సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో నల్గొండ బత్తాయి రైతులకు ఊరట కలిగింది. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఢిల్లీ అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌ను అధికారులు తిరిగి తెరిపించారు. బత్తాయి రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి.. ఇకపై 24 గంటలు అజాద్‌పూర్ మండి తెరచి ఉండేలా చర్యలు చేపట్టారు. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల కూరగాయల మార్కెట్‌గా పేరొందిన అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌కు తెలంగాణ నుంచి ప్రతి ఏడాది 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి పండ్లు తరలిస్తారు. లాక్‌డౌన్ కారణంగా బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మార్కెట్‌ను తెరిపించే విధంగా చొరవ తీసుకున్నారు. బత్తాయి రైతుల కోసం నేటి నుంచి మార్కెట్ తెరిచి ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment