ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వస్తున్న కరోనా పాజిటివ్ అనుమానితురాలు
సాక్షి, న్యూఢిల్లీ/కోజికోడ్: దేశంలో కరోనా కల్లోలానికి కళ్లెం పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా రికార్డు స్థాయిలో 1,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు, మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 17,915 కాగా, 4,813 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కేరళలో 4 నెలల చిన్నారి బలి
కరోనా మహమ్మారి కేరళలో 4 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. మలప్పురం జిల్లాలోని పయనాడ్‌కు చెందిన ఈ పాప జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 21న కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్చారు. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతే కాకుండా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స పొందు తూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కేరళలో మూడో కరోనా సంబంధిత మరణం ఈ పాపదే. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తొలి చిన్నారి ఈమె.
ఆజాద్‌పూర్ మండీలో 300 దుకాణాలు మూసివేత
ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలోని డి–బ్లాక్‌లో 300 దుకాణాలను మూసివేశారు. ఈ మండీలో ఒక వ్యాపారి (57) ఏప్రిల్ 21న కరోనా వైరస్ సోకి మరణించాడు. బుధవారం మార్కెట్‌లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment