Azadpur
-
ఒక్కరోజులో 1,752 పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ/కోజికోడ్: దేశంలో కరోనా కల్లోలానికి కళ్లెం పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా రికార్డు స్థాయిలో 1,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు, మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 17,915 కాగా, 4,813 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో 4 నెలల చిన్నారి బలి కరోనా మహమ్మారి కేరళలో 4 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. మలప్పురం జిల్లాలోని పయనాడ్కు చెందిన ఈ పాప జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 21న కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతే కాకుండా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స పొందు తూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కేరళలో మూడో కరోనా సంబంధిత మరణం ఈ పాపదే. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తొలి చిన్నారి ఈమె. ఆజాద్‌పూర్ మండీలో 300 దుకాణాలు మూసివేత ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలోని డి–బ్లాక్‌లో 300 దుకాణాలను మూసివేశారు. ఈ మండీలో ఒక వ్యాపారి (57) ఏప్రిల్ 21న కరోనా వైరస్ సోకి మరణించాడు. బుధవారం మార్కెట్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. -
రైతులకు ఆశాకిరణం ఆజాద్‌పూర్ మండీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతి పెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీ 24 గంటలపాటు పనిచేస్తుండడం రైతులకు ఆశాకిరణంగా మారింది. లాక్ డౌన్లో పరిమిత వేళలు పనిచేసిన ఈ మండీలో భౌతిక దూరం పాటించేందుకు, సరుకు వర్తకం సులువుగా సాగేలా, 24 గంటలు పనిచేసేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆజాద్‌పూర్ మార్కెట్ కమిటీ అధికారులు, స్థానిక జిల్లా యంత్రాంగంతో చర్చించి ఒప్పించారు. మంగళవారం ఈ మండీకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. లాక్ డౌన్ ఇబ్బందులపై చర్చించారు. క్రమంగా ట్రేడర్లు పంట కొనుగోలు చేస్తుండటంతో వాటి ధరలు కాస్త పుంజుకుంటున్నాయి. ఏప్రిల్ 16న టన్ను బత్తాయి సగటున రూ.16,500 పలకగా.. ఏప్రిల్ 20న అది రూ.2,463 లు పలికింది. ఏప్రిల్ 20న టన్ను బత్తాయి కనిష్టంగా రూ.9,000, గరిష్టంగా రూ.40 వేలు పలికింది. పుంజుకున్న సరుకు రవాణా.. ఆజాద్‌పూర్ మండీని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 1977లో నిర్మించింది. 44 ఎకరాల విస్తీర్ణంలో 1,400కు పైగా హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ 4 వేల మంది కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. ఆపిల్, అరటి, నారింజ, మామిడి, బత్తాయి తదితర పండ్లకు అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఆలుగడ్డ, గోబీ, టమాట, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తదితరాలకు మార్కెట్‌గా ఉంది. ఏటా 50 లక్షల టన్నుల పండ్లు, కూరగాయల అమ్మకాలు జరిగే ఈ మార్కెట్ లాక్డౌన్ ప్రభావానికి లోనైంది. మార్చి 23 నాటికి దాదాపు రోజు సగటున 15 వేల టన్నుల పండ్లు, కూరగాయలు రవాణా కాగా.. మార్చి 24 తర్వాత ఇది సగానికిపైగా పడిపోయింది. మంత్రి జి.కిషన్‌రెడ్డి చర్యలతో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ట్రక్కులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. తరలివస్తున్న పంటలు ఏపీ నుంచి అరటి తదితర ఉద్యాన పంటలు, టమాట, ఉల్లి తదితరాలు, తెలంగాణ నుంచి బత్తాయి, మామిడి, కూరగాయలు సరఫరా అవుతాయి. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష తదితరాలు వస్తాయి. తెలుగు రైతుల అవసరాలు తీరుస్తుంది ‘తెలంగాణ బత్తాయి రైతుల అవసరాలు తీరుస్తుంది. ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల పంట ఈ మండీకి వస్తుంది. ఏపీ నుంచి బత్తాయి, అరటి, మామిడి ఇక్కడికి రవాణా అవుతున్నాయి. జగిత్యాల నుంచి మామిడి, అనంతపురం నుంచి బత్తాయి మండికి వచ్చింది. ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఉండదు. అవాంతరాలు వస్తే 14488 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయొచ్చు. – కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి రైతులు తమ పంటను పంపొచ్చు ‘24 గంటల పాటు మార్కెట్ పనిచేస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి కూడా బత్తాయి, మామిడి, అరటి వంటి పంటలు వస్తున్నాయి. వలంటీర్ల వ్యవస్థ కూడా పనిచేస్తోంది..’అని ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. – ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ -
కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ : అసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఢిల్లీలోని అజాద్‌పూర్ మండిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మండి వ్యాపారి కరోనాతో మరణించడంతో మార్కెట్ వ్యాపారులంతా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడంతో మార్కెట్‌ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అజాద్‌పూర్ మండికి చెందిన బోలా దత్త్ (57) అనే బఠానీ వ్యాపారి జ్వరం కారణంగా ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆదివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. అజాద్‌పూర్ మార్కెట్లో తొలి మరణం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.గత కొంత కాలంగా వ్యాపారిని సంప్రందించిన వారి వివరాలను సేకరిస్తన్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ షిండే తెలిపారు. (క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై ) ఈ క్రమంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. క్వారంటైన్‌కి పంపించాల్సిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి పేర్నొనడం గమనార్హం. (జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి ) అజాద్‌పూర్ మండి వ్యాపారి బోలా దత్ మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్‌ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిపై మార్కెట్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసివేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని వ్యాపారులు తెలిపారు. జపనీస్ పార్క్ లేదా ఇతర విశాల ప్రదేశాలలో సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. (మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్! ) కాగా అజాద్‌పూర్ మార్కెట్లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్లో లాక్డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు. అయితే మార్కెట్‌లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది. (ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన వ్యక్తికి పాజిటివ్ ) -
చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వైపు కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. మరోవైపు రూ.100 ఖర్చు చేసినా సంచిలో ఏమూలకూ రాని కూరగాయలు.. ఇలా చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి గత నెల తో పోలిస్తే కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రవాణాభారం, తక్కువ మొత్తంలో అందుబాటులో ఉండడంతోసామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజధాని కూరగాయల వ్యాపారులు చెబుతున్న ప్రకారం.. గత జూన్ 16న వరదల కారణంగా యమునా నదీతీరాన వందల ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయల పంటలు కొట్టుకుపోయాయి. దీంతో పూర్తిగా బయటి నుంచి వచ్చే కూరగాయలపైనే నగర వాసులు ఆధారపడాల్సి వస్తోంది. దీనికి తోడు ఇటీవల పెంచిన సీఎన్జీ ధరలతో రవాణా చార్జీలు మరికాస్త పెరిగాయి. ఫలితంగా కూరగాయల ధరలు తగ్గడం లేదు. కొత్త పంటలు మార్కెట్లలోకి రావడానికి మరో నెల సమయం పడుతుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూరగాయలు నగరానికి దిగుమతి కానున్నాయని వారు పేర్కొన్నారు. దసరా పండుగ వరకు కూరగాయల ధరలు పూర్తిగా తగ్గుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆజాద్‌పూర్ మండీ వ్యాపారులు చెబుతున్న ప్రకారం కొన్ని రోజులుగా కూరగాయలు కాస్త ఎక్కువ పరిమాణం లో వస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి ధరలు సర్దుకునే అవకాశం ఉన్నట్టువారు తెలిపారు. దిగుమతులతో కాస్త ఊరట ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయలు నగరానికి చేరుకోవడంతో వీటి టోకుధరలు రూ.10 మేర తగ్గాయి. అయితే చిల్లర ధరలు మాత్రం రూ.70-80 వరకు పలుకుతున్నాయి. దాదాపు రెండువేల క్వింటాళ్ల లోడ్లతో ఉన్న 25 ఉల్లి ట్రక్కులు ఆజాద్‌మండీకి శుక్రవారం చేరుకున్నాయని వ్యాపారులు చెప్పారు. అఫ్ఘానిస్థాన్ నుంచి కూడా దిగుమతులు రావడంతో వీటి కిలో టోకుధరలు రూ.60 నుంచి రూ.50కి పడిపోయాయి. పస్తుతం రూ.60కి కేజీ చొప్పున విక్రయిస్తున్న మదర్ డెయిరీలు శనివా రం రూ.50కే అమ్మాలని భావిస్తున్నాయి. ఉల్లి కనిష్ట ఎగుమతి ధరలను కూడా ప్రభుత్వం పెంచడంతో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆజాద్‌పూర్ మండీ ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సురేంద్ర బుధిరాజ్ అన్నారు. ధరల పెంపు వల్ల ఎగుమతులు తగ్గుముఖం పడతాయన్నారు. ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండే మహారాష్ట్ర లాసల్గావ్ మార్కెట్లోనూ టోకు ధరలు పడిపోవడంతో దాని ప్రభావం ఆజాద్‌పూర్ మండీలోనూ కనిపించిందని బుధిరాజ్ పేర్కొన్నారు. వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు కూరగాయ= కిలో ధర టమాట= రూ.50 ఆలు= రూ.40 పచ్చిమిర్చి= రూ.40 ఉల్లి = రూ.70 క్యాబేజీ= రూ.40 క్యారెట్= రూ.60 బెండ= రూ.60 కాకరికాయ= రూ.50 నిమ్మ= రూ.80 వంకాయ= రూ.40