న్యూఢిల్లీ : అసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఢిల్లీలోని అజాద్‌పూర్ మండిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మండి వ్యాపారి కరోనాతో మరణించడంతో మార్కెట్ వ్యాపారులంతా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడంతో మార్కెట్‌ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అజాద్‌పూర్ మండికి చెందిన బోలా దత్త్ (57) అనే బఠానీ వ్యాపారి జ్వరం కారణంగా ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆదివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. అజాద్‌పూర్ మార్కెట్‌లో తొలి మరణం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.గత కొంత కాలంగా వ్యాపారిని సంప్రందించిన వారి వివరాలను సేకరిస్తన్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ షిండే తెలిపారు.
(క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై )
ఈ క్రమంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. క్వారంటైన్‌కి పంపించాల్సిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి పేర్నొనడం గమనార్హం. (జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి )
అజాద్‌పూర్ మండి వ్యాపారి బోలా దత్ మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్‌ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిపై మార్కెట్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసివేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని వ్యాపారులు తెలిపారు. జపనీస్ పార్క్ లేదా ఇతర విశాల ప్రదేశాలలో సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. (మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్! )
కాగా అజాద్‌పూర్ మార్కెట్‌లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌లో లాక్‌డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు. అయితే మార్కెట్‌లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది. (ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన వ్యక్తికి పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment