సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో కొత్తపేట్ పండ్ల మార్కెట్ శుక్రవారం పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. కమీషన్ ఏజెంట్లకు ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం అందించారు. షాపుల్లో, షెడ్లల్లో ఉన్న సామగ్రి తీసుకెళ్లాలని నోటీసులు పెట్టారు.
కొత్తపేట్ నుంచి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో బాటసింగారానికి తరలించారు. అక్కడ పండ్ల దిగుమతులు పెరగడంతో వ్యాపారులు, హమాలీలతో మార్కెట్ కళకళలాడుతోంది. గతంతో పోలిస్తే బాటసింగారంలో క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ అధికారులు కూడా పెరిగిన పండ్ల దిగుమతులతో రైతులకు, వ్యాపారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు చేసినట్లు కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి తెలిపారు. (చదవండి: సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment