్ తయారీలో కూడా అగ్రరాజ్యం భళా అనిపించుకుంది. ట్రంప్ సర్కార్ 70 ఏళ్ల క్రితం నాటి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ని బయటకు తీసి జనరల్ మోటార్స్ వంటి సంస్థలకు వెంటిలేటర్లను రూపొందించే పని అప్పగించారు. వెంటిలేటర్ కొరతతో ఇకపై ఒక్క రోగి కూడా మరణించే అవకాశమే లేదు. భారత్‌తో పాటు లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు కూడా వెంటిలేటర్లను సరఫరా చేస్తోంది. ► కరోనా వైరస్‌కు టీకాయే పరిష్కారం. ట్రంప్ ప్రభుత్వంతో పాటు , బిల్‌గేట్స్ ఫౌండేషన్ వందల కోట్ల డాలర్లు ఈ పరిశోధనలకే ఖర్చు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. రెమ్‌డెసివర్ మందుని కరోనా రోగులకు వాడడానికి అనుమతినివ్వడం వల్ల కూడా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఈ మందు ఇచ్చిన వారిలో 31శాతం మంది కోలుకుంటున్నారు. వైఫల్యాలు ► ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడంలో అగ్రరాజ్యం కూడా మినహాయింపు కాదు. కోవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులకు పీపీఈ కిట్లకు కొరత ఇంకా ఉంది. ప్రాజెక్టు ఎయిర్‌బ్రిడ్జ్ పేరుతో ఇతర దేశాల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాలను భారీగా దిగుమతి చేసుకుంది కానీ కొరతను అధిగమించ లేకపోయింది. ఇప్పుడు అమెరికాయే స్వయంగా తయారీ మొదలు పెట్టినా పంపిణీలో లోపాలు కనిపిస్తున్నాయి ► పెరిగిపోతున్న కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి నిపుణులైన వైద్యులు కూడా లేరు. దీంతో ట్రంప్ సర్కార్ ఇతర దేశాల నుంచి సుశిక్షితులైన వైద్యుల్ని తీసుకురావడానికి హెచ్1బీ వీసాలకు అనుమతులిచ్చింది. ► మరే ఇతర దేశం చేస్తున్నట్టుగా కోవిడ్–19 పరీక్షలు చేస్తున్నామని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ కమ్మేసిన మొదట్లో నిర్లక్ష్యం చేసిన ట్రంప్ ఏప్రిల్ నాటికి కానీ కళ్లు తెరవలేదు. ఇప్పటికీ దేశ జనాభాలో కేవలం 2.74% మందికే పరీక్షలు నిర్వహించారు. ► కోవిడ్–19ని ఎదుర్కోవడానికి అమెరికా చరిత్రలోనే అత్యంత భారీగా దాదాపు 3లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ అయితే ప్రకటించారు కానీ దాని కేటాయింపులు సరిగా జరపలేదు. లాక్డౌన్ కారణంగా వేతనాలు లభించని వారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికే సగానికి పైగా నిధులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో వేశారే తప్ప, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే పని జరగలేదు. ► బీజింగ్ నగర వాసులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్–19 మహమ్మారి పుట్టిన చైనాలోనే కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు వాడటం ప్రారంభమైంది. ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే మాస్క్‌లు వాడని మొట్టమొదటి నగరంగా బీజింగ్ నిలవనుంది. -
కరోనా మరణాలు 2,752
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది కరోనా కాటుతో కన్నుమూశారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు 85,940కి, మరణాలు 2,752కి ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 53,035 కాగా, 30,152 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. 35.08 శాతం మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. ఇక్కడ గత 24 గంటల్లో 49 మంది మరణించారు. గుజరాత్లో 20 మంది, పశ్చిమ బెంగాల్లో 10 మంది, ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు, తమిళనాడులో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాలు 2,752 కాగా, ఇందులో 1,068 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించడం గమనార్హం. -
మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టం
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ‘స్టే ఎట్ హోం’ నిబంధనలను వేగంగా ఎత్తివేస్తే అమెరికాలోని రాష్ట్రాలు మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు లాక్డౌన్ నిబంధనలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఫాసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికాలోని సుమారు 24 రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో డాక్టర్ ఫాసీ సెనేట్ కమిటీకి ఓ వాంగ్మూలమిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనను వేగంగా ఎత్తివేయడం వల్ల పరిస్థితులు అదుపు చేయలేని స్థితికి చేరుకునే అవకాశముందని స్పష్టం చేశారు. కరోనా టీకా, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నప్పటికీ అది పాఠశాలలు తెరిచేలోపు మాత్రం కాదని ఫాసీ అన్నారు. మరోవైపు లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన దాదాపు 17 రాష్ట్రాలు ఇందుకు సంబంధించి వైట్‌హౌస్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదని అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిపింది. చైనాపై అమెరికా ఆంక్షల బిల్లు కోవిడ్ విచారణకు సంబంధించి చైనాపై ఆంక్షలకు అమెరికా సంసిద్ధమౌతోంది. చైనాలో ప్రబలిన కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను ప్రపంచానికి తెలపాలనీ, లేని పక్షంలో చైనాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కి అధికారాన్నిచ్చే బిల్లుని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. సెనేటర్ లిండ్ సే గ్రాహం సహా ఎనిమిది మంది సెనేటర్లు రూపొందించిన బిల్లును కాంగ్రెస్ ఎగువసభలో ప్రవేశపెట్టారు. -
‘జువ్వాడి’ కన్నుమూత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి అంత్యక్రియలను ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గోదావరి నది తీరంలో సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. జువ్వాడి పార్థివ దేహం వద్ద మంత్రులు టి.హరీశ్‌రావు, ఈట ల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మాజీ హోం మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, కలెక్టర్ రవి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు నివాళులర్పించారు. సర్పంచ్ నుంచి మంత్రి దాకా..:జువ్వాడి రత్నాకర్‌రావు మొదట సర్పంచ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుం చి తిమ్మాపూర్ సర్పంచ్‌గా 12 ఏళ్లు పని చేశా రు. 1979లో జగిత్యాల బ్లాక్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీ పీ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989లో బుగ్గారం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి స్వతం త్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండాకుల గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 1994 ఎన్నికల్లో ఓటమి పాలైన జువ్వాడి.. 1999, 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి గెలుపొందారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007–09 వరకు దేవాదాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన తరువాత 2009, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్ సంతాపం: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నాకర్‌రావు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. టీపీసీసీ నేతల సంతాపం: రత్నాకర్‌రావు మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రత్నాకర్‌రావు పార్థివ దేహం వద్ద మంత్రి హరీశ్ రావు తదితరులు -
విజయనగరంలో కరోనా తొలి మరణం!
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ నెల 4వ తేదీన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌కు, అక్కడి నుంచి టీబీ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు అక్కడ కోవిడ్ 19 నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. మొన్నటివరకూ రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో తొలి కరోనా కేసు బయటపడటం... రెండు రోజులకే తొలి మరణం చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన మహిళకు నేరుగా 51 మంది, పరోక్షంగా 21 మందితో సంబంధాలు కలిగినట్లు అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరందరినీ క్వా రంటైన్ సెంటర్లకు తరలించారు. గ్రామం చుట్టుపక్కల పది బఫర్ జోన్లలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా శనివారం నాటికి విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. వీరికి మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిబంధనలు మరింత కఠినం జిల్లాలో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆదివారం నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులందరికీ కోవిడ్ 19 నిర్థారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు ఆందిస్తున్నారు. కంటైన్మెంట్జోన్, చుట్టుపక్కల బఫర్‌జోన్‌లో ఉన్న 10 గ్రామాలకు రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. కంటైన్మెంట్జోన్లో ఉన్నవారిని ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ఇతరుల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 175 కుటుంబాలకు 5 కిలోల వంతున బియ్యం, పాలు ఇంటింటికి ఆందజేశారు. ఇంటింటా ముమ్మర సర్వే కరోనా వ్యాధి లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో బాధ పడుతున్న వారి వివరాలను వైద్యాధికారి నేతృత్వంలో ఆశ, ఏఎన్ఎం, వలంటీర్‌తో కూడిన 3 బృందాలు 160 ఇళ్లకు వెళ్లి సర్వే చేసి గ్రామస్తులకు తగిన సూచనలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ, బీసీ కాలనీల్లో సర్వే పూర్తి చేశారు. బఫర్ జోన్లో ఉన్న గ్రామాల్లో కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా ఒకరినుంచి ఒకరికి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ ప్రాంతంలో సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పంచాయతీ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కంటైన్మెంట్ ప్రాంతంలో పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేశారు. -
గుజరాత్ హాట్‌స్పాట్
కరోనా వచ్చిన చిట్టచివరి రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. మార్చి 19న తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత వ్యాప్తి నెమ్మదిగా ఉంది. 500 కేసులు నమోదు కావడానికి 25 రోజులు పట్టింది. అందరూ ఈ రాష్ట్రం సేఫ్ జోన్ అనుకున్నారు. కానీ హఠాత్తుగా హాట్‌స్పాట్‌గా మారింది. గత వారంలో కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌కే కరోనాతో ఊపిరాడడం లేదు. పారామిలటరీ దళాలు మోహరించాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులకు చికిత్స వ్యూహాత్మకంగా ఎలా అందించాలో అక్కడ వైద్యులకి వివరించారు. కరోనా కేసులతో పాటు మృతులు గుజరాత్లో ఎక్కువైపోవడం దడ పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 60 వేల వరకు ఉంటే అందులో 60శాతం కేసులు ఎనిమిది నగరాల్లోనే నమోదయ్యాయి. అందులో 42 శాతానికిపైగా కేసులు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఉన్నాయి. ఎందుకిన్ని కేసులు? 1: గుజరాత్ వాణిజ్యానికి, పర్యాటకానికి పెట్టింది పేరు. జనవరి–మార్చి కాలంలో అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహించి 14 రోజులు క్వారంటైన్లో ఉంచారు. కానీ స్క్రీనింగ్ లోపాలు, క్వారంటైన్ పకడ్బందీగా అమలు చేయడంలో ఆరోగ్య అధికారుల వైఫల్యంతో కేసులు పెరిగాయి. 2: ఢిల్లీలో మర్కజ్ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకి గుజరాత్ నుంచి 1500 మంది వెళ్లారు. వీరంతా అహ్మదాబాద్, సూరత్, వడోదరావాసులే. ఇరుకు ప్రాంతాల్లోనే నివసించే జనాభా ఇక్కడ అధికం. ప్రస్తుతం ఈ మూడు నగరాలే రాష్ట్రంలో కోవిడ్ హాట్స్పాట్లుగా మారాయి. అహ్మదాబాద్ ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తూ ఉంటారు. అందుకే కరోనా నిరోధక చర్యలు పాటించడం కత్తి మీద సాములా మారింది. 3: ఆరోగ్య రంగానికి ఈ రాష్ట్రంలో ఖర్చు చేసేది చాలా తక్కువ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఆరోగ్యానికి 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో సమానంగా మహిళలు, శిశువుల్లో పౌష్టికాహార లోపాలున్నాయి. దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని యూనిసెఫ్ వంటి సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. పోషకాహారం లోపాలతో రోగనిరోధక శక్తి లేక కరోనా వైరస్ సులభంగా దాడి చేస్తోంది. ప్రాణాలు కూడా ఎక్కువగానే తీస్తోంది. 4: అహ్మదాబాద్‌లో ఆర్థిక అసమానతలు, అభివృద్ధిలో తేడాలు ఎక్కువ. తూర్పు అహ్మదాబాద్‌లో జనసాంద్రత ఎక్కువ. తక్కువ ఆదాయం వచ్చే జనాభా అధికంగా నివసిస్తుంది. దరియాపూర్వంటి ప్రాంతాల్లో ఇళ్లలో ఒకేగది ఉంటుంది. అందులో 50శాతానికిపైగా ఇళ్లల్లో ఒకే గదిలో ఐదుగురు జీవిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందుకే గుజరాత్ మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 70శాతం (5వేలకు పైగా) అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి. 5: దేశంలో కరోనా వ్యాపించిన రాష్ట్రాల్లో ఇంచుమించుగా చివరిది గుజరాత్. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి ఆరేడు రోజుల ముందు మాత్రమే ఇక్కడ తొలి కేసు నమోదైంది. అయినా కేసులన్నీ ఎగబాకి ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత స్థానంలోకి చేరుకుంది. అయితే తొలినాళ్లలో ఇక్కడ కరోనా పరీక్షలు సరిగా నిర్వహించలేదు. గత వారం రోజులుగా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకి 3 వేలకి పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షకు పైగా పరీక్షలు చేశారు. అది కూడా కేసులు పెరగడానికి ఒక కారణమన్న వాదనలైతే ఉన్నాయి. -
కరోనా కర్కశత్వం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. దేశంలో కరోనా కేసులు 50 వేల మార్కును దాటేశాయి. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్కరోజులో 89 మంది కోవిడ్‌తో మరణించారు. కొత్తగా 3561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంమరణాల సంఖ్య 1,783కు, కేసుల సంఖ్య 52,952కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్ కరోనా కేసులు 35,902. ఇప్పటివరకు 15,266 మంది కోవిడ్ బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 28.83 శాతానికి పెరిగిందని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 11 రోజులు పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. 13 రాష్ట్రాలు, యూటీల్లో జీరో దేశంలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. కేరళ, ఒడిశా, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపూర్, గోవా, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు రాలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 13,57,442 పరీక్షలు నిర్వహించామన్నారు. సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన ఇద్దరు జవాన్లు కోవిడ్ కారణంగా మరణించారని, ఈ దళంలో కొత్తగా 41 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు గురువారం చెప్పారు. కరోనా వైరస్ బాధితులకు గంగా నదీ జలంతో చికిత్స అందించడంపై అధ్యయనం (క్లినికల్ స్టడీస్) చేయాలన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనపై ముందుకెళ్లకూడదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గురువారం నిర్ణయించింది. దీనిపై శాస్త్రీయమైన సమాచారం అవసరమని స్పష్టంచేసింది. -
హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సాగిందిలా.. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు. -
50 వేలకు చేరువలో...
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ మహమ్మారి కాటు వల్ల మరణాలు, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో 126 మంది మృతి చెందారు. అలాగే కొత్తగా 2,958 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంబంధిత మరణాలు 1,694 కు, పాజిటివ్ కేసులు 49,391కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 33,514 కాగా, గత 24 గంటల్లో 1,457 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 14,183కు చేరిందని, రికవరీ రేటు 28.72 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారే. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని కేంద్రం నిర్ధారించలేదు. కరోనాతో కొందరు డాక్టర్లు కూడా మరణించారు. ఎంతమంది చనిపోయారో కేంద్రం బయట పెట్టడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 69 మంది వైద్యులకు కరోనా సోకింది. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వ్యూ హంలో భాగంగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషే ధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) బుధవారం నోటి ఫికేషన్ జారీ చేశారు. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా, భారత్‌లోనే విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళకరం గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరోనా సంబంధిత మరణాలు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపేతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి, చికిత్స అందించాలన్నారు. -
వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
సాక్షి, కోనరావుపేట (వేములవాడ): సర్పంచ్ అయితేనే లక్షలు సంపాదించుకునే రోజులివి. ఎమ్మెల్యే అయితే తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి కూడబెట్టుకునే కాలమిది. అలాకాకుండా ప్రజాసేవే పరమావధిగా సాదాసీదా జీవనం సాగించిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచాన పడి.. చేతిలో చిల్లిగవ్వలేక.. వైద్యం అందక బుధవారం మృతిచెందాడు. చిన్నపాటి రేకులషెడ్డులో ఉంటూ ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు. -
ఒక్కరోజులో 2,411 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు.. 24 గంటల్లో కరోనాతో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 2,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,223కు, పాజిటివ్ కేసులు 37,776కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 26,565 కాగా, 10,017 మంది బాధితులు చికిత్సతో కోలుకొని ఇళ్లకు చేరారు. అంటే రికవరీ రేటు 26.52 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఇప్పటిదాకా 10.40 లక్షల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. మే 17 వరకు విమానాల నిలిపివేత: డీజీసీఏ లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వాణిజ్య ప్రయాణికుల విమా నాలను మే 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రకటించారు. -
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. -
అయ్యో ‘గోవిందా’.. ఇలా వెళ్లిపోయావా!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా లేక.. ఆరోగ్యం క్షీణించి ఆఖరుకు నడి రోడ్డుపైనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక సంఘటన భాగ్యనగరం నడిబొడ్డున జరిగింది. బహదూర్ (75) అనే మద్యం దుకాణం ఉద్యోగి ఇదే రీతిలో మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం నగరవాసులను కలవరపరుస్తోంది. బీదర్‌లోని బాల్కీ గ్రామానికి చెందిన గోవిందు (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూజ, ఇద్దరు కుమార్తెలు, నెలన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. బోడుప్పల్ పరిధి రాజశేఖర్ కాలనీలో నివాసముంటున్న గోవింద్.. ఏప్రిల్ రెండో వారంలో అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతుండటంతో ఇరుగు పొరుగు వారు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని ఏప్రిల్ 24న 108 సాయంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. కరోనా పరీక్షలు అవసరం లేదని, చెస్ట్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫారసు లేఖ రాసి పంపారు. అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా దొరకలేదు. దీంతో చెస్ట్ ఆస్పత్రికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బొగ్గులకుంట చౌరస్తాలో గురువారం రాత్రి గోవిందు రోడ్డుపై పడిపోయాడు. గమనించిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు గోవిందును పరీక్షించగా, మృతి చెందినట్లు గుర్తించారు. గోవిందు వద్ద ఉన్న కాగితాలను పరిశీలించి, బంధువులకు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. చదవండి: 17దాకా లాక్డౌన్.. సడలింపులివే..! పప్పా వెళ్లిపోతున్నాడు.. విగతజీవిగా పడి ఉన్న గోవిందును చూసి భార్య పూజ కన్నీరు మున్నీరయ్యింది. గోవిందు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా, ‘పప్పా..వెళ్లిపోతున్నాడు’అంటూ పిల్లలు రోదించడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. కాగా, తాను గత వారం రోజులుగా మేడిపల్లి పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నానని.. వారు తన భర్తకు కింగ్‌కోఠిలో చికిత్స అందిస్తున్నారనే చెప్పారని.. గురువారం ఉదయం కూడా వారి నుంచి అదే సమాధానం వచ్చిందని పూజ పేర్కొంది. -
24 గంటలు..77 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి స్త్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో ఏకంగా 77 మంది కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. అలాగే కొత్తగా 1,755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 1,152కు, పాజిటివ్ కేసుల సంఖ్య 35,365కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 25,148 కాగా.. 9,064 మంది(25.63 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. స్వదేశంలో పీపీఈ కిట్ల తయారీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. 2.22 కోట్ల పీపీఈ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.43 కోట్ల కిట్లను భారత్‌లోని స్వదేశీ సంస్థలే తయారు చేస్తున్నాయని పేర్కొంది. గతంలో పీపీఈ కిట్ల కోసం విదేశాలలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వీటిని తయారు చేసే సంస్థలు భారత్‌లో 111 ఉన్నాయని కేంద్ర సాధికార సంఘం–3 చైర్మన్ పి.డి.వాఘేలా తెలిపారు. దేశంలో ప్రస్తుతం 19,398 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో 59,884 వెంటిలేటర్లు మనదేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు. అలాగే 2.49 కోట్ల ఎన్–95/ఎన్–99 మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.49 కోట్ల మాస్కులను స్వదేశీ సంస్థల నుంచే కొంటున్నామని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తిని నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచామన్నారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) దళంలో ఐదుగురు జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ 12 మంది తాత్కాలిక జైలుకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను అధికారులు తాత్కాలిక జైలుకు తరలించారు. వీరిలో 9 మంది థాయ్‌లాండ్ దేశస్తులు. వీరంతా ఓ మసీదులో ఉండగా, ఏప్రిల్ 2న అదుపులోకి తీసుకున్నారు. నాందేడ్ గురుద్వారా మూసివేత మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ హుజూర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేశారు. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో తాజాగా 91 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో జోన్ల వారీగా ‘లాక్డౌన్’ ఎత్తివేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మే 3వ తేదీ తర్వాత తమ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను జోన్లవారీగా ఎత్తివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం చెప్పారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తామని, తొందరపాటుకు తావులేదని అన్నారు. ముంబై, పుణే, నాగపూర్, ఔరంగాబాద్ వంటి రెడ్జోన్లలో లాక్డౌన్ ఎత్తివేతపై ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపుపై ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరించడం తగదని, అలాచేస్తే అక్కడ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ఏ దేశానికిపైనా నిజమైన సంపద ఆ దేశ ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. -
1,823 కేసులు.. 67 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 1,075కు చేరుకోగా కేసుల సంఖ్య 33,610కు పెరిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 67 మంది చనిపోగా కొత్తగా 1,823 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,162 కాగా 8,372 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన జాబితాలో మహారాష్ట్రలో 32 మంది, గుజరాత్ 16, మధ్యప్రదేశ్ 11, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, తమిళనాడు, ఢిల్లీల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 432 మంది, గుజరాత్లో 197 మంది, మధ్యప్రదేశ్‌లో 130, ఢిల్లీలో 56 మంది, రాజస్తాన్‌లో 51 మంది, ఉత్తరప్రదేశ్‌లో 39 మంది, తమిళనాడులో 27 మంది, బెంగాల్లో 22 మంది, కర్ణాటకలో 21 మంది, పంజాబ్‌లో 19 మంది చనిపోయారు. 60వేల మందిని పంపించాం 72 దేశాలకు చెందిన 60వేల మందిని స్వదేశాలకు పంపించినట్లు హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను రప్పించేందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ విషయంలో అక్కడి దౌత్య సిబ్బంది అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. మన దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు నేవీ, వైమానిక దళం సహకారం తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది. -
కరోనాతో ఢిల్లీ వాసి మృతి
నెల్లూరు(అర్బన్): కరోనా పాజిటివ్ సోకి నగరంలోని నారాయణ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. అధికారుల సమాచారం మేరకు.. ఢిల్లీకి చెందిన 9 మంది వ్యక్తులు మత ప్రార్థనల కోసం రెండునెలల క్రితం నెల్లూరుకు వచ్చారు. వీరంతా ఒకే ప్రార్థనా మందిరంలోనే ఉండే వారు. ఢిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వారు సైతం ఈ వ్యక్తులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యశాఖాధికారులు వారిని ఈనెల 16న ఐసోలేషన్ వార్డులోకి మార్చారు. పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒక వ్యక్తి ఇంతకుముందే పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాజాగా మరో వ్యక్తి చనిపోయాడు. ఇతనికి ఆస్తమా కూడా ఉంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే నగరానికి చెందిన డాక్టర్, ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. మరో మూడు.. సోమవారం సాయంత్రానికి జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో నెల్లూరులోని కోటమిట్టలో రెండు, కొండాపురం మండలం పార్లపల్లిలో ఒకటి ఉన్నాయి. కొండాపురంలో ఇదే తొలి కేసు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పార్లపల్లిని పరిశీలించిన సబ్ కలెక్టర్ కొండాపురం: మండలంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్, కావలి డీఎస్పీ ప్రసాద్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం నుంచి ఎవరినీ బయటకు పోనివ్వద్దని, అలాగే ఇతరులను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలను రెవెన్యూ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ అందించాలన్నారు. కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వరంగల్ నుంచి కొండాపురం, కలిగిరి మండలాలకు చెందిన 20 మంది ఆటోల్లో వచ్చారని ఎస్సై రవిబాబు సమాచారం ఇవ్వడంతో వారిని కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించామన్నారు. -
28,380 కేసులు... 886 మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడినప్పటికీ ప్రాణాపాయం ఉన్నట్లు కాదు. కరోనా బాధితులు చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటిదాకా 6,361 మంది ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అంటే మొత్తం బాధితుల్లో 22.41 శాతం మంది కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 1,463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 28,380కు, కరోనా సంబంధిత మరణాలు 886కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 16 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కేసులేవీ నమోదు కాలేదన్నారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 21,132 కాగా, 6,361 మంది(22.41 శాతం) బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. వాటికి వెనక్కి పంపించాలని సోమవారం సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్జౌ వోండ్ఫో బయోటెక్, ఝూజై లివ్సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
కోవిడ్ మృతులు 2 లక్షలు
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. అమెరికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది. ఇక యూరప్ లక్షా 20 వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో ఆంక్షల సడలింపు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రపంచ దేశాలు లాక్డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. కోవిడ్‌తో అతలాకుతలమైన అమెరికా నెమ్మది నెమ్మదిగా ఆంక్షల్ని ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తోంది. జార్జియా, ఒక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో ఆంక్షల్ని సడలించారు. అగ్రరాజ్యంలో కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ అంటోంది. జార్జియా, ఒక్లహోమా సెలూన్లు, స్పాలకి అనుమతులిస్తే, అలాస్కా రాష్ట్రం రెస్టారెంట్లు, రిటైల్ షాపులు తెరవడానికి అనుమతించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు. 18 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. కనిపించని రంజాన్ శోభ రంజాన్ మాసం మొదలైనా ఎక్కడా సందడి కనిపించడం లేదు. కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై నిషేధం విధించాయి. ఎవరింట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని సూచించాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులతో నిండిపోయే సౌదీ అరేబియాలో మక్కా మసీదు ఎవరూ లేక బోసిపోతోంది. పవిత్రమైన మక్కాలో జన సందోహం లేకుండా చూస్తే చెప్పలేని బాధ కలుగుతోందని మతాధికారి అలీముల్లా వ్యాఖ్యానించారు. ► స్పెయిన్ ప్రజలకి ఆదివారం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తోంది. కోవిడ్ నియంత్రణలోకి రావడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేస్తోంది. చిన్నారుల్ని స్కూళ్లకి పంపడంపై తల్లిదండ్రుల ఇష్టానికే విడిచిపెట్టింది. ► డెన్మార్క్ కళాశాలలను మాత్రమే తెరిచింది. ► ఫ్రాన్స్ మే 11 నుంచి లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తేయాలని నిర్ణయించింది. ► బెల్జియం మే 3 నుంచి రిటైల్ దుకాణాల్ని ప్రారంభించడానికి అనుమతినిచ్చింది ► బ్రిటన్ మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తోంది. ► శ్రీలంక సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేయనుంది. -
మే 15 నాటికి 38,220 మరణాలు?
దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్‌తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్‌ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్–19 మెడ్ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి. -
ఒక్కరోజులో 1,752 పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ/కోజికోడ్: దేశంలో కరోనా కల్లోలానికి కళ్లెం పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా రికార్డు స్థాయిలో 1,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు, మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 17,915 కాగా, 4,813 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో 4 నెలల చిన్నారి బలి కరోనా మహమ్మారి కేరళలో 4 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. మలప్పురం జిల్లాలోని పయనాడ్కు చెందిన ఈ పాప జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 21న కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతే కాకుండా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స పొందు తూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కేరళలో మూడో కరోనా సంబంధిత మరణం ఈ పాపదే. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తొలి చిన్నారి ఈమె. ఆజాద్‌పూర్ మండీలో 300 దుకాణాలు మూసివేత ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలోని డి–బ్లాక్‌లో 300 దుకాణాలను మూసివేశారు. ఈ మండీలో ఒక వ్యాపారి (57) ఏప్రిల్ 21న కరోనా వైరస్ సోకి మరణించాడు. బుధవారం మార్కెట్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. -
'మహా'మ్మారి మెడలు వంచేదెలా ?
ముంబై: మహారాష్ట్రలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏప్రిల్ 30– మే 15 మధ్య మహారాష్ట్రలో కరోనా వికృతరూపాన్ని చూడడానికి సంసిద్ధంగా ఉండాలని ముంబై, పుణెలలో పర్యటించిన కేంద్ర బృందం ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాలుగు రోజుల్లోనే 2 వేలు తాజా కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా ప్రతిరోజూ సుమారుగా 400 కొత్త కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు చేరువలో ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ముంబైలో ఏప్రిల్ 30నాటికి 42,604 కేసులు, మే 15నాటికి 6.56 లక్షలకి కేసులు పెరిగిపోతాయని అంచనా వేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిఠాక్రేకు పరిపాలనా అనుభవం లేకపోవడం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌లో సమన్వయ లోపాలతో కేసులు అత్యధికంగా పెరిగిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముంబైలో 4 వేలకు చేరువగా కేసులు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో హోంశాఖ, ఆరోగ్య శాఖ మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపే ఎన్సీపీకి చెందినవారు కావడం, సీఎంకు వారికి మధ్య సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి.∙పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్అంటున్నారు. ఆస్పత్రుల్లో సన్నద్ధత కరువు ముంబైలో దేశంలో మరెక్కడా లేనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. కానీ అవేవీ కరోనాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేవు. నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్యం సరిగా అందడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలో∙ఉన్నాయి. మృతుల రేటు ఇక్కడ ఎక్కువే. 6–7 శాతం మంది కోవిడ్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ సగటు రేటు 3–4 శాతం కంటే ఇది రెట్టింపు కావడం కలవరపెట్టే అంశం. 4 ‘టీ‘లలో విఫలం ట్రాక్, ట్రేస్, టెస్ట్, ట్రీట్.. కోవిడ్‌పై పోరాటానికి ఈ నాలుగు ‘టీ’లను అమలు చేయాలి. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పనితీరు వీటన్నింటిలోనూ అసంతృప్తిని రాజేస్తోంది. రాజస్తాన్, కేరళ, ఢిల్లీ కంటే ఇక్కడ టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే నిర్ధారణ పరీక్షల్లో కనీసం 17 శాతం కూడా మహారాష్ట్రలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి మర్కజ్ సమావేశాలకు 58 మంది వెళితే ఇప్పటివరకు 40 మందినే గుర్తించారు. మరో 18 మందిని పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వారిలో ఎంతమందికి పాజిటివ్ ఉందో, వారి ద్వారా ఇంకెంతగా విస్తరిస్తుందోనన్న ఆందోళన నెలకొంది. లాక్డౌన్ అంతంత మాత్రం ! కరోనా వ్యాప్తిని ఆపాలంటే లాక్‌డౌన్‌కు మించింది లేదు. కేంద్రం లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించినప్పటికీ మహారాష్ట్రలో యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. బాంద్రా స్టేషన్ దగ్గరకి 3 వేల మంది వలస కార్మికులు రావడం, ఎన్సీపీ నాయకుల ఇళ్ల దగ్గర అనుచరుల హంగామా వంటి చర్యలన్నీ లాక్‌డౌన్‌కు విఘాతం కలిగించాయి. ఇక ఏప్రిల్ 20 తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కి మినహాయింపులు ఇవ్వడంతో ముంబై, పుణే వంటి నగరాల్లో రోడ్లపై జనాల తాకిడి పెరిగింది. వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు వెళ్లడానికి మహారాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ గుప్తా అనుమతినివ్వడం కూడా వివాదాస్పదమైంది. ఇక థానేకు చెందిన ఒక ఇంజనీర్‌ను ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్ సమక్షంలోనే పోలీసులు తీవ్రంగా హింసించిన ఘటన కూడా కలకలం రేపింది. ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టారని ఆ ఇంజనీర్ని ఎన్సీపీ కార్యకర్తలు బలవంతంగా మంత్రి దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడే పోలీసులు అతనిని చితకబాదారు. ఆ పోలీసుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో మరో 14 మంది కూడా కోవిడ్ బారిన పడడం ఆందోళన రేపింది. ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మంత్రికి నెగిటివ్ అని చెప్పడంతో మహారాష్ట్ర సర్కార్ నిజాలు దాచిపెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు ఎక్కువైపోతూ ఉండడంతో శివసేన సంకీర్ణ సర్కార్ ముంబై, పుణెలో లాక్డౌన్ ఆంక్షల్ని మళ్లీ పూర్తి స్థాయిలో విధించింది. వలస కార్మికుల్ని రాష్ట్రం నుంచి వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి ప్రత్యేకంగా రైలు నడపాలని డిమాండ్ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ముప్పుని మహారాష్ట్ర సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. సవాళ్లు విసురుతున్న ముంబై మురికివాడలు రెండు కోట్ల జనాభా ఉన్న ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువ. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 20,634 మంది నివసిస్తారు. నగర జనాభాలో 40 శాతం మంది కనీస వసతుల్లేని ధారావి, గోవండీ, వొర్లికొలివాడ వంటి మురికివాడల్లో తలదాచుకుంటున్నారు. ఈ మురికివాడల్లో కోవిడ్–19 విస్తరిస్తూ ఉండడంతో పరిస్థితులు అదుపులోనికి తేవడానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతారన్న ప్రచారమూ సాగుతోంది. -
20వేల మార్కు దాటేసింది
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బాధితుల సంఖ్య బుధవారానికి 20 వేల మార్కును అధిగమించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రానికి 1,486 కొత్త కేసులు నమోదు కాగా, 49 మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 20,471కి చేరింది. మృతుల సంఖ్య 652కు పెరిగింది. కోవిడ్–19 యాక్టివ్ కేసులు 15,859 కాగా ఇప్పటి వరకు 3,959 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో, 19 శాతం మంది కోలుకున్నట్లయిందని వివరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 251 మంది మృతి చెందగా, ఆ తర్వాత గుజరాత్(95), మధ్యప్రదేశ్(80), ఢిల్లీ(47), రాజస్తాన్(25) నిలిచాయని తెలిపింది. ఇంకా ఉత్తరప్రదేశ్(21), తమిళనాడు (18), కర్ణాటక(17), పంజాబ్‌లో 16 మంది, బెంగాల్లో 15 మంది మరణించారని పేర్కొంది. ముంబైలో లక్షల్లోనే కేసులు? ముంబై: ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లోకి చేరే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం అంచనా వేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఈ కమిటీ తెలిపిన ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 42,604కు, మే 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 6,56,407కి ఎగబాకుతుంది. అప్పటికల్లా 13,636 వెంటిలేటర్లు, 4,83,000 ఐసోలేషన్ బెడ్ల కొరత ఉంటుంది. ముంబైలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆక్సిజన్ సరఫరా లేని ఐసోలేషన్ బెడ్లు 30,481, ఆక్సిజన్ సపోర్ట్‌తో కూడినవి 5,466 వరకు కావాల్సి ఉంటాయి. -
సెల్ తీసుకున్నాడని ఆత్మహత్య
కొమ్మాది(భీమిలి): సరదాగా సెల్‌ఫోన్ గేమ్ ఆడుతుండగా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రారంభమైన చిన్న వాగ్వాదం చెల్లెలి ప్రాణం పోవడానికి కారణమైంది. ఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 4వ వార్డు నేరెళ్లవలసకు చెందిన చెల్లుబోయిన ముసలయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు రాంబాబు, కుమార్తె హంసలీల ఉన్నారు. రాంబాబు ఆనందపురంలోని ఒక కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా.. హంసలీల భీమిలి సీబీఎం స్కూల్లో పదో తరగతి చదివేది. లాక్డౌన్ నేపథ్యంలో వీరిద్దరూ ఇంటివద్దనే ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం హంసలీల సెల్ఫోన్లో గేమ్ ఆడుతుండగా తన అన్న రాంబాబు ఫోన్ లాక్కున్నాడు. ఈ సమయంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన హంసలీల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు కాపాడేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆమె మరణించింది. ఆ సమయంలో తల్లిదండ్రులు పనుల నిమిత్తం వేరే చోట ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కెనడాలో కాల్పుల మోత
టొరంటో: కెనడా చరిత్రలోనే అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో మహిళా పోలీసు అధికారి సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. ఈ దారుణం నొవాస్కోటియా ప్రావిన్స్ పొర్టాపిక్ పట్టణంలో ఆదివారం జరిగింది. గాబ్రియేల్ వర్ట్మన్(51) హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్‌మౌత్‌లో కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తుంటాడు. ఇతడికి పొర్టాపిక్లో సొంతిల్లు ఉంది. పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్ వాహనం మాదిరి ఎస్‌యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పుకూడా పెట్టాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా పోలీసు అధికారి చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనల్లో వర్ట్మన్తోపాటు సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రశాంతతకు మారుపేరైన తమ పట్టణంలో ఇంతటి ఘోరం జరుగుతుందని తాము ఎన్నడూ ఊహించలేదని స్థానికులు తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1989లో మాంట్రియేల్లోని ఎకోల్ పాలిటెక్నిక్ కాలేజీలో మార్క్ లెపిన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 14 మంది మహిళలు చనిపోయారు. -
17,656 పాజిటివ్.. 559 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో తాజాగా 1,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 40 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కు, మొత్తం మరణాల సంఖ్య 559కు చేరిందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్లో ఐదుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 14,255 కాగా, 2,841 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు.. 24 గంటల్లో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్లో 9 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం మరణాలు 559 కాగా, ఇందులో 223 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 7.5 రోజుల్లో రెట్టింపు అవుతుండగా, ఒడిశాలో 39.8, కేరళలో 72.2 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి. -
ఆగని మరణ మృదంగం
వాషింగ్టన్: కోవిడ్–19 రోజురోజుకీ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటితే కరోనా మరణాలు 38 వేలు దాటిపోయాయి. మరే దేశంలోనూ కరోనా ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించలేదు. నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే ఏకంగా 3,856 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర న్యూజెర్సీలో కోవిడ్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నర్సింగ్‌హోమ్‌లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. జనం కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కోవిడ్ కేసులు ఈ స్థాయిలో నమోదు కావడానికి ఎక్కువ మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడమే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇప్పటివరకు 38 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల కంటే ఎక్కువగా అమెరికాలోనే పరీక్షలు జరిగాయన్నారు. ‘‘దేశం చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 184 దేశాల్లోనూ అదే దుస్థితి. ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాం. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు’’అని ట్రంప్ అన్నారు. సొరంగమార్గంలో వెళుతూ ఉంటే చిమ్మ చీకటి నెలకొంటుంది. ఇప్పుడు ఆ చీకట్లో కాంతి రేఖ కనిపిస్తోంది’’అన్న ట్రంప్ త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడతామంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. మార్కెట్లు తెరవాల్సిందే: ట్రంప్ అమెరికాలో ఒకవైపు కోవిడ్ విజృంభణ కొనసాగుతూ ఉంటే మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ మార్కెట్లు తెరిచే విషయంలో పట్టుదలగా ఉన్నారు. డెమొక్రాట్లు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఆర్థిక కార్యక్రమాలు మొదలు పెట్టాలని కోరారు. మినెసాటో, మిషిగాన్, వర్జీనియాలో ప్రజలు వెంటనే విధుల్లోకి వెళ్లాలంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఫెడరల్ ప్రభుత్వాన్ని తరచు విమర్శిస్తూ సమయం వృథా చేయకుండా కోవిడ్ బాధితుల్ని ఆదుకోవడంలో ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. మృతుల రేటు ఇలా.. కోవిడ్ మృతుల రేటు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలుత మరణాల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ రానురాను పెరిగిపోయింది. మార్చి చివరి నాటికి: 1.35% ఏప్రిల్ 15 నాటికి : 4% ఏప్రిల్ 18 : 5% ► కోవిడ్‌ను అరికట్టడానికి అమెరికా అదనపు చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది దారిద్య్రరేఖకి దిగువకి వెళ్లిపోతారని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు ఫిలిప్ అల్సటాన్ హెచ్చరించారు. ► ఆఫ్రికాలో వెయ్యి మందికి పైగా మరణించారు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్బా క్యారీ కోవిడ్–19తో ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఈ నెల 21న తన 94వ పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు. ► జింబాబ్వే 40వ స్వాతంత్య్రదిన వేడుకల్ని రద్దు చేసింది. ► జర్మనీలో కరోనా నియంత్రణలో ఉందని, రెండో దశలో విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ► ఇటలీలో ఇప్పుడిప్పుడే జనజీవనం కనిపిస్తూ ఉంటే, స్పెయిన్, మెక్సికో, జపాన్, బ్రిటన్ కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. -
అమెరికాలో భారీగా కోవిడ్ మృతులు
-
మరణాలు @ 33 వేలు
వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. అయితే, కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరా టాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగా న్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా జాబితాలో ముందుందని వ్యాఖ్యానించారు. యూరప్‌లో కరోనా ఉగ్రరూపం యూరప్‌లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్‌లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్ పాకిందని డబ్ల్యూహెచ్‌వో యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్‌కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తోట చుట్టూ వంద సార్లు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ తరఫున పోరాడిన సైనిక వీరుడు కెప్టెన్ టామ్ మూరె ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కరోనాని ఎదుర్కోవడానికి తన పోరాటపటిమను ప్రదర్శించారు. తన ఇంట్లో గార్డెన్ చుట్టూ వందసార్లు తిరిగారు. దీంతో 1.2 కోట్ల పౌండ్లు యూకే హెల్త్‌కేర్ చారిటీకి సంపాదించారు. వాకర్ సాయంతో ఆయన తనకు ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో తనకు వచ్చిన మెడల్స్ అన్నీ డ్రెస్‌కి తగిలించుకొని ఆయన తోట చుట్టూ తిరగడం ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. విరాళాలు వెల్లువెత్తాయి. మహీంద్రా పీపీఈల తయారీ భారత ఆటోమొబైల్స్ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అమెరికాలోని డెట్రాయిట్ యూనిట్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్–పీపీఈ) తయారీకి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సర్జికల్ మాస్కులు, గౌన్లతో పాటుగా వెంటిలేటర్లను కూడా భారీ సంఖ్యలో తయారు చేయనుంది. ‘ప్రస్తుతం కోవిడ్‌పై పోరాటానికి అవసరమైనవి తయారు చేయడమే అందరి లక్ష్యం కావాలి. మా దగ్గర నిరంతరం పని చేసే సిబ్బంది ఉన్నారు’అని ఆ సంస్థ ఉత్తర అమెరికా సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. టీకాతోనే సాధారణ పరిస్థితులు కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. -
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కేసులు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విధ్వంసం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1.30 లక్షలు దాటింది. అమెరికాలో ఒకే రోజు 2,129 మంది మరణించడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇక న్యూయార్క్‌లో మరణాలు 11 వేలకి చేరువలో ఉన్నాయి. సోమవారం మృతులు, కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టుగా అనిపించినా మళ్లీ ఒక్కరోజులోనే అన్నీ ఎక్కువైపోవడం ఆందోళన పుట్టిస్తోంది. వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వూహాన్లో యుద్ధప్రాతిపదికన పది రోజుల్లోనే నిర్మాణం పూర్తిచేసిన వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా మూసేసింది. వూహాన్లో వైరస్ పూర్తిగా అదుపులోకి రావడంతో ఆస్పత్రిని మూసివేసినట్టుగా అధికారులు వెల్లడించారు. హుబై ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది వైద్య సిబ్బందిని తీసుకువచ్చారు. తమకు అప్పగించిన మిషన్ పూర్తి కావడంతో వారంతా ఎవరి ఊళ్లకు వారు తిరిగి వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ఫిబ్రవరిలో పది రోజుల్లోనే రేయింబగళ్లు శ్రమించి నిర్మించిన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్లో 99 ఏళ్ల వయసున్న వృద్ధుడు కోవిడ్‌ను జయించారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ధీరుడు. లెఫ్ట్‌నెంట్ ఎర్మాండో పివెటా బ్రెజిల్ సైన్యంలో ఉండి రెండో ప్రపంచ యుద్ధంలో పోరాటం చేశారు. ఆస్పత్రి నుంచి విడుదలయ్యే సమయంలో ఆర్మీ గ్రీన్ క్యాప్ పెట్టుకొని చేతులు గాల్లో ఊపుతూ ఉత్సాహంగా ఆయన బయటకి వచ్చారు. ‘కోవిడ్‌పై చేసిన పోరాటం చాలా అద్భుతమైనది. ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు చావో బ్రతుకో అనుకొని పోరాడం. ఈ సారి బతకాలన్న ఆకాంక్షతో పోరాటం చేశా’ అని ఎర్మాండో చాలా ఉద్విగ్నంగా చెప్పారు. -
చైనాను మించిన న్యూయార్క్
హూస్టన్/మాడ్రిడ్/న్యూయార్క్/బీజింగ్: అమెరికాలో కోవిడ్–19తో అతలాకుతలమవుతున్న న్యూయార్క్ నగరం కేసుల సంఖ్యలో ఇప్పుడు చైనాను మించిపోయింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే లక్షకు పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనా, బ్రిటన్ల కంటే కూడా ఇవి ఎక్కువ. అధికారుల గణాంకాల ప్రకారం.. ఆదివారం ఒక్కరోజే న్యూయార్క్ నగరంలో 5,695 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసులు 1,04,410 కాగా మరణాల సంఖ్య 6,898కు చేరుకుంది. అదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా 5,57,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 22 వేలకు చేరుకుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మే నెలలో ఆంక్షలను దశలవారీగా సడలించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం అంత తేలిక కాదని పరిశీలకులు అంటున్నారు. స్పెయిన్‌లో సోమవారం 517 మంది కోవిడ్–19తో చనిపోయారు. దీంతో మరణాలు 17,489కు చేరుకోగా పాజిటివ్ కేసులు 1,69,496కు పెరిగాయి. దాదాపు మూడు వారాల తర్వాత కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలపై దృష్టిసారించింది. రెండు వారాల తర్వాత నిర్మాణరంగ కార్మికులు సోమవారం నుంచి పనుల్లో చేరారు. ఇరాన్లో సోమవారం ఒక్కరోజే 111 మంది మృతి చెందడంతో కోవిడ్–19 మరణాలు 4,585కు చేరుకున్నాయి. అదేవిధంగా, పాజిటివ్ కేసులు 73 వేలు అయ్యాయి. పాకిస్తాన్లో కోవిడ్ మృతులు 93, పాజిటివ్ కేసుల సంఖ్య 5,374కు చేరుకున్నాయి. ఇందులో సోమవారం ఒక్క రోజే 334 కేసులు బయటపడ్డాయి. తిరగబెడుతున్న కోవిడ్–19 కోవిడ్–19 మహమ్మారికి కేంద్ర స్థానమైన చైనాలో మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 108 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 82,160 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా మరణాల సంఖ్య 3,341కు చేరుకుంది. బ్రిటన్‌లో కోవిడ్–19తో సోమవారం మరో717 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 11,329కు చేరుకున్నాయి.. కోవిడ్ నుంచి కోలుకుని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విశ్రాంతి కోసం బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్‌కు వెళ్లిపోయారు. మొరాకోలో 28 వేల మంది అరెస్టు మొరాకోలో కోవిడ్–19 సోకి 120 మంది చనిపోగా 1,746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొరాకోలో కోవిడ్–19 కారణంగా విధించిన ఆంక్షలను ధిక్కరించినందుకు మార్చి 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు 28,701 మందిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో 19 మంది భారతీయులు దుబాయ్ ఎయిర్‌పోర్టులో 19 మంది భారతీయులు మూడు వారాలుగా చిక్కుకుపోయి ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న వీరంతా భారత ప్రభుత్వం విమాన సర్వీసులు రద్దు చేయడంతో అక్కడే ఉండిపోయారు. అక్కడి అధికారులు నిర్వహించిన పరీక్షల్లో వీరందరికీ కోవిడ్ నెగిటివ్ అని తేలింది. దీంతో వారిని ఎయిర్‌పోర్టు హోటల్లో బస కల్పించారు. కోలుకుంటున్న భారతీయ అమెరికన్లు కోవిడ్–19 బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు భారతీయ అమెరికన్లు ప్లాస్మా థెరపీతో కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు డేంజర్: డబ్ల్యూహెచ్‌వో స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ కంటే కరోనా వైరస్ 10 రెట్లు అధిక ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా అనేది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలను ఒకేసారి కాకుండా, దశల వారీగా ఎత్తివేయడమే సరైందని సూచించింది. కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే శక్తివంతమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. -
కరోనా @ 10 వేలు!
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: భారత్‌లో కరోనా మహమ్మారి కాటుకు వందలాది మంది బలైపోతున్నారు. ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య క్రమంగా 10 వేలకు చేరుకుంటోంది. దేశంలో కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో 35 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 22 మంది, ఢిల్లీలో ఐదుగురు, గుజరాత్లో ముగ్గురు, పశ్చిమబెంగాల్లో ఇద్దరు, తమిళనాడులో ఒకరు, జార్ఖండ్‌లో ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 324కి చేరింది. అలాగే కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 9,352కి ఎగబాకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 7,987 కాగా, 856 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సోకిన వారిలో 72 మంది విదేశీయులు సైతం ఉన్నారు. కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 149 మంది కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్లో 25 మంది, ఢిల్లీలో 24 మంది, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 11 మంది, పశ్చిమబెంగాల్లో 8 మంది తుదిశ్వాస విడిచారు. అన్ని రాష్ట్రాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా 327 మరణాలు సంభవించినట్లు స్పష్టమవుతోంది. కరోనాపై మాజీ నక్సలైట్ల పోరాటం కరోనా వైరస్‌లో పోరాటంలో మాజీ నక్సలైట్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గత ఏడాది లొంగిపోయిన మక్దమ్ లఖ్కా(31), రీనా వెక్కో(30) అనే ఇద్దరు నక్సలైట్లు ప్రస్తుతం మాస్కుల తయారీలో మునిగిపోయారు. వీటిని పోలీసు సిబ్బందికి, స్థానిక ప్రజలకు పంపిణీ చేస్తామని వారు అంటున్నారు. వీరిద్దరూ దక్షిణ బస్తర్ జిల్లాలో చాలాకాలం నక్సలైట్ల దళంలో పనిచేశారు. హింసతో మిగిలేది విధ్వంసమే తప్ప సాధించేది ఏమీ లేదని చెబుతూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వ్యవసాయోత్పత్తుల కోసం కాల్ సెంటర్ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కారించడానికి ఆలిండియా అగ్రి ట్రాన్స్‌పోర్టు కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ సోమవారం వెల్లడించింది. 18001804200, 14488 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించింది. -
కరోనా అలర్ట్ : ప్రముఖ నటుడు మృతి
లండన్ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఇక మహమ్మారి బారి నుంచి ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ప్రాణాంతక వైరస్‌తో మరణించారనే వార్త బ్రూక్ టేలర్ అభిమానులను కలవరపరుస్తోంది. టేలర్ తన హాస్యంతో వివిధ తరాలకు చెందిన ప్రజలను కడుపుబ్బా నవ్వించేవారని ఆయన మరణం హాస్యప్రియులకు తీరని లోటని ప్రముఖ రచయిత సిమన్ బ్లాక్వెల్ ట్వీట్ చేశారు. చదవండి : రేపు ఉదయం పది గంటలకు ప్రధాని ప్రసంగం -
కరోనాతో ఇండిగో ఉద్యోగి మృతి
ముంబై: తమ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ బారినపడి చెన్నైలో మృతి చెందినట్లు విమానయాన సంస్థ ఇండిగో శనివారం ప్రకటించింది. అయితే, పూర్తి వివరాలు బయటపెట్టలేదు. 55 ఏళ్లకుపైగా వయసున్న అతడు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని, శుక్రవారం చనిపోయాడని సమాచారం. 2006 నుంచి ఇండిగో సంస్థలో పనిచేస్తున్నాడని తెలిసింది. దేశం లో ఒక విమానయాన సంస్థ ఉద్యోగి కరోనాతో చనిపోవడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. -
24 గంటల్లో 1035 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 242కు, పాజిటివ్ కేసుల సంఖ్య 7,529కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 6,634 కాగా, 652 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 261 మంది మృతి చెందినట్లు. 8,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది. నియంత్రణ చర్యలు లేకుంటే.. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో అన్నారు. లాక్డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు. 586 ఆసుపత్రుల్లో వైద్య సేవలు దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలను కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్ చేశారు. దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో కువైట్‌కు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పున:ప్రారంభించనున్నారు. వైద్య బృందంపై దాడి కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తబ్లిగీల ఆచూకీ చెప్తే 5,000 రివార్డు తబ్లిగీ జమాత్ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 30దాకా లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. కర్ణాటకలో కూడా లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగుతుందని, సంబంధిత విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుందని సీఎం యడ్యూరప్ప శనివారం చెప్పారు. -
అమెరికాలో మృత్యుఘోష
వాషింగ్టన్/వూహాన్/లండన్/ఇస్తాంబుల్: అమెరికాలో కోవిడ్–19 విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 18,860 మంది మృతి చెందారు. ప్రాణాంతక ఈ వైరస్ సోకి 40 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు మరణించారు. వీరిలో12 మంది వరకు భారతీయ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, కేరళకు చెందిన వారు 17 మంది, గుజరాతీయులు 10 మంది, నలుగురు పంజాబీయులు, ఒడిశాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. మృతుల్లో అత్యధికులు 60 ఏళ్లకు పై బడిన వారే. 21 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నారు. న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్ అమెరికన్లకు వైరస్ సోకింది. కోవిడ్ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలోని మినీ ఇండియాగా పిలిచే ఓక్ ట్రీ రోడ్డులో మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. న్యూయార్క్‌లో 15 మంది, న్యూజెర్సీలో 12 మందికి పైగా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో నలుగురు చొప్పున, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఒక్కొక్కరు మరణించినట్టు అమెరికాలో స్థానిక అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఓక్ ట్రీ రోడ్డులో వ్యాపారం చేస్తున్న ప్రవాస భారతీయుడు భవేష్ దవే అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో సున్నోవా అనలిటికల్ సీఈవో మారేపల్లి హనుమంతరావు, న్యూజెర్సీ పారిశ్రామికవేత్త చంద్రకాంత్ అమిన్(75), మహేంద్ర పటేల్ (60) ఉన్నారు. మరికొందరు భారతీయుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్లాస్మా డోనర్ల కోసం పలు ప్రవాస భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు న్యూజెర్సీలో ఉంటున్న నీల పాండ్య అనే గుజరాతీ మహిళ తన కుటుంబానికి చెందిన అయిదుగురు కోవిడ్‌తో పోరాడుతున్నారని, బెడ్స్ కొరత కారణంగా వారిలో ఇద్దరినే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారంటూ ఆమె ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోవిడ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, నిర్లక్ష్యం వద్దంటూ ఆమె పెట్టిన వీడియో భారతీయ సంతతి వారిలో గుబులు రేపుతోంది. మరోవైపు అమెరికా ఒకే రోజు 2,104 మరణాలు నమోదైన తొలి దేశంగా నిలిచింది. యూకేకి పారాసెటమాల్ మాత్రలు యూకేకి తొలి విడతగా 30 లక్షల పారాసెటమాల్ ప్యాకెట్లు ఆదివారం చేరుకోనున్నాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మందుల ఎగుమతులపై ఆంక్షల్ని తొలిగించిన భారత ప్రభుత్వం వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లట్లను పంపింది.ఈ మందులు ఆదివారానికి చేరుకుంటాయని బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారి వెల్లడించారు. కోవిడ్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌ను జయించిన 93 ఏళ్ల అవ్వ టర్కీకి చెందిన 93 ఏళ్ల వయసున్న అల్యే గుండాజ్ కోవిడ్‌ను జయించారు. పది రోజుల పాటు కోవిడ్‌తో పోరాటం చేసిన ఆమె ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇస్తాంబుల్ ఆస్పత్రి నుంచి ఆ వృద్ధురాలిని డిశ్చార్జ్ చేసిన సమయంలో అందరిలోనూ ఈ మహమ్మారిని ఎదుర్కోగలమన్న ఆశాభావం కలిగింది.. వైద్య సిబ్బంది చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. చైనాలో మళ్లీ వైరస్ భయం కరోనా వైరస్ భయం మళ్లీ చైనాలో మొదలైంది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వందలాది మంది చైనీయులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడంతో వారి ద్వారా రెండోసారి వైరస్ విజృంభిస్తుందనే ఆందోళనలో ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సోకిన కేసులు 1,183కి చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ అంకెలు శనివారం రాత్రి 11 గంటలకు.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 17,16,674 మరణాలు :1,07,637 కోలుకున్న వారు : 3,95,586 -
లక్ష దాటిన కరోనా మరణాల సంఖ్య
-
206కి చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య శుక్రవారానికి 206కి చేరుకుంది. దాదాపు 6,761 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 503 మందికి జబ్బు నయమైందని తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి దాదాపు 30 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 25 మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని, గుజరాత్, జార్ఖండ్లలోనూ ఒక్కొక్కరు చొప్పున మరణించారని ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 97 మంది కోవిడ్–19కి బలికాగా, గుజరాత్లో 17 మంది, మధ్యప్రదేశ్‌లో 16 మంది, ఢిల్లీలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, తమిళనాడులలో ఎనిమిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో ఐదుగురు చొప్పున కోవిడ్‌కు బలయ్యారు. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లలో నలుగురు చొప్పున, హరియాణా, రాజస్తాన్‌లలో ముగ్గురు చొప్పున బలయ్యారు. కేరళ, బిహార్, హిమాచల్ ప్రదేశ్లలో ఇద్దరు చొప్పున, ఒడిశా, జార్ఖండ్‌లలో ఒకొక్కరు ప్రాణాలొదిలారు. దేశం మొత్తమ్మీద వైరస్ బారిన పడ్డ 6,761 మందిలో 71 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం సాయంత్రానికి వైరస్‌తో 169 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు... మహారాష్ట్రలో మొత్తం 1,364 కేసులు ఉండగా, తమిళనాడులో 834, ఢిల్లీలో 720 వరకు కేసులు ఉన్నాయి. రాజస్తాన్‌లో 463, ఉత్తరప్రదేశ్‌లో 410, కేరళలో 357, మధ్యప్రదేశ్‌లో 259, గుజరాత్లో 241 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 181 కేసులు ఉండగా, హరియాణాలో 169 కేసులు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ (158), పశ్చిమ బెంగాల్ (116), పంజాబ్ (101), పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో మొత్తం 44 కేసులు నమోదు కాగా, బిహార్‌లో 39 మంది, ఉత్తరాఖండ్‌లో 35 మంది వైరస్ బారిన పడ్డారు. అసోంలో 29, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లలో 18 మంది చొప్పున కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారు. -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
అకాల వర్షం: రెండు గ్రామాల్లో పెనువిషాదం
కృత్తివెన్ను(పెడన): గంగపుత్రులకు ఆధారం సాగరం.. సాయమందించేది వల.. కడుపునింపేది వేట. ఉవ్వెత్తున ఎగసే అలలతోనే నిత్యం పోరాటం చేస్తారు.. కష్టమైనా, నష్టమైనా.. రాత్రయినా, పగలైనా బతుకు పోరు సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. అదే ఆశతో వలలు పట్టుకుని కడలిలోకి వెళ్లారు కృత్తివెన్ను మండల పరిధిలోని మత్స్యకారులు. వేట ముగిసింది. ఇక తిరిగెళ్లి పోదాం అనుకుంటున్న తరుణంలో.. అనుకోని విపత్తు వారి ఆశలను చిదిమేసింది. పెనుగాలి రూపంలో సాగరం మధ్యలో తాండవమాడి వారిని కడలి ఒడిలోకి లాగేసుకుంది. వారి కుటుంబ సభ్యులను శాశ్వత శోకంలో నింపేసింది. మండల పరిధిలోని మత్య్సకార గ్రామాలైన పల్లెపాలెం, ఒర్లగొందితిప్పలకు చెందిన ఆరుగురు గంగపుత్రులు వేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృత దేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన జల్లా వెంకటేశ్వరావు (52) అతని కుమారులు దావీదు (23), ఏసురాజు.. వెంకటేశ్వరరావు సోదరుడు జల్లా పెద్దిరాజులు (60) ఇతని కుమారుడు మత్యాలరాజులు బుధవారం రాత్రి సమీపంలోని సముద్రపు ముఖద్వారం వద్దనున్న వలకట్టు వద్ద చేపలవేటకు వెళ్లారు. రాత్రంతా చేపల వేట సాగించి తెల్లవారు జామున ఇంటికి బయలు దేరుతుండగా ఒక్కసారిగా ఉప్పెనలా పొంగిన సముద్రం, ఆపై పెనుగాలులు, వడగండ్ల వర్షంతో ఒక్కసారిగా వారి పడవలు బోల్తాపడ్డాయి. వెంకటేశ్వరరావు, అతని కుమారుడు దావీదు, సోదరుడు పెద్దిరాజులు సముద్రంలో గల్లంతవగా, ముత్యాలరాజు తాటిపట్టెసాయంతో బయటపడ్డాడు. ఏసురాజు సముద్రం లోపలకి పోగా అదృష్టవశాత్తు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. సోదరులైన వెంకటేశ్వరరావు, పెద్దిరాజుల మృతదేహాలు లభ్యం కాగా వెంకటేశ్వరరావు కుమారుడు దావీదు ఆచూకి తెలియాల్సి ఉంది. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక.. కృత్తివెన్ను పల్లెపాలెంకు చెందిన వారిది మరోగాథ. ఇక్కడ నుంచి 15 మంది బుధవారం రాత్రి గ్రామానికి సమీపంలోని సముద్రపు పాయలో వలకట్లు వద్దకు చేపలకోసం వెళ్లారు. వీరంతా తమ పని పూర్తి చేసుకుని తెల్లవారుజామున తిరుగుపయనమవ్వగా ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో వారి పడవ నీటిలో బోల్తాపడిపోయింది. దీంతో వారంతా నీటిలో మునిగిపోగా 12 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా వనమాలి వెంకటేశ్వరరావు (61), మోకా నాగేశ్వరరావు (64), బలగం నరసింహమూర్తి (62)లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా నరసింహమూర్తి కోసం గాలింపు కొనసాగుతోంది. చనిపోయిన వారు ముగ్గురు 60 ఏళ్లు పైబడిన వారే.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వృద్ధాప్యంలో కూడా వారు సాహసించి ప్రాణాలను ఫణంగా పెట్టి వేటకు వెళ్లి మరణించిన ఘటన అందరిని కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి కృత్తివెన్ను, ఒర్లగొందితిప్ప గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏసురాజు, ముత్యాలరాజులను ప్రమాద ఘటన గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. మరణించిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థికసాయం ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఫిషరీష్ జాయింట్ డైరెక్టర్ లాల్‌మహ్మద్, డీడీ రాఘవరెడ్డి, డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు ఆర్డీవో ఖాజావలీ, పార్టీ మండల కని్వనర్ గంగాధర్, పార్టీ నాయకులు ఉన్నారు. -
కరోనా: మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా
జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. నరసరావుపేట పట్టణానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో పేట ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. నిన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పట్టణ వాసులు ఏకంగా ఓ వ్యక్తి మృతితో భయాందోళన చెందుతున్నారు. అలానే పొన్నూరు పట్టణానికి చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సాక్షి,నరసరావు: నరసరావు పేట పట్టణంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నరసరావుపేట ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరణంపై ఆర్డీవో కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా నోడల్ అధికారి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి చర్చించిన మీదట విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో వైరస్ నిర్ధారణ కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైందంటూ పూర్వాపరాలను తెలిపారు. వరవకట్ట ప్రాంతానికి చెందిన 45 ఏళ్ళ వ్యక్తి టీబీ వ్యాధితో బాధపడుతూ 7వ తేదీ ఉదయం ఆయాసం, జ్వరం, దగ్గుతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చాడన్నారు. వైద్యులు అతడి పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేశారన్నారు. గుంటూరు ఫీవర్ ఆసుపత్రిలో ఇతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తుండగా మృతి చెందాడన్నారు. గురువారం వచ్చిన రిపోర్టులతో అతడు కరోనా వైరస్‌తోనే మృతి చెందినట్లుగా నిర్ధారౖణెందన్నారు. జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ ఆదేశాలతో వరవకట్ట ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారన్నారు. మృతుడు రామిరెడ్డిపేట, అరండల్‌పేటలలో 300 గృహాలకు కేబుల్ కలెక్షన్లు చేసినందున ఆ ఏరియాను కూడా రెడ్‌జోన్‌గా ప్రకటించారన్నారు. ఇతనికి ఏ విధంగా వైరస్ సోకిందో ఇంకా నిర్ధారణకాలేదన్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటు కేబుల్ కార్యాలయంలోని వ్యక్తులతో కలిపి 15 మందిని గుర్తించి వారికి పరీక్షలు చేసి క్వారంటైన్‌కు పంపించామన్నారు. మృతుడి నివాసానికి సమీపంలో నివసించే ఓ హోంగార్డుకు కరోనా లక్షణాలు కనిపించటంతో ముందస్తు చర్యల్లో భాగంగా అతన్ని సైతం క్వారంటైన్‌కు తరలించారు. మృతుడు సెల్‌ఫోన్ కాల్ లిస్ట్, టవర్ లొకేషన్ ఆధారంగా ఇటీవల కాలంలో ఎవ్వరెవ్వరితో సన్నిహితంగా మెలిగాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. సుమారు 251 మందిని మృతుడు ఈ మధ్యకాలంలో నేరుగా కలిసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కట్టుదిట్టంగా నివారణ చర్యలు జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌ను నియమించింది. ఆయన జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్‌తోపాటు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పొన్నూరులోని షరాఫ్ బజారులో ఓ పాజిటీవ్ కేసు నమోదు అయింది. ఇతను ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కలువడంతో కరోనా వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో పొన్నూరులోని షరాఫ్బజారును రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నరసరావుపేట, పొన్నూరులో నమోదైన పాజిటీవ్ కేసులకు సంబంధించి వారు ఎవరెవరిని కలిశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామం నుంచి 8 మందిని క్యారెంటైన్‌కు తరలించారు. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 51కు చేరాయి. 14 క్వారంటైన్ సెంటర్లలలో 1247 ఐసోలేషన్ బెడ్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇందులో 514 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రెడ్జోన్ప్రాంతాల్లో శాంపిళ్ళ సేకరణకు ఐదు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. క్లస్టర్ కంటైన్మెంట్లపై ప్రత్యేక దృష్టి.... గుంటూరు నగరంలో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసుల పట్ల ఉన్నతాదికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు రోజుల్లోనే సుమారు 17 కేసులు రావడం పట్ల ఆరా తీస్తున్నారు. గురువారం కోవిడ్ 19 రాష్ట్ర ప్రత్యేకాధికారి రాజశేఖర్, అడిషనల్ డి.జి. ఉజ్వల్ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, రేంజ్ ఐ.జి. ప్రభాకరరావు, అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ, జె.సి.దినేష్ కుమార్ క్లస్టర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించారు. పొన్నూరు:జిల్లా రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు, బాపట్ల డీఎస్పీ అతిన శ్రీనివాసరావు, తహసీల్దార్ దొడ్డకుల పద్మనాభుడు, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు షరాఫ్ బజారును పరిశీలించారు. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తికి పట్టణంలో ని ఒక వైద్యశాలకు చెందిన వైద్యులు వైద్యం చేసినట్లు తెలటంతో కుటుంబ సభ్యులతోపాటుగా వైద్య శాల సిబ్బందిని మొత్తం 15 మందిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. గుంటూరు వెస్ట్: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. లాక్డౌన్ సమయాల్లో నిభందనలు అతిక్రమించే వారిపట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై మాస్క్‌లు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. -
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా
-
అమెరికాలో ఒకే రోజు 2 వేల మంది మృతి
న్యూయార్క్/వాషింగ్టన్: అది న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ అపార్ట్మెంట్. దాని ఎదురుగానే వైకాఫ్ హైట్స్ అనే ఆస్పత్రి ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో నివసించే ఒక జంట ప్రతీ రోజూ కిటికీలోంచి ఆస్పత్రి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ఎదుట మృత దేహాలను తీసుకువెళ్లడానికి వచ్చే ఏసీ ట్రక్కులు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే మనసు కలిచి వేస్తోందని అలిక్స్ మోంటాలెనె అన్నారు. ఆమె రాయిటర్స్ వార్తా సంస్థతో స్కైప్‌లో మాట్లాడారు. ‘‘మా కిటికీ లోంచి బయటకి చూస్తే ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. అంటే ఆస్పత్రి లోపల ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోజుకు ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో లెక్క పెట్టడం మానేశాం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’అని చెప్పారు. కరోనా వైరస్ ధాటికి న్యూయార్క్ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేశారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలకు చేరింది. యువకుల్ని కాటేస్తోంది కోవిడ్–19 రోగులు కళ్ల ముందే మరణిస్తూ ఉండడంతో వైద్య సిబ్బంది కూడా హడలెత్తిపోతున్నారు. ఏ విపత్తు కూడా అమెరికాను ఈ స్థాయిలో ఇప్పటివరకు వణికించకపోవడంతో ఏం జరుగుతోందో, దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. ‘మా నగరంలో వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ప్రతీ ఒక్కరినీ కాపాడడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ని అదుపులోకి తెస్తాం’ అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. ఈ వైరస్ కేవలం వృద్ధుల్ని, వేరే వ్యాధులతో బాధపడుతున్న వారినే కాదు, యువకుల్ని కూడా కాటేస్తోంది. ‘అప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కోలుకుంటున్నారు కదా అనుకుంటాం. హఠాత్తుగా కళ్ల ముందే తుది శ్వాస విడుస్తున్నారు. యువతీ యువకులు కూడా దీనికి అతీతమేమీ కాదు’అని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు డయానా టోరెస్ అన్నారు. ఈ అంకెలు గురువారం రాత్రి 11 గంటలకు.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 15,69,002 మరణాలు :92,109 కోలుకున్న వారు :3,45,917 11 మంది భారతీయులు మృతి మరో 16 మందికి సోకిన వైరస్ అమెరికాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. 24 గంటల్లోనే 2 వేల మంది మృతి చెందడం ఆందోళనకు దారి తీస్తోంది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని సమాచారం. ఫ్లోరిడాలో మరొక ఇండియన్ చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు. -
మరణాలు తక్కువగానే ఉంటాయేమో
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19 కారణంగా మంగళవారం నాటికి అమెరికాలో సుమారు 12,700 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారం నుంచి మంగళవారం వరకూ మాత్రమే 1,900 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నాలుగు లక్షలకు చేరుకుంటూండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 5,400 మంది మరణించారు, 1.38 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూజెర్సీలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 44,416 మంది కోవిడ్ కోరల్లో చిక్కుకున్నారు. నిలకడగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం కోవిడ్ లక్షణాలు తీవ్రం కావడంతో ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బోరిస్ జాన్సన్ అధికారిక కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ అధికారులతో మాట్లాడుతున్నారు. భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు కోవిడ్–19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ మంగళవారం అంగీకరించిన విషయం తెలిసిందే. -
కరోనా మృత్యుఘోష
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాటేస్తోంది. దేశంలో ఇప్పటిదాకా 111 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 704 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 28 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 4,281కి చేరింది. బాధితుల్లో ఇప్పటిదాకా 318 మంది స్వస్థత పొందారు. కరోనా వల్ల గత 24 గంటల్లో మహారాష్ట్రలో 21 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు, గుజరాత్లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు. కరోనా మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 45 మంది బలయ్యారు. గుజరాత్లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో 9 మంది, తెలంగాణలో ఏడుగురు, ఢిల్లీలో ఏడుగురు, పంజాబ్‌లో ఆరుగురు, తమిళనాడులో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు మరణించారు. ఇతర రాష్ట్రాల్లోన మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాలను బట్టి చూస్తే కరోనాతో దేశవ్యాప్తంగా 137 మంది కన్ను మూసినట్లు, 4,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలుగుచూసిన 4,281 కరోనా పాజిటివ్ కేసుల్లో 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యువతలోనూ ముప్పు అధికమే.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో పురుషుల వాటా 76 శాతం, మహిళల వాటా 24 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. మొత్తం కేసుల్లో 40 ఏళ్లలోపు వారి వాటా 47 శాతం, 40 నుంచి 60 ఏళ్లలోపు వారి వాటా 34 శాతం, 60 ఏళ్లకుపైగా వయసున్న వారు 19 శాతమని పేర్కొన్నారు. మృతుల్లో పురుషులు 73 శాతం, మహిళలు 27 శాతమని చెప్పారు. మరణాల్లో 60 ఏళ్లలోపు వారు 63 శాతం, 40 నుంచి 60 ఏళ్లలోపు వారు 30 శాతం, 40 ఏళ్లలోపు వారు 7 శాతమని వెల్లడించారు. కరోనా 2–3 దశల మధ్య భారత్ కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయని, దీన్నిబట్టి వైరస్ వ్యాప్తి విషయంలో దేశం రెండు, మూడు దశల మధ్య ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ సామూహికంగా సంక్రమిస్తున్నట్లు తెలుస్తోందని ‘ఎయిమ్స్’ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. -
అమెరికాలో మూడు లక్షలు
వాషింగ్టన్/బీజింగ్/జెనీవా: ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్–19 అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్క్‌లే ధరించాలని చెప్పారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్యసిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి: యూఎన్: కరోనా విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ అన్నారు. యుద్ధవాతావరణం ఉండి, పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్న సిరియా, లిబియా, యెమన్ వంటి దేశాలకు వైరస్ విస్తరిస్తే ఎంతటి కల్లోలం రేగుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు. కోవిడ్ మృతులకు చైనా నివాళి కోవిడ్‌తో మృతి చెందిన వారికి చైనా జాతియావత్తూ శనివారం నివాళులర్పించింది. కరోనా వైరస్‌పై తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్తో సహా 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాప సూచకంగా ప్రజలందరూ మూడు నిముషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను అవనతం చేశారు. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి పొడిగింపు స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య రాను రాను పెరిగిపోతూ ఉండడంతో జాతీయ అత్యవసర పరస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని సాంచెజ్ ప్రకటించారు. శనివారానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,744కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటేసింది. ఇటలీలో మరో 766 మంది మరణిస్తే కొత్త కేసుల సంఖ్య పెరుగుదల నాలుగు శాతం మాత్రమే నమోదైంది. జర్మనీలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,082 మందికి వైరస్ సోకింది. కువైట్‌లో శనివారం తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకేరోజు 708 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి చేరుకుంది. న్యూయార్క్‌లో రెండున్నర నిమిషాలకో మరణం కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న న్యూయార్క్‌లో అంతిమ సంస్కారానికి కూడా వేచి చూసే పరిస్థితులు నెలకొని ఉంటే మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒక మరణం నమోదవుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్యూ క్యూమో వెల్లడించారు. గత 24 గంటల్లో 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య దాదాపుగా 3 వేలకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 11,69,262 మరణాలు: 62,730 కోలుకున్న వారు: 2,41,762 -
ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..?
సాక్షి, పొట్టిరెడ్డిపాలెం(మర్రిపూడి): ఏం కష్టం వచ్చిందో..ఏమో తల్లీ, కూతుళ్లు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్ రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రింత కోటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా భర్త జనార్దన్‌రెడ్డి పశుగ్రాసం కోసం పొలం వెళ్లాడు. అయితే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సంఘటనను మృతురాలు మామ ఒక్కెయ్య చూసి కుమారుడుకు సమాచారం ఇచ్చాడు. కొడుకు పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కోటేశ్వరమ్మ(32), ఆమె కూతురు నందిని(13) ఇద్దరు ఒకే మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు నందినికి కుర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి ఉండవచ్చని, అనంతరం ఇంట్లో ఉన్న కందుల బస్తాల పైకి ఎక్కి తల్లి కోటేశ్వరమ్మ కూడా అదే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుందని ఎస్సై ఏ. సుబ్బరాజు తెలిపారు. భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన కోటేశ్వరమ్మ ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కూతురు మర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం కలకలం రేపింది. జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూత
లక్నో: కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయం త్రం లక్నోలోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 1996–98 కాలంలో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా, యూపీఏ 2 హయాంలో స్టీల్ మంత్రిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి
సాక్షి, కురబలకోట: మండలంలోని మట్లివారిపల్లె పంచాయతీ వనమరెడ్డిగారిపల్లె (పెద్దపల్లె)లో జనవరి 2వ తేదీ రాత్రి వివాహిత హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమె అదృశ్యమైనట్టు నాటకమాడారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. మృతదేహాన్ని బుధవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దృశ్యం సినిమాను తలపించేలా హత్యను తప్పుదారి పట్టించేందుకు నిందితులు ఆడిన నాటకాన్ని చూసి పోలీసులు విస్తుపోయారు. రూరల్ సర్కిల్ సీఐ అశోక్‌కుమార్ కథనం మేరకు.. వనమరెడ్డిగారిపల్లెకు చెందిన మల్రెడ్డి (27) ఆర్టీసీ అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన బీటెక్ చదువుతున్న గాయత్రి (25) పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆరు నెల ల క్రితం పెళ్లి చేసుకున్నారు. గాయత్రి కులం వేరు కావడంతో మల్ రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో అతను మదనపల్లెలో కాపురం పెట్టాడు. భార్యపై అనుమానం కలగడంతో ఇటీవల కాపురాన్ని స్వగ్రామానికి మార్చాడు. పోలీస్ స్టేషన్లో కూడా పంచాయితీ జరిగింది. వేరే కులం కావడం, ఆపై భార్యపై అనుమానం రావడంతో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. హరికథ రోజే హత్య వనమరెడ్డిగారిపల్లెకు చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో జనవరి 2వ తేదీన దివసం కార్యక్రమాల్లో భాగంగా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు హరికథ దగ్గరకు వెళ్లడంతో మల్రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కలిసి ఊపిరి ఆడకుండా చేసి గాయత్రిని హత్య చేశారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అదే రోజు రాత్రి దగ్గరలోని పొలంలో పూడ్చిపెట్టారు. శవం పూడ్చిన ఆనవాళ్లు కని్పంచకుండా ట్రాక్టర్‌తో దున్నించారు. తిరుపతిలో సెల్‌ఫోన్ తిప్పారు పోలీసుల విచారణకు దొరక్కుండా మరుసటి ఉదయమే ఆమె సెల్ ఫోన్‌ను మరొకరి చేతికి ఇచ్చి తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తిరిగొచ్చి ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. పోలీసులు మొబైల్ సిగ్నల్‌ను ట్రాక్ చేస్తే తిరుపతి వెళ్లినట్లు తెలుస్తుందని ఇలా చేశారు. అనుకున్నట్లుగానే మదనపల్లె రూ రల్ పోలీస్ స్టేషన్లో ఆమె అదృశ్యమైనట్లు భర్త జనవరి 6న ఫిర్యాదు చేశాడు. ఆమె సెల్ సిగ్న ల్స్ ఆ«ధారంగా చూస్తే తిరుపతి వెళ్లినట్లు వెల్లడైంది. మిస్టరీగా మారడంతో చివరకు సీటీఎం దగ్గరున్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో కీలక విషయం బయటప డింది. భార్య సెల్‌ఫోన్‌ను భర్తే మరొకరి చేతికి ఇచ్చి తిరుపతి బస్సు ఎక్కించినట్లు వెల్లడైంది. అతని కుటుంబ సభ్యులను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శవం వెలికితీత వనమరెడ్డిగారిపల్లె పొలాల్లో పూడ్చిన గాయత్రి మృతదేహాన్ని పోలీసులు బుధవారం బయటకు తీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న శవానికి అక్కడే తహసీల్దార్ నీలమయ్య శవ పంచనామా చేశారు. డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మల్రెడ్డి, అతని తమ్ముడు కార్తీక్ రెడ్డి (25), కుటుంబ సభ్యులు అమరనాథరెడ్డి (27), గంగల్‌రెడ్డి, గంగిరెడ్డి, లక్ష్మిదేవమ్మపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
భారత్‌లో నాలుగో మరణం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి గురువారం కోవిడ్‌తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్‌లో గురువారానికి 173కి చేరింది. ఇందులో 20కి పైగా కేసులు కొత్తగా నిర్ధారణ అయినవే. ఛత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల్లో గురువారం తొలి కేసులు నమోదయ్యాయి. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో దిగవద్దని కేంద్రం నిషేధం విధించింది. అత్యవసరంకాని సేవల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ప్రజా రవాణా బంద్ పలు రాష్ట్రాలు దాదాపు లాక్డౌన్ స్థాయిలో ఆంక్షలు విధించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రజా రవాణాను నిషేధించారు. పంజాబ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై నిషేధం విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లను మూసేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, టేక్ అవే సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. 20కి మించిన సంఖ్యలో ప్రజలు గుమికూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించింది. అత్యవసరంకాని విధులను వాయిదా వేసుకోవాలని అన్ని ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలకు, పీఎస్‌యూలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసరం కాని ప్రభుత్వ సేవలను కూడా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని ప్రముఖ సుందర్ నగర్ మార్కెట్‌ను కూడా మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు. ముంబైలోని ప్రముఖ భోజన సరఫరాదారులైన ‘డబ్బావాలాలు’ కూడా తమ సేవలను శుక్రవారం నుంచి మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో కరోనా వైరస్ సోకిన 173 మందిలో 25 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం నాటికి మహారాష్ట్రలో 45, కేరళలో 27, హరియాణాలో 17, కర్ణాటకలో 14, రాజస్తాన్‌లో 7, లద్దాఖ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి రక్షణ పొందేందుకుగాను ప్రజలు రోజూ కనీసం 15 నిమిషాలపాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే సూచించారు. సూర్య రశ్మి ద్వారా శరీరానికి కావాల్సినంత విటమిన్ డీ లభిస్తుందని, తద్వారా శరీరరోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి వైరస్‌లను నిరోధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. -
మొబైల్ చోరీ చేశాడంటూ చావబాదారు..
జైపూర్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్‌లోని సికార్ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్ లాల్ మీనా (75) సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్, భరత్‌భూషణ్, దిలీప్ సింగ్, సందీప్ మీనా, సందీప్ యాదవ్‌లను అరెస్ట్ చేశామని అదనపు ఎస్పీ దినేష్ అగర్వాల్ వెల్లడించారు. ఓ హోటల్ వద్ద తమ మొబైల్ ఫోన్‌ను మదన్ లాల్ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు! -
కరోనా మరణాలు @ 7007
బీజింగ్/టెహ్రాన్/జెనీవా: చైనాలో నమోదైన కోవిడ్ మరణాల కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో నమోదైన మరణాల సంఖ్యే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం తెలిపింది. ఏఎఫ్‌పీ వార్తాసంస్థ లెక్కల ప్రకారం 142 దేశాల్లో 1,75,536 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 7007 దాటింది. చైనాలో 3,213 మంది మరణించగా, ఇటలీలో 2,158, ఇరాన్లో 853, స్పెయిన్‌లో 297 మంది మరణించారు. వైరస్ అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు సూచించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను భారత్ సహా ప్రపంచ దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న నిర్ధారిత కేసుల సంఖ్య నాలుగువారాలు గడిచేనాటికి 4500కి పెరిగింది. ఇరాన్లో ఈ సంఖ్య 12,700కి చేరింది. ఇటలీలో 24వేల మందికి వైరస్ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య రెండు వేలు దాటింది. స్పెయిన్‌లోనూ నాలుగు వారాల వ్యవధిలో కోవిడ్ కేసుల సంఖ్య 8 నుంచి 6 వేలకు పెరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య తక్కువే. చాలా దేశాలు పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. సినీ థియేటర్లు, పబ్‌లు, బార్లు, షాపింగ్ మాల్స్‌ను మూతపడ్డాయి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయసాగాయి. స్పెయిన్, చాలా దేశాలు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించాయి. ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించాయి. అమెరికాలోనూ కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. 50, అంతకన్నా ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలను వచ్చే 8 వారాల పాటు వాయిదా వేసుకోవాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ సూచించింది. చైనాలో అదుపులోకి.. కరోనా తమ దేశంలో అదుపులోకి వచ్చినట్లే అని చైనా వైద్య నిపుణులు ప్రకటించారు. అయితే తుది నిర్ణయం నెల తర్వాత తీసుకుంటామని పెకింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కావ్ లీ తెలిపారు. వూహాన్ ప్రాంతంలో పలువురు ఇతర వైద్యులతో పర్యటించిన కావ్ లీ విలేకరులతో మాట్లాడారు. వాతావరణానికి, కరోనా వైరస్‌కు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి రుజువు లభించలేదని డాక్టర్ కావ్ లీ స్పష్టం చేశారు. -
బాక్సర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అనుమానాస్పద మృతి..
లాస్ఏంజెల్స్ : మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మెవెదర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జోసీ హారిస్ సబర్బన్ లాస్ఏంజెల్స్లోని తన నివాసంలో మరణించారు. మెవెదర్తో ముగ్గురు సంతానం కలిగిన జోసీ హారిస్ (40) తన ఇంట్లోనే వాక్వేలోని ఓ వాహనంలో విగతజీవిగా పడిఉన్నారని లాస్ఏంజెల్స్ కౌంటీ షరీఫ్ అలెక్స్ విలెనువా వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. 2010లో మెవెదర్ హారిస్‌ను తీవ్రంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. తాను హారిస్‌పై చేయిచేసుకున్నానని, ఆమె చేతిని మెలితిప్పానని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. గృహ హింస ఆరోపణలపై రెండు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్న హారిస్‌ను నియంత్రించేందుకే తానలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక హారిస్ 2015లో మెవెదర్పై పరువునష్టం దావా వేశారు. చదవండి : షరపోవా.. అన్‌స్టాపబుల్ -
తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్ తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కాప్రా సాకేత్ మిథిల ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రం సిద్దిపేటకు చెందిన డాక్టర్ రవీంద్రకుమార్, డాక్టర్ స్మిత దంపతులు. వీరికి ఒక కుమారుడు. వీరు ఆరేళ్ల క్రితం దమ్మాయిగూడలో శ్రీ ఆదిత్య ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కాప్రా సాకేత్ సమీపంలోని మిథిల ఎన్‌క్లేవ్‌లోని ఫ్లాట్ నంబర్ 57లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రవీంద్రకుమార్, స్మిత దంపతుల మధ్య బంధువుల ఫంక్షన్‌కు వెళ్లే విషయమై ఘర్షణ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో కుమారుడిని తీసుకుని స్మిత దిల్‌సుఖ్‌నగర్‌లోని తల్లిగారింటికి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో రవీంద్రకుమార్ తన కుమారుడికి ఫోన్‌చేసి మాట్లాడారు. అనంతరం ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్ ఘటన వెలుగు చూసిందిలా.. స్మిత చెల్లెలు స్వప్న ఆదిత్య ఆసుపత్రిలోనే పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చి రవీంద్రకుమార్‌కు ఫోన్‌చేయగా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫ్లాట్కువెళ్లి చూడగా డాక్టర్ రవీంద్రకుమార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. పక్కనే తుపాకీ ఉంది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో పరిసరాల్లో గాలించారు. రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. జవహర్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్‌కు గతంలో ‘మాజీ’ల బెదిరింపులు మాజీ నక్సలైట్ల పేరుతో 2015లో డాక్టర్ రవీంద్రకుమార్‌కు బెదిరింపులు వచ్చాయి. అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించిన ఆయన తన ఆస్పత్రిలోనే 2016లో వారిని జవహర్‌నగర్ పోలీసులకు పట్టించారు. అప్పటి నుంచి ఫోన్ బెదిరింపులు వస్తుండటంతో లైసెన్స్డ్ గన్ తీసుకున్నారు. కాగా, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక్కరోజు వ్యవధిలో ఓ జవాన్‌తో పాటు డాక్టర్ తమ వద్ద ఉన్న గన్లతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. -
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా బ్యాలదకెరె గేట్ వద్ద బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–75)పై ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఎస్యూవీ అనంతరం కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని హోసూరుకు చెందిన మంజునాథ్ కుటుంబం ధర్మస్థలానికి వెళ్లింది. అనంతరం టవేరా వాహనంలో తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి బ్రిజా కారులో నలుగురు స్నేహితులు ధర్మస్థల వైపు వెళుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కుణిగల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ రోడ్డుకు అటువైపుగా దూసుకెళ్లి, అటునుంచి వస్తున్న టవేరా వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. అమృతూరు పోలీసులు రెండు కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. -
మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
సీనియర్ కేరక్టర్ నటుడు జనార్ధన్ రావు శుక్రవారం కన్ను మూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘమైన నట జీవితంలో ఎన్టీఆర్‌తో సహా పలు అగ్ర హీరోల చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాధించారు. ఆయన మృతిపట్ల ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సంతాపం తెలిపింది. తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు అన్నారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే స్పందించామని తెలిపారు. ‘మా’ యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ మట్లాడుతూ.. జనార్ధన్ రావుతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఆయన మృతికి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ కార్యవర్గం సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. -
పాత్రికేయ ప్రముఖుడు ‘పొత్తూరి’ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: విలువలతో కూడిన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంతో పాటు చివరి శ్వాస వరకు పౌరహక్కులు, బలహీనుల పక్షాన నిలిచిన సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు మూడు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య సత్యవాణి, కుమారులు ప్రేమ్గోపాల్, రహీ ప్రకాష్, కుమార్తెలు వాత్సల్య, డాక్టర్ పద్మజ ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయనకు కుమారుడు గోపాల్ అంత్యక్రియలు నిర్వహించారు. సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. 1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఉదయం పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. జర్నలిజంలో విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆయన తన అభీష్టానికి భిన్నంగా ఓ పత్రిక యాజమాన్యం ఒక వార్తను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సంపాదక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన వ్యాసప్రభ, చింతన, నాటి పత్రికలు–మేటి విలువలు తదితర పుస్తకాలతో పాటు ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను రాశారు. పొత్తూరి ఓ మైలురాయి : గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సంతాపం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా సమాజానికి సేవలందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పాత్రికేయరంగంలో మైలురాయి వంటివారని పేర్కొన్నారు. పత్రికారంగంలో పొత్తూరి సేవలు ఎనలేనివి: సీఎం వైఎస్ జగన్ సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పాత్రికేయరంగంలో పొత్తూరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదు దశాబ్ధాలకు పైగా పత్రికా రంగంలో సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. పొత్తూరి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖుల సంతాపం సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, కుర్తాళం సిద్దేశ్వరీ పీఠం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. -
రోజుకు 21 మంది ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: తమ్ముడికి ట్యాబ్ ఇచ్చి, తనకు ఇవ్వలేదన్న కోపంతో ఆరో తరగతి పిల్లాడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. అప్పు తీర్చలేమోనన్న భయంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్య, ఇద్దరు కొడుకులను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.. ‘ఆత్మీయులు లేనివారే ఆత్మహత్యలకు పాల్పడతారు. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో ఒక్క శాతం సమస్యను పరిష్కరించడానికి కేటాయిస్తే.. తప్పకుండా వారు నూటికి నూరు శాతం సఫలీకృతులవుతారు’ ఇదీ మానసిక నిపుణుల అభిప్రాయం. పరిష్కారం లేని సమస్యంటూ లేదు ఈ ప్రపంచంలో. సులువుగా నొప్పి తెలియకుండా ఎలా చావాలో నెట్లో వెతికే యువత.. అదే సమయాన్ని తమ సమస్య పరిష్కారం కోసం వెతికితే బతకొచ్చన్న సంగతి విస్మరిస్తున్నారు. కారణాలేవైనా.. దేశంలో ఏటా దాదాపున 1.3 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ సగటు ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి లక్ష మందిలో 10.2 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో రోజుకు 21 మంది తనువు చాలిస్తున్నారు. ఏడో స్థానంలో తెలంగాణ.. 2018 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2018లో దేశం మొత్తం మీద 1,34,516 మంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 17,972 ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 13,896 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 13,255 ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్, 11,775 ఆత్మహత్యలతో మధ్యప్రదేశ్, 11,561 మరణాలతో కర్ణాటక నిలిచాయి. ఆరోస్థానంలో 8,237 ఆత్మహత్యలతో కేరళ, ఏడో స్థానంలో 7,845 ఆత్మహత్యలతో మంది ఉన్నాయి. కాగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో 2.2 శాతం ఆత్మహత్యల రేటు (4,849 ఆత్మహత్యలు) మాత్రమే కలిగి ఉండటం గమనార్హం. రేటు పరంగా చూస్తే.. ప్రతి లక్ష మందిలో ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన గణాంకాల ఆధారంగా తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు చూసుకుంటే ప్రతి లక్షమందిలో 10.2 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అండమాన్ నికోబార్‌లో 41, పుదుచ్చేరిలో 33.8, సిక్కింలో 30.2, చత్తీస్‌గఢ్‌లో 24.7, కేరళలో 23.5, తెలంగాణలో 21.2 ఆత్మహత్యలతో జాతీయ సగటు కన్నా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016లో తెలంగాణలో ఈ రేటు 24.5 శాతంగా ఉండేది. అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న బిహార్ ఈ విషయంలో అట్టడుగున ఉండటం గమనార్హం. ఇక్కడ ఆత్మహత్యల శాతం ప్రతి లక్ష మందిలో 0.4 శాతం మాత్రమే కావడం విశేషం. అసలు సమస్య అదే: డాక్టర్ వీరేంద్ర, సైకాలజిస్ట్ డిప్రెషన్‌ను గుర్తించకపోవడమే ఆత్మహత్యలకు మూలం. జీవితంలో పైకి వచ్చిన చాలామంది సెలబ్రెటీలు తర్వాత కాలంలో పూర్వపు గుర్తింపు, ఆదరణ దక్కట్లేదనో, తమ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపట్లేదన్న కారణాలతో డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఇలాంటివారు సమాజానికి దూరంగా ఒంటరిగా ఉంటారు. నిర్వేదంగా, నిస్తేజంగా మాట్లాడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే వారికి తగిన చికిత్స అందించినా.. ఆత్మీయులు, సన్నిహితులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించే యత్నం చేసినా.. వారిలో తిరిగి బతుకుపై ఆశలు కలిగించొచ్చు. అవి కాన్సంట్రేషన్ క్యాంప్స్: డాక్టర్ శారదా, ఫ్రొఫెసర్ ఉస్మానియా వర్సిటీ ర్యాంకుల పేరిట స్కూళ్లు, కాలేజీల్లో పిల్లలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లాంటి హాస్టళ్లలో పెడుతున్నారు. ఒత్తిడిని అలవాటు చేస్తూ, విజయాలను చూపిస్తున్నారే తప్ప.. ఓడిపోతే ఏం చేయాలనేది ఎవరూ నేర్పట్లేదు. ఇలాంటివారు జీవితంలో మంచి ఉద్యోగాలు సంపాదించినా.. వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఎదురుకాగానే వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. మానవ వనరులపరంగా దేశానికి ఇది ఎంతో చేటు. ర్యాంకులు, మార్కులు, పోటీతత్వం విజయానికి కొలమానాలు కావు. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోగలిగే సామర్థ్యం విద్యార్థులకు నేర్పినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆత్మహత్యకు కారణాలివే.. కుటుంబ సమస్యలు 30.4% అనారోగ్యం 17.7% వివాహ సమస్యలు 6.2% మాదకద్రవ్యాల బానిసలు 5.3% ప్రేమ సమస్యలు 4% -
శ్రీమఠం పూర్వ పీఠాధిపతి కళాకర్షణ
45రోజుల తర్వాత పార్థివదేహం వెలికితీత 6 నుంచి 11గంటల వరకు ముఖదర్శనం మంత్రాలయం, : కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠం పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల కళాకర్షణ ఆదివారం నిర్వహించారు. స్వామి ముఖ దర్శనంతో భక్తులు పరవశించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత మార్చి 8న పూర్వ పీఠాధిపతి పరమపదించిన విషయం తెలిసిందే. మధ్వమత ఆచారంలో భాగంగా పరమపదించిన పీఠాధిపతుల పార్థివ దేహాన్ని ముఖ దర్శనార్థం బృందావనం నుంచి వెలికితీశారు. ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామి ముఖ దర్శనంతో భక్తులు తరించారు. పార్థివదేహానికి ముందుగా ఆయన కుమారుడు, మఠం ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్ మంగళహారతినిచ్చారు. 45 రోజుల తర్వాత వెలికి తీసిన పార్థివదేహం చెక్కుచెదరకపోవడం విశేషం. దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చివరగా స్వామి కుమారుడు మరోసారి హారతినిచ్చిన అనంతరం బృందావనం చేశారు.