Fruit market
-
హైదరాబాద్.. సీజన్ పూర్తిగా ప్రారంభం కానే లేదు.. మామిడి పండ్లు మహా ప్రియం
సాక్షి, హైదరాబాద్: వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్‌కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్‌సేల్ మార్కెట్లోనే మంచి రకం రూ.60–70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఏప్రిల్ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు. సోమవారం నుంచి మామిడి మార్కెట్‌కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్‌కు సోమవారం 1500–1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 80–100కు లభిస్తోంది. మార్కెట్‌కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. 19 ఎకరాల్లో ఏర్పాట్లు.. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్లో 19.27 ఎకరాల్లో మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మామిడి సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్‌తో పాటు జనరేటర్‌నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. -
భారీ వర్షానికి హైదరాబాద్ బాట సింగారం పండ్ల మార్కెట్లో వరదలు
-
Hyderabad: కొత్తపేట్ పండ్ల మార్కెట్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో కొత్తపేట్ పండ్ల మార్కెట్ శుక్రవారం పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. కమీషన్ ఏజెంట్లకు ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం అందించారు. షాపుల్లో, షెడ్లల్లో ఉన్న సామగ్రి తీసుకెళ్లాలని నోటీసులు పెట్టారు. కొత్తపేట్ నుంచి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో బాటసింగారానికి తరలించారు. అక్కడ పండ్ల దిగుమతులు పెరగడంతో వ్యాపారులు, హమాలీలతో మార్కెట్ కళకళలాడుతోంది. గతంతో పోలిస్తే బాటసింగారంలో క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ అధికారులు కూడా పెరిగిన పండ్ల దిగుమతులతో రైతులకు, వ్యాపారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు చేసినట్లు కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి తెలిపారు. (చదవండి: సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన) -
ముక్కలైన కొత్తపేట్ పండ్ల మార్కెట్.. తలో దిక్కు..
సాక్షి,హైదరాబాద్: పోయిన దసరా రోజున బాటసింగారంలో ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగడంలేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సాగక తిరిగి కొత్తపేట్ పరిసరాలకే చేరుకున్నారు. రూ.కోట్లతో సకల సౌకర్యాలు కల్పించామని మార్కెటింగ్‌శాఖ ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు కొత్తగా ఏర్పాటు చేసిన బాటసింగారం వైపు ఆసక్తి కనబర్చడంలేదు. కొంతమంది కమిషన్ ఏజెంట్లు కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం నిలిపివేశారు. మరికొందరు ఎల్బీనగర్ చుట్టు పక్కల స్థలాలు అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కొత్తపేట్ పరిసరాల్లో రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. దీంతో గతంలో ప్రాంగణంలో కొనసాగిన వ్యాపారం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నులకొద్దీ వచ్చే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌కు రావడం నిలిచిపోయింది. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాటసింగారానికి ససేమిరా.. కమిషన్ ఏజెంట్లు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుని ఎల్బీనగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ అధికారులు బలవంతంగా బాటసింగరానికి తరలించినా అక్కడ వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు అధికారుల బెదిరింపులతో బాటసింగారం వెళ్లి ఎంట్రీ చేసుకొని వచ్చి మళ్లీ కొత్తపేట్ ప్రాంతంలోనే పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్లపై విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారులు తుదకు వ్యాపారమే మానివేయడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో దిగాలుగా కూర్చున్న వ్యక్తి పేరు ఫరీద్. గతంలో కొత్తపేట్ మార్కెట్లో పండ్లు విక్రయించేవాడు. ఆ మార్కెట్‌ను మూసివేయడంతో ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. బాటసింగారంలో పండ్ల అమ్మకాలు సరిగా ఉండవనే ఉద్దేశంతో కొత్తపేట్ రహదారిపైనే ఇలా పండ్లు విక్రయిస్తున్నాడు. విక్రయాలు సక్రమంగా లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడి పేరు హనుమంతు. కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేయడంతో కొంత కాలం వ్యాపారం చేయలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ అవసరాల కోసం మార్కెట్ చుట్టపక్కల స్థలం అద్దెకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. బాటసింగారం వెళ్లలేక మార్కెట్‌కు దగ్గరలో పండ్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండ్లు విక్రయిస్తున్న ఈ వ్యక్తి జహంగీర్ కొత్తపేట్ మార్కెట్‌ను మూసేసిన తర్వాత కొన్ని రోజులకు అధికారులు బలవంతం చేయడంతో బాటసింగారం వెళ్లాడు. అక్కడ వినియోగదారులు లేకపోవడంతో తిరిగి కొత్తపేటకే చేరుకున్నాడు. బాటసింగారంలో వ్యాపారం చేద్దామంటే వినియోగదారులు రావడం లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నాడు. -
దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్: నాడు అలా, నేడు ఇలా!
సాక్షి, చైతన్యపురి: దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి చెంది.. 35 ఏళ్లపాటు వేలాది మంది రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలకు బాసటగా నిలిచి..నగరవాసులకు ఒక గుర్తుగా మిగిలిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కథ ముగిసింది.1986లో ఏర్పడిన ఈ మార్కెట్‌కు మూడు రోజుల క్రితం తాళం పడింది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్కెట్‌ను బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కుకు తరలించారు. దీంతో నిత్యం వందలాది లారీలు... లావాదేవీలు..చిరు వ్యాపారులతో సందడిగా ఉండే మార్కెట్ మూగబోయింది. మామిడి సీజన్లో ఇక్కడ భారీ లావాదేవీలు జరుగుతుంటాయి. కొత్తపేట పండ్ల మార్కెట్ బుధవారం ఇలా బోసిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సరుకు వస్తుంటుంది. ఇక ఇవన్నీ ఆగిపోయినట్లే. మరోవైపు మార్కెట్ తరలింపును ఇష్టపడని వ్యాపారులు, రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఏళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న కూలీలు, హమాలీలు సైతం నిరాశకు గురయ్యారు. బాటసింగారంలో..కోహెడలో సరైన వసతులు కల్పించకుండా తమను అక్కడికి వెళ్లాలని ఆదేశించడం ఏమాత్రం సబబుగా లేదని వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్తపేట్ పండ్ల మార్కెట్ మూసివేతకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ పండ్ల మార్కెట్ తరలింపునకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి బాటసింగారంలో మార్కెట్ కార్యకలపాలు ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముత్యంరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు తీర్మానించామన్నారు. ఇప్పటికే కొత్తపేట్ పండ్ల మార్కెట్ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మార్కెట్ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకు రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని కోరారు. బాటసింగారంలో మార్కెట్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చదవండి: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే.. -
ఈ నెల 25 నుండి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మూసివేత
-
కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ పైకరోనా ఎఫెక్ట్
-
మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం
సాక్షి, వరంగల్ : వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో కమీషన్ వ్యాపారులు ఒకరిద్దరే దశాబ్దాల కాలంగా శాసిస్తున్నారు. మార్కెట్లో బడా వ్యాపారులుగా పేరు ఉండడంతో వీరు చెప్పిందే ధర.. కాదు కూడదంటే సదరు రైతు, దళారులకు సంబంధించిన మామిడి కాయలను ఎవరు కొనుగోలు చేసేందుకే సాహసం చేయరు. ఈ విషయాన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తామేం చేయలేమన్న సమాధానం వస్తుంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు సైతం ఒకరిద్దరి కనుసన్నల్లోనే లావాదేవీలు జరుపుతుంటారు. ఇక ఓ వ్యాపారి అయితే పండ్ల మార్కెట్లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట నాలుగైదు మడిగెలను సొంతం చేసుకున్నారు. కరోనా సాకుతో పండ్ల మార్కెట్‌ను నగర శివార్లలోకి మార్చడం వెనుక కూడా సదరు వ్యాపారి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గత సంవత్సరం సుమారు రూ.కోటి మేర వ్యాపారులు కట్టాల్సిన మార్కెట్ ఫీజుకు ఎగనామం పెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు వాయిదాల వారీగా చెల్లించక తప్పలేదు. ప్రతీ టన్నుకు క్వింటా తరుగు, కమీషన్ 4శాతానికి బదులు 10శాతం తీసుకుంటున్నా అధికారులు చూస్తున్నారే తప్ప సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టన్నుకు క్వింటా దోపిడీ మామిడి కొనుగోలు చేస్తున్న కమీషన్ వ్యాపారులు టన్నుకు క్వింటాను తరుగుగా తీసివేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మార్కెట్ అధికారిక లెక్కల ప్రకారం 2,57,046 కింటాళ్ల మామిడి కొనుగోలు చేయగా తరుగు కింద 25వేల క్వింటాళ్లకు పైగా వ్యాపారులు రైతుల వద్ద తరుగు పేరుతో దోచేశారు. క్వింటాకు మోడల్ ధరగా రూ.2,500 చొప్పున వేసుకున్నా సుమారు రూ.కోటికి పైగా రైతులు తమ ఆదాయాన్ని కమీషన్ వ్యాపారుల వల్ల కోల్పోయినట్లే. ఖమ్మంతో పాటు ఇతర మార్కెట్లలో టన్నుకు 40కిలోలు తరుగు కింద తీసివేస్తారని తెలిసింది. కానీ ఇక్కడ క్వింటా తీస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మార్కెట్ అధికారులను ప్రశ్నిస్తే కమీసన్ ‘వ్యాపారుల లీడర్ నుంచి మా ఇష్టం.. అమ్మితే అమ్మండి లేకుంటే లేదు’ అనే సమాధానం వస్తోందని చెబుతున్నారట. తరుగు, కమీషన్లపై తాము ఎక్కువగా ఒత్తిడి చేస్తే కొనుగోళ్లు మొత్తం ఆపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నందున ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతుండడం గమనార్హం. చదవండి: ‘ఆర్ఎఫ్సీఎల్’లో లీకవుతున్న గ్యాస్ -
మధుర ఫలం.. చైనా విషం!
సాక్షి, సిటీబ్యూరో: మామిడి పండ్ల రుచి మధురాతి మధురం. అన్ని వర్గాల ప్రజలూ దీని రుచి ఆస్వాదించేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ.. వ్యాపారుల అత్యాశ కారణంగా ఈ మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్న పండ్లు ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. కరోనా ప్రభావంతో పండ్ల మార్కెట్లో మామిడి కాయలను కేవలం లారీల్లోనే ఉంచి విక్రయించడానికి అధికారులు అనుమతిస్తే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఎల్బీనగర్ తదితర ప్రాంతాల ఫంక్షన్ హాళ్లు, కోహెడ వెళ్లే దారిలో ఉన్న గోడౌన్లను అద్దెకు తీసుకొని కాయలను మగ్గించడానికి విషపూరితమైన చైనా పౌడర్‌ను వాడుతున్నారు. మార్కెట్ల అనుమతులు లేకపోవడంతో స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడే మామిడి కాయలను ప్యాకింగ్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. కాలుష్య కార్బైడ్ నిషేధం.. చైనా పౌడర్‌లో కార్బైడ్ ఉందని విషయం గతంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో వెల్లడైంది. కార్బైడ్ ద్వారా మిగ్గించిన పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. వ్యాపారులు రూట్ మార్చి కార్బైడ్‌కు బదులుగా చైనా పౌడర్‌తో మగ్గిస్తున్నారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చి విక్రయిస్తున్నారు. మామిడి కాయల్ని మగ్గించడానికి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ప్యాకింగ్ చేయడంలేదు.. మార్కెట్లో కేవలం మామిడి కాయల లారీల్లో ఉంచి విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే.. మామిడికాయలను మార్కెట్ యార్డ్‌లో ప్యాకింగ్ చేయడం లేదు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిన కాయలను ఎల్బీనగర్తో పాటు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆహారభద్రత శాఖ నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ -
కోహెడ బాధితులకు ప్రభుత్వం అండ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోహెడ మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కల్పించటం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కోహెడ దుర్ఘటనపై స్పందించిన ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని చెప్పారు. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప అమ్మ, సన్ రైస్, షాడో, టైటాన్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు. సీరియస్ ఉన్న ఒకరిని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం 12 మందిని ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జి చేశారని, మిగిలిన 18 మంది చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. నాలుగు ఆసుపత్రుల్లో పర్యవేక్షణకు నలుగురు అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి విచినట్లు వాతావరణ శాఖ నివేదిక తెలిపిందన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రాజకీయాలు పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెట్ పునరుద్దరించే వరకు కొనుగోళ్ల కోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇక సోమవారం కోహెడ మార్కెట్లో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. -
కొహెడ ఘటనలో 26మందికి గాయాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొహెడలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్లోని షెడ్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హయత్ నగర్ అమ్మ ఆసుపత్రిలో 12 మంది, సన్‌రైజ్ లో నలుగురు, షాడో ఆసుపత్రిలో ఏడుగురు, మరో ముగ్గురు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. క్షతగ్రాతులకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విపరీతమైన సుడిగాలి వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేవు: ఎంపీ కోమటిరెడ్డి పండ్ల మార్కెట్లో కూలిపోయిన షెడ్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్రెడ్డి రామ్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పండ్ల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేమి తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదన్నారు. మార్కెట్లో భౌతిక దూరం పాటిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పండ్ల మార్కెట్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు. -
‘మాయమాటలు చెప్పి అర్ధరాత్రి తరలించారు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మంత్రులు మాయమాటలు చెప్పి పండ్ల మార్కెట్‌ను అర్ధరాత్రి తరలించారని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కోహెడ పండ్ల మార్కెట్లో పర్యటించారు.ఈ సందర్భంగా పండ్ల వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అరకొర సౌకర్యాలు కల్పించి పూర్తిస్థాయిలో మార్కెట్ పూర్తయ్యిందని ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అనేది అర్థం కావడంలేదని విమర్శించారు. మార్కెట్లో నీరు, తిండి కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో పండ్ల మార్కెట్‌ని తరలించారని ఆయన మండిపడ్డారు. (‘టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోంది’) నగరంలో జనసంద్రం ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి పండ్ల మార్కెట్‌ని ఆకస్మాత్తుగా తరలించడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పండ్ల మార్కెట్‌కి వస్తున్నవారికి టెస్టులు చేయడంలేదన్నారు. కోహెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోహెడ పరిసర ప్రాంతాల గ్రామాలకు వాహనాల వల్ల ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులకు,వ్యాపారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రాచకొండ సీపీతో మాట్లాడి పోలీసు చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తూ తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. (కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : మంత్రి) -
రైతులకు ఆశాకిరణం ఆజాద్‌పూర్ మండీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతి పెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీ 24 గంటలపాటు పనిచేస్తుండడం రైతులకు ఆశాకిరణంగా మారింది. లాక్ డౌన్లో పరిమిత వేళలు పనిచేసిన ఈ మండీలో భౌతిక దూరం పాటించేందుకు, సరుకు వర్తకం సులువుగా సాగేలా, 24 గంటలు పనిచేసేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆజాద్‌పూర్ మార్కెట్ కమిటీ అధికారులు, స్థానిక జిల్లా యంత్రాంగంతో చర్చించి ఒప్పించారు. మంగళవారం ఈ మండీకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. లాక్ డౌన్ ఇబ్బందులపై చర్చించారు. క్రమంగా ట్రేడర్లు పంట కొనుగోలు చేస్తుండటంతో వాటి ధరలు కాస్త పుంజుకుంటున్నాయి. ఏప్రిల్ 16న టన్ను బత్తాయి సగటున రూ.16,500 పలకగా.. ఏప్రిల్ 20న అది రూ.2,463 లు పలికింది. ఏప్రిల్ 20న టన్ను బత్తాయి కనిష్టంగా రూ.9,000, గరిష్టంగా రూ.40 వేలు పలికింది. పుంజుకున్న సరుకు రవాణా.. ఆజాద్‌పూర్ మండీని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 1977లో నిర్మించింది. 44 ఎకరాల విస్తీర్ణంలో 1,400కు పైగా హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ 4 వేల మంది కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. ఆపిల్, అరటి, నారింజ, మామిడి, బత్తాయి తదితర పండ్లకు అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఆలుగడ్డ, గోబీ, టమాట, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తదితరాలకు మార్కెట్‌గా ఉంది. ఏటా 50 లక్షల టన్నుల పండ్లు, కూరగాయల అమ్మకాలు జరిగే ఈ మార్కెట్ లాక్డౌన్ ప్రభావానికి లోనైంది. మార్చి 23 నాటికి దాదాపు రోజు సగటున 15 వేల టన్నుల పండ్లు, కూరగాయలు రవాణా కాగా.. మార్చి 24 తర్వాత ఇది సగానికిపైగా పడిపోయింది. మంత్రి జి.కిషన్‌రెడ్డి చర్యలతో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ట్రక్కులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. తరలివస్తున్న పంటలు ఏపీ నుంచి అరటి తదితర ఉద్యాన పంటలు, టమాట, ఉల్లి తదితరాలు, తెలంగాణ నుంచి బత్తాయి, మామిడి, కూరగాయలు సరఫరా అవుతాయి. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష తదితరాలు వస్తాయి. తెలుగు రైతుల అవసరాలు తీరుస్తుంది ‘తెలంగాణ బత్తాయి రైతుల అవసరాలు తీరుస్తుంది. ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల పంట ఈ మండీకి వస్తుంది. ఏపీ నుంచి బత్తాయి, అరటి, మామిడి ఇక్కడికి రవాణా అవుతున్నాయి. జగిత్యాల నుంచి మామిడి, అనంతపురం నుంచి బత్తాయి మండికి వచ్చింది. ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఉండదు. అవాంతరాలు వస్తే 14488 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయొచ్చు. – కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి రైతులు తమ పంటను పంపొచ్చు ‘24 గంటల పాటు మార్కెట్ పనిచేస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి కూడా బత్తాయి, మామిడి, అరటి వంటి పంటలు వస్తున్నాయి. వలంటీర్ల వ్యవస్థ కూడా పనిచేస్తోంది..’అని ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. – ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ -
కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ : అసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఢిల్లీలోని అజాద్‌పూర్ మండిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మండి వ్యాపారి కరోనాతో మరణించడంతో మార్కెట్ వ్యాపారులంతా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడంతో మార్కెట్‌ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అజాద్‌పూర్ మండికి చెందిన బోలా దత్త్ (57) అనే బఠానీ వ్యాపారి జ్వరం కారణంగా ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆదివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. అజాద్‌పూర్ మార్కెట్లో తొలి మరణం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.గత కొంత కాలంగా వ్యాపారిని సంప్రందించిన వారి వివరాలను సేకరిస్తన్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ షిండే తెలిపారు. (క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై ) ఈ క్రమంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. క్వారంటైన్‌కి పంపించాల్సిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి పేర్నొనడం గమనార్హం. (జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి ) అజాద్‌పూర్ మండి వ్యాపారి బోలా దత్ మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్‌ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిపై మార్కెట్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసివేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని వ్యాపారులు తెలిపారు. జపనీస్ పార్క్ లేదా ఇతర విశాల ప్రదేశాలలో సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. (మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్! ) కాగా అజాద్‌పూర్ మార్కెట్లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్లో లాక్డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు. అయితే మార్కెట్‌లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది. (ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన వ్యక్తికి పాజిటివ్ ) -
‘పండ్ల మార్కెట్ తరలింపునకు సహకరించాలి’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23 వరకు కొత్తపేట పండ్ల మార్కెట్ తెరిచే ఉంటుందని.. 27న కోహెడలో నూతన పండ్ల మార్కెట్ ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తపేట పండ్ల మార్కెట్ తరలింపుపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచి రెడ్డి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కోహెడ మార్కెట్ కు ఈ మామిడి సీజన్లో తరలించడం వల్ల వ్యాపారులు, ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు కొత్తపేట మార్కెట్‌కు రావడం వల్లన తీవ్ర సమస్య ఏర్పడుతుందని.. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించకుండా..వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కరోనా వ్యాప్తి నియంత్రణకు విఘాతం కలుగుతుందని మంత్రి తెలిపారు. కోహెడలో 170 ఎకరాల స్థలం కేటాయించడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా 5 ఎకరాల స్థలంలో యుద్ధప్రాతిపదికన 132 కేవీ సబ్‌స్టేషన్ కూడా మంజూరవుతుందన్నారు. రోడ్లు, మంచినీటి పనులను కూడా వెంటనే ప్రారంభించాలని మంత్రి కోరారు. మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో మార్కెట్ తరలింపునకు ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
బత్తాయి రైతులకు ఊరట..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో నల్గొండ బత్తాయి రైతులకు ఊరట కలిగింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన ఢిల్లీ అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌ను అధికారులు తిరిగి తెరిపించారు. బత్తాయి రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి.. ఇకపై 24 గంటలు అజాద్‌పూర్ మండి తెరచి ఉండేలా చర్యలు చేపట్టారు. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల కూరగాయల మార్కెట్‌గా పేరొందిన అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌కు తెలంగాణ నుంచి ప్రతి ఏడాది 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి పండ్లు తరలిస్తారు. లాక్డౌన్ కారణంగా బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మార్కెట్‌ను తెరిపించే విధంగా చొరవ తీసుకున్నారు. బత్తాయి రైతుల కోసం నేటి నుంచి మార్కెట్ తెరిచి ఉంటుందని ఆయన తెలిపారు. -
తీపి కల తీరెన్
ఎల్బీనగర్: దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంత వాసులకుతీపి కబురు. ఇక్కడి పండ్ల మార్కెట్ తరలింపు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011 నుంచి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించినట్లయ్యింది. సుమారు 9 ఏళ్లుగా మార్కెట్ తరలింపు విషయంలో మంత్రులతో పాటు అధికారులతో పలు దఫాలుగా ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తరలింపునకు పునాది పడినా జీఓలు జారీ చేయకపోవడంతోపాటు స్థల సేకరణ విషయంలో జాప్యం ఏర్పడింది. ఇన్నేళ్ల తర్వాత ఓ కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక తరలింపే ఆలస్యం.. కోహెడలో 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్నేళ్లుగా మామిడి సీజన్ రాగానే మార్కెట్ తరలింపు ఇదిగో అదిగో అంటూ అధికారులు తర్జనభర్జన పడేవారు. 1986లో కొత్తపేటలో 22 ఎకరాల స్థలంలో అప్పటి ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను తరలించేందుకు నిర్ణయించారు. శివారు ప్రాంతం కావడంతో అనువుగా ఉందని నగరంలోని మార్కెట్‌ను ఇక్కడికి తరలించారు. జనాభా పెరగడం, కాలనీలు విస్తరించడం, వాహనాల సంఖ్య పెరగడంతో కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తింది. దీంతో సుధీర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పండ్ల మార్కెట్ తరలింపునకు ప్రణాళికలు వేశారు. అప్పట్లో జీఓ వస్తుందనే సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరుగున పడింది. 2014 ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఓటమి చెందారు. దీంతో మార్కెట్ తరలింపు విషయం పూర్తిగా ఆగిపోయింది. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మార్కెట్ తరలింపుపై పలు పట్టుబట్టారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది. మొత్తానికి మార్కెట్ తరలింపు విషయంలో సుధీర్‌రెడ్డి కల నిజమైందని చెప్పవచ్చు. కాగా.. కోహెడకు మార్కెట్ తరలింపే ఇక ఆలస్యమని సమాచారం. ఈసారి మామిడి సీజన్ ఎక్కడ..? ఈసారి మామిడి సీజన్ ఎక్కడ నిర్వçహించాలనే విషయమై పాలక మండలి, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మామిడి సీజన్లో రోజుకు సుమారు 400 నుంచి 600 లారీలు వస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడడంతో గత సంవత్సరమే కోహెడలో నిర్వహించాలనుకున్నా అది కుదరలేదు. ఈసారి కూడా సాధ్యం కాకపోవచ్చనే తెలుస్తోంది. తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్న సమయం లేకపోవడంతో ఈసారి ఇక్కడే మామిడి సీజన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి సీజన్ వచ్చే నెల నుంచే ప్రారంభం కానుండటంతో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ దఫా మామిడి సీజన్‌ను గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లోనే నిర్వహించాలనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చైర్మన్ వీరమల్ల రాంనర్సింహ గౌడ్ అన్నారు. ఈ విషయంపై వారం రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. -
పండంటి ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత ఏప్రిల్ నెల ఆదాయం రూ.1.20 కోట్ల దాటింది. గ్రేటర్ పరిధిలోని అన్ని మార్కెట్లతో పోలిస్తే ఈ మార్కెట్ సొసైటీ ఆదాయంలో దూసుకుపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.8.62 కోట్ల ఆదాయం రాగా.. గత ఆర్థిక సంవత్సరం 2018–19లో రూ. 9.83 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం 2019– 2020 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్కెట్ ఆదాయం వృద్ధి చెందినా అనుకున్న స్థాయిలో, కేంద్ర కార్యాలయం నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేయలేదు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 2,92,319 క్వింటాళ్ల మామిడి దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ నెలరోజుల ముందుగానే ప్రారంభమైంది. జనవరి 9 నుంచే మార్కెట్‌కు మామిడి రాక ప్రారంభమైంది. గత ఏడాది 1,59,549 క్వింటాళ్ల మామిడి దిగుమతులు జరిగాయి. ఈ ఏడాది శనివారం నాటికి 2,92,319 క్వింటాళ్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. శనివారం ఒక్కరోజే 14,314 క్వింటాళ్ల మామిడి పండ్లు మార్కెట్‌కు వచ్చాయి. ఆదాయం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు మార్కెట్ ఆదాయాన్ని పెంచడానకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. రాత్రింభవళ్లూ మార్కెట్ ఇన్‌గేట్, ఔట్ గేట్ వద్ద నిఘా పెంచాం.. మార్కెట్లో క్రయ విక్రయాలపై ఎప్పటికప్పుడు కార్యదర్శులు, సూపరవైజర్లు తనిఖీలు నిర్వహించి లావాదేవీల్లో పారదర్శకతతో మార్కెట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎగుమతి చేసే వాహనాల లోడ్ తూకాల క్రాస్ చెక్ చేస్తున్నాం. తూకాల్లో తేడా వస్తే మళ్లీ తూకాలు వేస్తున్నాం. ఆ తూకాల ఆధారంగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నాం. – వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి -
కావలిలో విజిలెన్స్ దాడులు
కావలిరూరల్: కావలిలో మంగళవారం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.శ్రీకంఠనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో విజిలెన్స్ డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం మూడు టీములుగా పట్టణంలోని రెండు పండ్ల దుకాణాలు, రుద్రకోటలోని రైస్ మిల్లుపై దాడిచేశారు. కాగా మండలంలోని రుద్రకోటలో ఉన్న శ్రీబాలాజి రైస్‌మిల్లుపై మంగళవారం తెల్లవారుజామున విజిలెన్స్ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా ఉన్న 3,500 ఖాళీ బియ్యం బస్తాలను, రేషన్ షాపుల నుంచి సేకరించినట్లు భావిస్తున్న 100 బియ్యం బస్తాలను గుర్తించారు. అలాగే కృష్ణపట్నం పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిఖీల విషయమై మిల్లు యజమాని నారపరెడ్డి నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దాడుల సమాచారం తెలుసుకుని పరారైనట్లుగా భావిస్తున్నారు. మామిడి పండ్ల దుకాణాలపై పట్టణంలోని మేదరవీధిలో ఉన్న అడుసుమల్లి జయరామయ్య పండ్ల దుకాణం, ఐదులాంతర్ల సెంటర్లో ఉన్న పసుపులేటి హరిప్రసాద్ పండ్ల దుకాణాలపై మంగళవారం ఉదయం విజిలెన్స్ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు ఉపయోగించే ఇథిలిన్ రిఫైనర్, క్రిపాన్, గ్రీన్ థ్రిల్ రసాయనాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి, మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు ఆంజనేయరెడ్డి, పి.వీరనారాయణ, విజిలెన్స్ సీఎస్‌డీటీ పద్మజ, డీసీటీఓ విష్ణు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎస్.రామచందర్, కె.సతీష్‌కుమార్, కావలి తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ ఎస్.విష్ణుకిరణ్, వీఆర్వోలు బాలకోటయ్య, రహంతుల్లా, నాగభూషణం పాల్గొన్నారు. -
మామిడి ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మార్చి 15న సాధారణ రకం మామిడి ధర టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షలు పలికింది.. అదే నెల 30న రూ. 65 వేలకు తగ్గిపోయింది.. ఏప్రిల్ 15న ధర రూ.50 వేలకు దిగజారింది. మే 1న(మంగళవారం) మామిడి ధర రూ.40 వేలకు పడిపోయింది. మామిడి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నాడు. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మామిడి ధర పడిపోవడంతో వినియోగదారులకు ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే అదీ లేదు. బహిరంగ మార్కెట్లో మాత్రం మామిడి ధరను రెండింతలు పెంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా అటు రైతును, ఇటు వినియోగదారులను దళారులు ఎడాపెడా దోచేస్తున్నారు. 30 శాతానికిపైగా పడిపోయిన ఉత్పత్తి రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల ఉత్పత్తి వస్తుంది. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఎకరానికి రెండు మూడు టన్నులకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రంలో సాధారణంగా 28 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నులలోపే ఉత్పత్తి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. మొత్తంగా 30 శాతం వరకు ఉత్పత్తి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి రైతుకు ఎక్కువ ధర రావాలి. కానీ రైతుకు దక్కాల్సిన సొమ్మును దళారులు సొంతం చేసుకుంటున్నారు. వినియోగదారులపై బాదుడే.. రైతుల నుంచి టన్నును రూ.40 వేలకు వ్యాపారులు కొంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో వినియోగదారుల నుంచి దీనికి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి రూ.40 వరకు ఉండాలి. కానీ మార్కెట్లో ఏకంగా రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ.150–200 వరకూ ఉన్నాయి. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తుంది. డిమాండ్ ఉన్నా సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్న పడిపోయాడు. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే మామిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. రూ. 41 వేలకే కొన్నారు రెండ్రోజుల కిందట నాలుగు టన్నుల మామిడి కాయలను తీసుకొచ్చాను. కానీ హైదరాబాద్‌లో దళారులు నాణ్యత సరిగా లేదనే సాకుతో టన్ను రూ. 41 వేలకే కొనుగోలు చేశారు. గత్యంతరం లేక దళారులకు నష్టాలకే మామిడి అమ్ముకున్నాను. – రాజశేఖర్, రైతు, సత్తుపల్లి -
మామిడి.. మహా ప్రియం..!
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు నోరూరిపోతుంది. తమకు ఇష్టమైన మామిడి రుచి చూసేందుకు ఉవ్విళ్లూరిపోతారు. ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్ మార్కెట్లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో బేనిషాన్ రకం ధర కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం.. పంట ఆలస్యం కావడంతో ఈ ఏడాది మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు చెపుతున్నారు. పుంజుకోని సీజన్..: గత ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే మామిడి సీజన్ ప్రారంభమై మార్చి మూడో వారానికి పుంజుకుంది. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి రోజూ దాదాపు 2.5 వేల టన్నుల మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు దిగుమతి అయింది. కానీ ఈ సీజన్లో రోజూ 25 టన్నులు కూడా దాటలేదు. గతంలో ప్రతి రోజు 2.5 వేల టన్నుల మామిడి వచ్చేది. ప్రస్తుతం అది 32 టన్నులకే పరిమితమైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు శుక్రవారం కేవలం 32 టన్నుల మామిడి దిగుమతి అయ్యింది. గతంలో మార్కెట్‌కు వందల సంఖ్యలో మామిడి లారీలు వచ్చేవి. అలాగే ఈ సీజన్లో ఇంకా మార్కెట్‌కు రకరకాల మామిడి పండ్లు రావడం లేదు. తగ్గిన దిగుబడి.. : గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సకాలంలో వర్షాలు పడకపోవడం.. భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో సరైన సమయంలో కాపు రాలేదని రైతులు, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మామిడి పూత కూడా ఆలస్యం కావడంతో పంట చేతికి రావటానికి ఇంకా 10–15 రోజులు పట్టే అవకాశం ఉంది. నగరానికి దిగుమతి.. ఎగుమతులు ఇవే.. బేనిషాన్, తోతాపూరి, సన్నరసాలు, పెద్ద రసాలు, హిమాయత్, చెరుకురసాలు, దసేరీ తదితర రకాల మామిడి పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్లో లభిస్తాయి. బంగినపల్లి, తోతాç పురి మాత్రం మార్కెట్‌కు రోజూ వేల టన్నులు వస్తాయి. చిన్నరసాలు, పెద్దరసాలు, దసేరీ, హిమాయత్ రోజుకు 3 నుంచి 4 టన్నుల వరకు వస్తాయి. గడ్డి అన్నారం మార్కెట్‌కు కృష్ణా జిల్లా నూజివీడు, విజయవాడ, గుడివాడ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, సూర్యాపేట్తో పాటు నగర పరిసరాల నుంచి రోజుకు వేల టన్నుల మామిడి దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. పూత ఆలస్యం వల్లే సీజన్ లేట్ రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మామిడి సీజన్ నెలా పదిహేను రోజులు ఆలస్యమైంది. దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్చి చివరి నుంచి దిగుమతి పెరగనుంది. మార్కెట్లో కార్బైడ్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి -
మామిడి పండు.. దళారీ దండు
మార్కెట్ మాయాజాలంతో మామిడి రైతు కుదేలు పండ్ల ధరలు ఒక్కసారిగా పతనం.. పక్షం రోజుల్లో తారుమారైన పరిస్థితి బంగినపల్లి రకం ధర క్వింటాలుకు రూ. వెయ్యే.. తోతాపురి రూ. 6 వందలే.. మార్చిలో రూ. 25 వేల నుంచి 32 వేలు పలికిన క్వింటాలు ధర 11 శాతం కమీషన్ వసూలు చేస్తూ రైతుల్ని టోకుగా ముంచేస్తున్న దళారులు రైతు నుంచి తక్కువ ధరకు కొని నాలుగు రెట్లకు అమ్ముతున్న వ్యాపారులు పంటను వెనక్కి తీసుకెళ్లలేక తెగనమ్ముకుంటున్న రైతులు చిలుకూరి అయ్యప్ప, సాక్షి ప్రతినిధి: ఫలాల్లో రారాజు మామిడి..! మరి ఆ ‘రారాజు’ను పండించే రైతన్న..? దిగుబడి వచ్చినా ధర లేక, మార్కెట్ మాయాజాలపు చదరంగంలో ఓడిపోయి ‘పేద’గా మిగిలిపోతున్నాడు! తియ్యని పండ్లను మార్కెట్లకు తెచ్చి ‘చేదు’నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాట పడుతున్నాడు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, దళారులు మాత్రం బయట మార్కెట్లో నాలుగు రెట్లకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. గతేడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం మామిడి దిగుబడి మునుపటి కంటే భారీగా పెరిగింది. దీంతో ఆదాయం రెట్టింపు అవుతుందని భావించిన మామిడి రైతులకు దళారీ మార్కెట్ షాకిచ్చింది. సీజన్ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. దిగుబడులు పెరుగుతున్న కీలక తరుణంలో ఒక్కసారిగా తగ్గించేశారు. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో మార్చి నెల రెండో వారంలో బంగినపల్లి రకం మామిడి క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.1,500 మించి చెల్లించడం లేదు. గతనెలలో తోతాపురి రకం మామిడి రూ.2 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.600 నుంచి నుంచి రూ.900 మధ్య చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మామిడి పంట 4.71 లక్షల ఎకరాల్లో ఉన్నట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సగటున 21.19 లక్షల టన్నుల దిగుబడులు రావాల్సి ఉన్నా.. వడగళ్ల దెబ్బతో 14.13 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. గతేడాది ఈ దిగుబడులు 10 లక్షల టన్నుల లోపే ఉన్నాయి. మార్కెట్ మాయాజాలమిదీ.. రాష్ట్రంలో మెజారిటీ రైతులు కొత్తపేటలోని గడ్డి అన్నారం పళ్ల మార్కెట్లోనే దిగుబడులు విక్రయిస్తారు. వరంగల్, జగిత్యాలలోని చిన్న మార్కెట్లలో కొనుగోలు చేసిన దిగుబడులు సైతం కొత్తపేట్ మార్కెట్‌కు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. సమయం గడిస్తే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పంటను ప్రత్యామ్నాయంగా విక్రయించే అవకాశాలు లేకపోవడంతో కొత్తపేట మార్కెట్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ మార్కెట్‌కు డిమాండ్ విపరీతంగా ఉండడంతో దళారులు.. కొనుగోలు, అమ్మకాలను శాసిస్తున్నారు. దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించడం ఒకటైతే... 11 శాతం కమీషన్ రూపంలో వసూలు చేయడంతో రైతు టోకుగా మోసపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ నిబంధనల మేరకు 4 శాతానికి మించి కమీషన్ వసూలు చేయకూడదు. రైతును గుల్ల చేస్తున్న వేలం మార్కెట్‌కు వచ్చిన మామిడి దిగుబడులకు దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారం మార్కెట్లో 97 స్టాళ్లు ఉండగా.. వీటి పరిధిలో 267 మంది కమీషన్ ఏజెంట్లున్నారు. వీరి వద్దకు వచ్చిన దిగుబడులకు ధరను వేలం ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారు సైతం కమీషన్ ఏజెంట్ల మనుషులే కావడంతో ధరల పెంపు, తగ్గింపు అంతా వారి నిర్ణయం మేరకే జరుగుతోంది. ఇక్కడ దిగుబడి తెచ్చిన రైతు కేవలం ప్రేక్షకుడిగానే ఉండాలి. ఈ ప్రక్రియతో అత్యుత్తమ రకం మామిడి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మార్కెట్ పూర్తిగా దళారులమయమైంది. గడ్డి అన్నారం మార్కెట్లో 60 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నా.. ఒక్క రైతుకూ నిల్వ చేసుకునే అవకాశం దక్కడం లేదు. కొనేది రూ.15... అమ్మేది రూ.60 రైతు నుంచి తక్కువ ధరలో మామిడి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు... బహిరంగ మార్కెట్లో నాలుగింతలు పెంచేసి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి టోకుగా కోనుగోలు చేస్తున్న బంగినపల్లి మామిడికి కిలోకు రూ.10–15 చెల్లించి.. అవి మక్కిన తర్వాత రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అలాగే తోతాపురి రకం మామిడిని కిలోకు రూ.6 నుంచి రూ.9కి కొంటున్న వ్యాపారులు.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.35 దాకా విక్రయిస్తున్నారు. ఈయన పేరు సత్తన్న. వనపర్తికి చెందిన ఈ రైతు గతేడాది రూ.2.5 లక్షలు పెట్టి 8 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే వచ్చింది. పళ్లను హైదరాబాద్‌లోని కొత్తపేట మార్కెట్‌కు తెచ్చాడు. ఇప్పటిదాకా మూడు దఫాలుగా 8 టన్నుల మామిడి పళ్లను విక్రయించగా రూ. 1.5 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో2 టన్నుల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా లెక్కేసుకుంటే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో శనివారం ఉదయం మార్కెట్లో ఇలా తల పట్టుకుని కూర్చున్నాడు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం ‘‘మార్కెట్లో కమిషన్ 4% మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నాం. లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే.. ఆ కమిషన్ ఏజెంటు లైసెన్సు రద్దు చేసే అధికారం మాకుంది. కానీ ఇప్పటివరకు ఫిర్యాదులేవీ రాలేదు. ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు ఇస్తున్నాం. త్వరలో మార్కెట్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తాం..’’ – పుట్టం పురుషోత్తం రావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూలీ కూడా దక్కలేదు ‘‘రూ.3.5 లక్షలు పెట్టి ఐదెకరాలు కౌలుకు మామిడి వేసిన. మార్కెట్‌కు ఈ రోజు 16 క్వింటాళ్ల మామిడి తీసుకొచ్చిన. వాటిని కొన్న వ్యాపారులు రూ.5 వేలు చేతిలో పెట్టారు. పొలం నుంచి మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు బండి కిరాయికి రూ.4,500 ఖర్చయింది. కాయ తెంపేందుకు 10 మంది కూలీలకు రూ.3 వేలు చెల్లించిన. ఇప్పుడు మార్కెట్లో రూ.5 వేలు వచ్చినయి. మరి నాకెంత లాభం వచ్చిందో చెప్పండి..’’ – రంగస్వామి, మామిడి రైతు, పెబ్బేరు -
‘కార్బైడ్’పై కయ్యం
- సమస్యలు పరిష్కరించాలంటూ వ్యాపారుల మెరుపు సమ్మె - గడ్డిఅన్నారం మార్కెట్లో ఆగిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు - అవస్థలు పడిన రైతులు - చైర్మన్ హామీతో సద్దుమణిగిన వ్యాపారుల ఆందోళన హైదరాబాద్: కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తమ సమస్యల పరిష్కారానికి రైతు మెడపై కత్తిపెట్టి మెరుపు సమ్మెకు దిగారు. మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపివేసి పాలకవర్గం, అధికారులతో బేరసారాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపిపేయడంతో వివిధ జిల్లాల నుంచి తమ పంటను తెచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే మద్దతు ధరరాక నష్టాల పాలవుతున్నామని.. సమ్మెతో తమ బతుకులు మరింత అన్యాయమవుతాయని మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఒక వైపు రైతులు, మరోవైపు వ్యాపారుల ఆందోళనలతో సోమవారం మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమాచారం తెలుసుకుని వచ్చిన మార్కెట్ చైర్మన్ పుటం పురుషోత్తంరావు వ్యాపారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం కానరాలేదు. దీంతో సుమారు 604 వాహనాల్లో మామిడి(3వేల టన్నుల మామిడి), 270 లోడుల బత్తాయి (400 టన్నులు) కొనుగోళ్లు ఆగాయి. వ్యాపారులపై చర్య తీసుకోవాలి: మంత్రి జూపల్లి కొనుగోళ్లు ఆపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతులు కొందరు విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకురాగా హుటాహుటిన గడ్డిఅన్నారం మార్కెట్‌కు చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోళ్లు నిలిచిపోవడానికి దారి తీసిన పరిస్థితిపై మార్కెట్ ఎస్జీఎస్ ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు సమ్మె చేయడాన్ని తప్పుపట్టారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని, అవసరమైతే రైతుల నష్టాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. రైతులు నష్ట పోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార సంఘ నాయకులతో అధికారుల సమావేశం వ్యాపార సంఘం నాయకులతో పురుషోత్తంరావు, మార్కెటింగ్, పోలీస్ అధికారులు చర్చించారు. కార్బైడ్ నిషేధించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో తాము నష్టపోతున్నామని, గతంలో రద్దుచేసిన లైసెన్సులను పునరుద్ధరించాలని, అద్దె బకాయిపై న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతి నిధులు తాజుద్దీన్, అశోక్‌లు డిమాండ్ చేశారు. సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించటం లేదని అందుకే మెరుపు సమ్మె చేయడం జరిగిందన్నారు. నెలరోజుల్లోగా తమ పరిధిలో ఉన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్ జేడీ రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ మలిపెద్ది వెంకట్రామ్రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే తీవ్రంగా నష్టపోతాం ఏడాదంతా శ్రమకోర్చి పండించిన పంటను 100 కిలోమీటర్లు రవాణా చేసి తీసుకొస్తే వ్యాపారులు కొనకపోతే తీవ్రంగా నష్టపోతాం. ఎండ వేడికి లారీల్లోని మామిడి పాడైపోయి మరింత నష్టపోతాం. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పైలా యాదిరెడ్డి, రైతు, ఒలిగొండ, యాదగిరిగుట్ట జిల్లా వ్యాపారుల తీరు అన్యాయం అప్పులు చేసి వడ్డీలు కట్టి పంట పండిస్తే మార్కెట్లోకి వచ్చిన తరువాత వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. గత సంవత్సరం మామిడి కిలో 50 నుంచి 70 ధర పలకగా ఈఏడాది 25 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. – సుగూర్ శాంతన్, రైతు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌జిల్లా -
కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్
178 ఎకరాల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేస్తాం: హరీశ్ ⇒ త్వరలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల: తలసాని ⇒ ఈ ఏడాది సిద్దిపేటలో మెడికల్ కాలేజీ: లక్ష్మారెడ్డి ⇒ పాల కల్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీనివాస్‌గౌడ్, సోలిపేట సాక్షి, హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలించాలని నిర్ణయిం చినట్లు మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకు కోహెడలో 178.09 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించామని, అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కేవలం 22 ఎకరాల్లోనే ఉందని, దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో సరైన సదుపాయాల్లేక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే నగరం మధ్యలో ఉండటం వల్ల మార్కెట్‌కు వాహనాల రద్దీ పెరిగినప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న కోహెడకు మార్కెట్‌ను తరలిస్తున్నామన్నారు. అక్కడ భూములు కోల్పోయే వారికి ఒక్కొక్కరికి రూ.7.40 లక్షల చొప్పున రూ.9.38 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికే చెల్లించామన్నారు. అక్కడ మార్కెట్ ఏర్పాటుపై రాష్ట్ర అధికారులు ముంబై, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారని, ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నారని, ఆ తర్వాతే అవసర మయ్యే నిధులపై స్పష్టత వస్తుందన్నారు. పాల కల్తీపై అధికార పార్టీ సభ్యుల ఫైర్ పాల కల్తీ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అధికార పార్టీ సభ్యులే ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదటగా ఈ అంశాన్ని శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తుతూ... హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంటే కేవలం 5 లక్షల లీటర్ల ఉత్పత్తే ఉందని, ఇదే అదనుగా చిక్కదనం కోసం పాలల్లో యూరియా కలుపుతూ ప్రైవేటు సంస్థలు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పశువులకు ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్లు ఇస్తున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని సూచించారు. దీన్నుంచి బయట పడేయాలంటే నగరంలో విజయ డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. పర్యాటకప్రాంతాలు, జాతీయ రహదారుల్లో విజయ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కల్తీపై మాత్రం స్పందించలేదు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ మరోసారి మాట్లాడుతూ.. ‘‘50 శాతం పాలల్లో కల్తీ ఉంది. దీని నిరోధానికి చట్టం తేవాలి. కల్తీకి పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. హెరిటేజ్ వంటి సంస్థలు కోట్లు సంపాదిస్తుంటే విజయ డెయిరీ మాత్రం నష్టాల్లో ఉండటం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ... పాల కల్తీ నిజమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ వంటి సంస్థలు విజయ డెయిరీ ఉత్పత్తులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. మరో సభ్యుడు చెన్నమనేని రమేశ్ సైతం.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెండేళ్లలో లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగిందంటే తాను నమ్మనని అన్నారు. ఒకేసారి అధికార సభ్యులంతా దాడి చేయడంతో తలసాని కొద్దిగా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. పశు సంచార వైద్యశాలలకు 28 కోట్లు: తలసాని రాష్ట్రంలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ బడ్జెట్లో ఇందుకు రూ.28.45 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆరూర్ రమేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. ఎల్లారెడ్డి వంటి నియోజకవర్గాల్లో పశుసంపద ఎక్కువగా ఉన్న దృష్ట్యా, అక్కడ అవసరమైన డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కాగా.. ఈ ఏడాది సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 700 మెడికల్ సీట్లు, 221 పీజీ కోర్సుల్లో సీట్లు పెరిగాయన్నారు.