Orange farmers
-
Nalgonda Mosambi: కలిసొచ్చిన ‘కత్తెర’.. రైతుల్లో ఆనందం!
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బత్తాయి రైతులకు ఈ సారి కాలం కలిసొచ్చింది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారికి విటమిన్–సీ అత్యంత అవసరమని డాక్టర్లు పదేపదే చెబుతున్న వేళ బత్తాయికి డిమాండ్ పెరిగింది. కోవిడ్ విజృంభణతో అల్లకల్లోలంగా మారిన ఢిల్లీలో నల్లగొండ బత్తాయికి గిరాకీ పెరిగింది. అక్కడ బత్తాయికి రిటైల్‌లో కిలో కనీసం రూ.200 ధర ఉండటంతో వ్యాపారులంతా ఇక్కడి బత్తాయి తోటలపై వాలిపోయారు. కాయ సైజుతో సంబంధం లేకుండా.. చెట్టు మీద ఎంత పంట ఉంటే అంత కొనుగోలు చేస్తున్నారు. కత్తెర దిగుబడి తక్కువగా.. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కరోనా ఉన్న ప్రధాన నగరాల్లో బత్తాయికి ఎక్కువగా డిమాండ్ ఉంది. గత ఏడాది కరోనా సమయంలో సంపూర్ణ లాక్డౌన్ ఉండి.. రవాణా ఆంక్షలతో టన్ను ధర రూ.10 వేలకే అమ్ముకున్న రైతులకు ఈసారి మాత్రం పంట పండింది. గరిష్ట ధర.. టన్నుకు రూ.60 వేలు.. సాధారణంగానే కత్తెర పంట దిగుబడి తక్కువగా వస్తుంది.. దీంతో ధర అధికంగా ఉంటుంది. కానీ, ఈసారీ దిగుబడి తక్కువగా ఉండటం.. కరోనా డిమాండ్ కలిసివచ్చింది. దీంతో టన్ను బత్తాయి గరిష్టంగా రూ.60 వేల దాకా పలుకుతోంది. జిల్లా లో 42,558 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఇందులో 31,917 ఎకరాల నుంచి బత్తాయి దిగుబడి వస్తోంది. ఇక, కత్తెర పంట దిగుబడి 40వేల టన్నుల దాకా వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా. సాధారణ రోజుల్లో టన్నుకు రూ.39వేల దాకా ధర ఉంటుందని అధికారులు అంచనా వేయగా.. అనూహ్యంగా టన్నుకు రూ.40వేల నుంచి రూ.60వేలు పలుకుతోంది. జిల్లా నుంచి మొత్తంగా రూ.156 కోట్ల బత్తాయి టర్నోవర్ జరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తోట వద్దే రూ.52 వేలకు అమ్మిన.. దళారులు టన్నుకు రూ.52వేల చొప్పున ధర చెల్లించి తోట వద్దే కొన్నరు. 8 ఎకరాల్లో బత్తాయి సాగు ఉండగా.. 6 టన్నుల కాతవచ్చింది. పూర్తిస్థాయిలో పూత, పిందె రాలేదు. టన్ను రూ.60వేలు చెబితే చివరికి రూ.52వేలకు అమ్ముడుపోయింది. గత ఏడాది కత్తెర దిగుబడి 7 టన్నులు రాగా.. రూ.10వేలకైనా కొనుగోలు కాలేదు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులుపడ్డం. – ఇంద్రసేనారెడ్డి, ముషంపల్లి రూ.6 లక్షల ఆదాయం బత్తాయి ధరలో ఇప్పటివరకు నాదే రికార్డు. తోట వద్దే టన్ను రూ.56 వేలకు అమ్మిన. ఆరు ఎకరాల్లో 11 టన్నుల కత్తెర దిగుబడి రాగా.. రూ.6 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 20 టన్నుల వరకు సీజన్ పంట ఉంది. సాధారణంగా బత్తాయితోట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలవుతుంది. మా తోటలో మూడో ఏడాది నుంచే కత్తెర కాపు కాస్తోంది. మూడో ఏడాదే 11 టన్నులు కత్తెర కాపు కాయడం రికార్డే. – చింతరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆరెగూడెం, గుర్రంపోడు మండలం -
‘ఆయన క్వారంటైన్ ముఖ్యమంత్రి’
సాక్షి, నల్గొండ: బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు. (ఖైరతాబాద్ గణేష్‌పై కరోనా ఎఫెక్ట్..) ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు సంవత్సరాలు క్వారంటైన్లో ఉన్నారని, రైతులతో మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను క్వారంటైన్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. (ఒవైసీ సంచలన వ్యాఖ్యలు) కరోనాపై తప్పుడు లెక్కలు.. రైతుల సమస్యల పరిష్కారానికి రేపు(బుధవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా టెస్ట్‌ల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కలిసి వస్తే బీజేపీ సహకరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. -
బత్తాయి రైతులకు ఊరట..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో నల్గొండ బత్తాయి రైతులకు ఊరట కలిగింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన ఢిల్లీ అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌ను అధికారులు తిరిగి తెరిపించారు. బత్తాయి రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి.. ఇకపై 24 గంటలు అజాద్‌పూర్ మండి తెరచి ఉండేలా చర్యలు చేపట్టారు. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల కూరగాయల మార్కెట్‌గా పేరొందిన అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌కు తెలంగాణ నుంచి ప్రతి ఏడాది 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి పండ్లు తరలిస్తారు. లాక్డౌన్ కారణంగా బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మార్కెట్‌ను తెరిపించే విధంగా చొరవ తీసుకున్నారు. బత్తాయి రైతుల కోసం నేటి నుంచి మార్కెట్ తెరిచి ఉంటుందని ఆయన తెలిపారు. -
ఎండుతున్న ఆశలు
♦ చిత్తవుతున్న బత్తారుు రైతులు ♦ నీరులేక ఎండుతున్న వేల ఎకరాల పంట ♦ ఈ సీజన్లో 5 వేల ఎకరాల్లో చెట్ల నరికివేత ♦ వంట చెరకుగా వాడుతున్న వైనం ఒకప్పుడు సిరులు పంచిన బత్తారుు సాగు నేడు రైతుకు కన్నీరు మిగులుస్తోంది. వర్షాలు అరకొరగానే పడుతున్నాయి. పాతాళగంగ అదఃపాతాళానికి చేరింది. 900 అడుగుల బోరు వేసినా నీటి చెమ్మ తగలడం లేదు. నెలకు ఒక్క తడికి కూడా నోచుకోక వేల ఎకరాల్లో బత్తారుు చెట్లు నిలువునా ఎండిపోతున్నారుు. ఒక్క ఈ సీజన్లోనే 5 వేల ఎకరాల్లో చె ట్లను నరికేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. అర్ధవీడు: జిల్లాలో బత్తాయి తోటలకు గిద్దలూరు నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. నిత్యం 50 నుంచి 100 లారీల బత్తాయి కాయలు హైదరాబాద్, విజయవాడ, పూనా, నాగపూర్, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు తరలించేవారు. తోటలో పూతదశ వచ్చినపుడే రైతుకు వడ్డీ లేకుండా బత్తాయి వ్యాపారులు ఎకరాకు లక్ష దాకా అడ్వాన్సులిచ్చేవారు. ఎకరాకు రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా ఏడాదికి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. చెట్లను కాపాడుకోలేక చేతికి వచ్చిన చెట్లను నరికేస్తున్నారు. భూగర్భ జలం అడుగంటడంతో వేల ఎకరాలు ఎండిపోయూరుు. ఎండిన చెట్లను నరికి వంట చెరకుగా అమ్ముకుంటున్నారు. నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో 40 వేల ఎకరాల్లో బత్తారుు సాగు చేస్తున్నారు. నీరందక ఈ సీజన్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో చెట్లను కొట్టేశారు. బత్తాయి సాగు ఇలా ఎకరానికి 100 బత్తాయి మొక్కలు నాటి, ఐదేళ్లు సంరక్షించిన తర్వాత పంటకొస్తాయి. రైల్వే కోడూరు నుంచి నాణ్యమైన శ్రీరంగాపూర్ మొక్కలు తెప్పించి నాటుతారు. ఎకరాకు 4 నుంచి 8 టన్నుల దాకా కాపు వస్తుంది. సంవత్సరంలో రెండు సీజన్లుగా పంట చేతికొస్తుంది. ఏప్రిల్ నెల నుంచి వచ్చే కాపును చిత్తకాపు అంటారు. ఇటీవల టన్ను ధర రూ.42 వేలు పలికింది. జూలై నెలలో వచ్చే పంటను సీజన్ కాపు అంటారు. సీజన్ కాపు టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా ధర పలుకుతుంది. ఒకప్పుడు మోతుబరి రైతులుగా ఉన్న బత్తాయి రైతులు నేడు కూలి పనులకు వెళ్తున్నారు. చెట్లను కాపాడుకునేందుకు బోర్లు వేయడం, నీరు పడకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, కొమరోలు, రాచర్ల మండలాల్లో వేల ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. నేడు చెట్లన్నీ ఎండిపోవటంతో అక్కడక్కడా బత్తాయి తోటలు కొన్ని మాత్రమే మిగిలాయి. ఒక్కొక్క రైతు చెట్లను కాపాడుకొనేందుకు 600 నుంచి 900 అడుగుల లోతు వరకు బోర్లు వేశారు. అయినా చుక్క నీరు పడకపోవటంతో చెట్లను కాపాడుకోలేక అప్పులు కట్టలేక నేడు వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి: 2007-2008 సంవత్సరంలో వచ్చిన కరువుకు బత్తాయి తోటలు ఎండిపోయినపుడు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. అప్పుటి కడప జిల్లా కలెక్టర్ అజయ్‌జైన్ బత్తాయి రైతుల పరిస్థితి చూసి నష్ట పరిహారం అందేలా నివేదిక తయారు చేసి పంపడంతో స్పందించిన ప్రభుత్వం బత్తాయి రైతులకు నష్ట పరిహారం అందజేసింది. ఈ ఏడాది కూడా ఎండిపోయిన బత్తాయి రైతులకు పరిహారం అందించాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎండిన తోటలకు నష్ట పరిహారం అందించాలి 5 ఎకరాల బత్తాయి సాగు చేశాను. 10 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. ఐదేళ్లు సంరక్షించి, పంట దశ కొచ్చిన బత్తాయి తోట నిలువునా ఎండిపోయింది. పసిపిల్లలను సాకినట్లు కాపాడుకున్నా ఫలితం లేదు. మండలంలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్టపరిహారం అందించాలి. - వీరారెడ్డి, బత్తాయి రైతు బత్తాయి రైతులను ఆదుకోవాలి బత్తాయి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో తోటలపై లాభాలు ఆర్జించిన రైతులు నేడు అప్పులపాలయ్యారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్ట పరిహారం అందజేయాలి. - ఎస్.ఎం.బాషా