Union Health Department
-
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు. భయంతో వైద్యం ఎలా చేస్తారు?కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు? రోగుల సహాయకులను నియంత్రించాలిప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు. -
ఒక్కరోజులో 797 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్.1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్ కేసుల 4091కి చేరుకుంది. ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్.1 ఉప వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సారి్టయం(ఇన్సాకాగ్) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు. -
Covid-19: దేశవ్యాప్తంగా 63 కరోనా జేఎన్1 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉపవేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు ఈ రకం కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
అప్రమత్తత అవసరమే!
పీడకల లాంటి కోవిడ్–19 మానవాళిని ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది. మొదలై మూడేళ్ళు నిండినా, ఇప్పటికీ ఏదో ఒక కొత్త రూపంలో వేధిస్తూనే ఉంది. దేశంలో కొన్నాళ్ళు సద్దుమణిగిన కరోనా ఈ మార్చిలో క్రమంగా పడగవిప్పింది. కరోనా కేసులు గత అయిదు వారాల్లో ఏకంగా 9 రెట్లు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. డిసెంబర్ 22 తర్వాత సరిగ్గా మూడు నెలలకు బుధవారం మళ్ళీ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం దాని ఫలితమే. ఒక వంక కరోనా, మరో వంక ఇన్ఫ్లుయెంజా కేసులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో తక్షణ కార్యాచరణకు ప్రభుత్వం కదిలింది. కరోనా కేసుల ‘టెస్టింగ్ – ట్రాకింగ్ – చికిత్స – టీకాకరణ – కోవిడ్ సముచిత ప్రవర్తన’ అనే అయిదంచెల వ్యూహంపై దృష్టి కొనసాగించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ గురువారం సూచించింది. త్వరలో దేశమంతటా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికీ సమాయత్తమవుతోంది. వెరసి, దేశంలో ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత, టీకాకరణ వర్తమాన స్థితి లాంటి వాటిపై మరోసారి ఆలోచన, అంచనా మొదలైంది. ఫిబ్రవరి రెండోవారంలో రోజూ సగటున 108 కేసులొస్తే, ఇప్పుడది రోజుకు 966 కేసులకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో 1 శాతమే భారత్లోనివనీ, మొత్తంగా దేశంలో ఉన్నవి 7600 కరోనా కేసులే అనీ అధికారిక లెక్క. అయితే టెస్టింగ్ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కేసుల అసలు సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. ప్రస్తుతానికి మహా రాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎనిమిదింటిలో గరిష్ఠంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌లో జన్యుపరమైన వేరియేషన్లను గమనించడానికి 50కి పైగా ప్రయోగశాలలతో కూడిన గ్రూపు ‘ఇండియన్ సార్స్– కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్’ (ఇన్సాకాగ్) పనిచేస్తోంది. వీలైనంత ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ నమూనాలను ఈ ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపి, జన్యు నిర్మాణక్రమాన్ని విశ్లేషిస్తే ఏ కొత్త వేరియంట్ వచ్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. తక్షణ చర్యలు చేపట్టవచ్చు. అందుకే, ప్రభుత్వం సైతం ల్యాబ్‌ల ద్వారా వీలైనన్ని పాజిటివ్ శాంపిళ్ళను పరీక్షించి, జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మునుపటి కరోనా వేరియంట్లకు భిన్నంగా ఈసారి మూడు అదనపు కొమ్ములున్న ఉత్పరివర్తన మైన ఎస్బీబీ.1.16 (మరో మాటలో ‘ఆర్క్టూరస్’) వేరియంట్ తాజా కేసుల విజృంభణకు కారణ మని ప్రాథమిక విశ్లేషణ. దేశంలో తొలిసారిగా జనవరిలో బయటపడ్డ ఈ వేరియంట్ కేసుల సంఖ్య ఏ నెలకానెల పెరుగుతూ వస్తుండడం గమనార్హం. ఈ వేరియంట్ తీవ్రత, వ్యాప్తి ఎంత అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది. కేసులు పెరుగుతున్నా, ఆస్పత్రి పాలవడం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి ఎక్కువగా లేవు. అది పెద్ద ఊరట. నిజానికి, ఇప్పటి వరకు దేశంలో మొత్తం 220.65 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు. ఇది పెద్ద సంఖ్యే. వ్యాధినిరోధకత సాధించిన మన ప్రజానీకం ఇప్పటికే బీఎ.2.75, బీఎ.5, బీక్యూస్, ఎక్స్‌బీబీ.1.5 లాంటి పలు కరోనా వేరియంట్లను తట్టుకొని నిలబడింది. కొత్త వేరియంట్‌ను కూడా తట్టుకొంటే, మంచిదే. అలా కాకుంటేనే చిక్కు. కరోనా, ఫ్లూ, సీజనల్ వ్యాధులు సహా కారణాలేమైనా తీవ్ర శ్వాసకోశ సమస్యలు అనేకం ప్రస్తుతం నమోదవుతూ ఉండడం ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుత ఫ్లూ సీజన్లో దేశంలో శరవేగంగా వ్యాపిస్తూ, శ్వాసకోశ సమస్యలు కల్పిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ సైతం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్నదే. ‘ఇన్ఫ్లుయెంజా–ఏ’లో ఉపవర్గానికి చెందిన ఈ వైరస్ కూడా కరోనా వైరస్‌లా మహమ్మారిగా విజృంభించి, 1968లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 40 లక్షల మరణాలకు కారణమైంది. మన దేశంలో 2010లో బయటపడ్డ ఈ రకం వైరస్‌కు ఒకసారి గురైతే జీవితకాల వ్యాధినిరోధకత వస్తుందట. అయితే కరోనా, దీర్ఘకాలం గొంతునొప్పి, దగ్గుతో వేధించే ఇన్ఫ్లుయెంజా – రెండూ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలతో రూపం మార్చుకొనే ఆర్ఎన్ఏ వైరస్‌లే. అందుకే, ఇన్ఫ్లుయెంజా సైతం కరోనాలా ఒకరి నుంచి మరొకరికి మహమ్మారిలా విస్తరించే ముప్పుంది. దేశంలో ఏ,బీ రకాల ఇన్ఫ్లుయెంజాలు రెండూ ఉన్నందున తాత్కాలికంగా హడావిడి చేసి, సమస్యను అదుపు చేశామనడం కాక ప్రభుత్వ పక్షాన సమగ్ర ఆరోగ్య ప్రణాళికా రచన తప్పనిసరి. రకరకాల మహమ్మారుల నివారణ, ఎదుర్కొనే సంసిద్ధత, కార్యాచరణలకు సంబంధించి ‘మహమ్మారి నివారణ ఒప్పందం’ చేసుకోవాలని విశ్వవేదికపై వివిధ దేశాలు, సంస్థలు ఇప్పటికే చర్చిస్తున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా వర్ధమాన దేశాలైన ‘గ్లోబల్ సౌత్’కు ప్రతినిధిగా, జీ20 దేశాలకు ప్రస్తుత సారథిగా భారత్ ఇందులో చురుకైన పాత్ర పోషించాలి. అందరికీ ఫలాలు సమంగా అందేలా చూడాలి. కరోనా, ఫ్లూ కేసులు వేలల్లో నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు, ప్రజలూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సుదీర్ఘంగా వేధిస్తున్న వ్యాధులతో విసుగొచ్చి, ముందు జాగ్రత్తలు పాటించకుంటే మనకే నష్టం. ఈ వ్యాధికారక వాతావరణంతోనూ సహజీవనం చేయడం నేర్చుకోవాలి. సభలు, సమావేశాలు, సినిమాలు, షికార్లు, ప్రయాణాలు – ఇలా జన సమ్మర్దం ఉండే ప్రతిచోటా స్వచ్ఛందంగా మాస్కు ధారణ, భౌతికదూరం తప్పనిసరి చేసుకోవాలి. వీటితో పాటు తరచూ చేతుల పరిశుభ్రతను ఒక అలవాటుగా చేసుకోవాలని నిపుణుల సూచన. ఈ కనీస జాగ్రత్తలతో కరోనాతో సహా అన్ని రకాల వైరల్, ఫ్లూ దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మహమ్మారుల కథ ఇంకా ముగిసిపోలేదు. మన జాగ్రత్తలే మనకు రక్ష. -
దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది. మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. -
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్ కితాబిచ్చారు. ఎక్కువమంది విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడానికి కూడా కృషి జరుగుతోందని చెప్పారు. మూడ్రోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆమె సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన రాష్ట్ర పర్యటనలో భాగంగా.. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు. 64 రకాల పరీక్షలను, 350 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను కూడా పరిశీలించినట్లు భారతీ ప్రవీణ్పవార్ చెప్పారు. ఆ కాలేజీకి 150 సీట్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేయాలని సూచించానన్నారు. ఇక ‘స్పందన’ కార్యక్రమంలోనూ తాను పాల్గొన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. కొంతమంది రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఐదు కేజీల కంటే తక్కువ బియ్యం పంపిణీ జరుగుతున్న విషయం తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. మచిలీపట్నంలో 8,912 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. అయితే, ఆ ప్రాంతానికి ప్రభుత్వం రోడ్లు, మంచినీరు, కరెంట్ వసతి కలి్పంచాల్సి ఉందని, డిసెంబరు నాటికి ఆయా పనులు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారన్నారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేంద్రం దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమయంలో.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుచేస్తున్న విషయాన్ని మీడియా గుర్తుచేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండదు కదా అని కేంద్రమంత్రి బదులివ్వగా.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని విలేకరులు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది కదా అని కేంద్రమంత్రి వివరించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ గురించి తెలీదు ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుచేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం గురించి తనకు పూర్తిగా అవగాహనలేదని.. వైద్య సేవలకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి చాలా కార్యక్రమాలు అమలుచేస్తోందని, అవి సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న దానిపై తాను ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారతీ ప్రవీణ్పవార్ చెప్పారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో అమలయ్యే పథకాలలో కేంద్రానికి కూడా రాష్ట్రాలు తగిన గుర్తింపునివ్వాలని, ప్రధాని మోదీ ఫొటోను ఉంచాలని ఆమె ఆకాంక్షించారు. -
తొలిరోజు 41 లక్షల మంది టీనేజర్లకు టీకా
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల గ్రూపు వారికి సోమవారం ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 15–18 ఏళ్ల వారి కోసం జనవరి ఒకటో తేదీ నుంచి కోవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. ‘మహమ్మారి నుంచి యువతరాన్ని కాపాడేందుకు దేశం ఒక అడుగు ముందుకు వేసింది’అని ప్రధాని మోదీ అన్నారు. ‘టీకా వేయించుకున్న బాలలందరికీ, వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింతమంది టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నాను’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. -
541 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 8,318 కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసులు 3,45,63,749కు చేరుకున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసులు 3,114 తగ్గడంతో మొత్తం యాక్టివ్ కేసులు 541 రోజుల తర్వాత అత్యల్పంగా 1,07,019గా నమోదైనట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 465 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 4,67,933కు పెరిగాయని తెలిపింది. రికవరీ రేటు 98.34%గా ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు 121.06 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు వేసినట్లు తెలిపింది. -
భారత్‌లో మరో 30వేల కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 431 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,47,325కు పెరిగింది. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,43,928కు చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,923కు తగ్గింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.64 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా దేశంలో 3,25,60,474 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.33 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మరో 15,79,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా 54,77,01,729 కరోనా టెస్ట్‌లు పూర్తిచేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.94 శాతంగా నమోదైంది. గత 17 రోజులుగా ఈ రేటు మూడు శాతం కంటే తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. వారపు పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. -
ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్ విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనపడుతున్న మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇప్పుడు దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బారినపడిన వారిని ఇప్పటికే గుర్తించారు. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో దీనిని అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించాయి. ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్– 1897 ప్రకారం దీనిని రాష్ట్రంలో గుర్తించదగిన వ్యాధిగా (నోటిఫైయబుల్ డిసీజ్) వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని, మరణాలను పెంచుతోందని తెలిపింది. ‘మ్యూకోర్మైకోసిస్ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్టెరాయిడ్లు ఉపయోగించిన, మధుమేహం నియంత్రణలో లేని కోవిడ్–19 రోగుల్లో ఇది ప్రధానంగా కనిపిస్తోంది‘ ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాక బ్లాక్ ఫంగస్ కేసులను నిర్ధారించిన వెంటనే ఆరోగ్యశాఖకు తప్పనిసరిగా రిపోర్ట్ చేసేలా అన్ని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు సూచించారు. వీటితోపాటు బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించేందుకు, చికిత్స చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ గతంలో విడుదల చేసిన గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి బలహీనపడితేనే ముప్పు మ్యూకోర్మైసెట్స్గా పిలిచే శీలింధ్రాల (ఫంగస్) కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ ఫంగస్ సాధారణంగానే ఉండేదే. మట్టిలో, కుళ్లిపోతున్న ఆకుల్లో, పేడకుప్పల్లో, కుళ్లుతున్న జీవవ్యర్థాల్లో ఇది ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో మన రోగనిరోధక శక్తి దీన్ని సమర్థంగా అడ్డుకుంటుంది. అయితే కరోనా సోకిన వారిలో డెక్సామెథాసోన్ లాంటి స్టెరాయిడ్లు వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే షుగర్ నియంత్రణలో లేని వారిలో, సుదీర్ఘకాలం ఐసీయూలో ఉన్న కోవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఐసీయూలో వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించినపుడు తేమ కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది. నొసటి భాగంలో, ముక్కు, దవడ, కళ్ల భాగంలో ఫంగస్ పేరకుపోయి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కళ్లకు, ఊపిరితిత్తులకు... కొన్నిసార్లు మెదడుకు కూడా ఇది పాకుతుంది. వ్యాధి ముదిరితే ముక్కు పైభాగంలో నల్లబారడం, చూపు మసకబారడం, లేదా రెండుగా కనపడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినపుడు రక్తం పడటం జరుగుతుంది. కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు దేశంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ప్రభావం సైతం పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మందిలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించగా అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. బ్లాక్ ఫంగస్ నియంత్రణ అనేది ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాతాంశమని, అందువల్ల చికిత్సలో ఉయోగించే ఔషధాలను సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేగాక బ్లాక్ ఫంగస్‌ను గుర్తించిన 1,500 మందిలో సుమారు 500 మంది కోలుకున్నారని, సుమారు 850 మందికి చికిత్స కొనసాగుతోందని రాజేష్ తోపే పేర్కొన్నారు. ► రాజస్తాన్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్‌లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్‌లో 100 కేసులు నమోదయ్యాయి. 30 కేసులు బికనేర్ నుంచి, మిగిలినవి అజ్మీర్, కోటా, ఉదయపూర్ నుండి రావడంతో బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ► ఢిల్లీ: దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య 300 దాటింది. చికిత్సకు వాడే ఆంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లకు తీవ్రకొరతను ఎదుర్కొంటోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో గత ఒక్కవారంలోనే 75–80మంది రోగులు చేరారు. వీరిలో 30 మంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ► మధ్యప్రదేశ్: గత 27 రోజుల్లోనే 239 మంది బ్లాక్ ఫంగస్ రోగులు భోపాల్‌కు చేరుకున్నారు. చికిత్స సమయంలో 10 మంది రోగులు మరణించగా, 174 మంది ఆసుపత్రులలో చేరారు. వీరిలో 129 మంది రోగులకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, ప్రభుత్వం భోపాల్‌లో 68 మంది రోగులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 585 మంది రోగులను గుర్తించారు. ► హరియాణా: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ రోగులు 316 మంది ఉన్నారు. దీనిని అంటువ్యాధుల చట్టం కింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించిన మొదటి రాష్ట్రం హరియాణా. ► ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ రోగుల సంఖ్య 100కి చేరుకుంది. ఆస్పత్రుల్లో 92 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లో అత్యధికంగా 69 మంది రోగులు ఉండగా, 19 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. వెలుగులోకి వైట్ ఫంగస్ బిహార్ రాజధాని పట్నాలో ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైన వైట్ ఫంగస్ సంక్రమించిన నలుగురు రోగులను బిహార్‌లో గుర్తించారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోర్లు, నోటి లోపలి భాగాలు, కడుపు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు సోకుతుంది. వ్యాధి సోకిన నలుగురిలో కోవిడ్ రోగుల లక్షణాలే కనపడినా పరీక్షల్లో అది వైట్ ఫంగస్‌గా తేలిందని (వీరికి కరోనా లేదు) పాట్నా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ వెల్లడించారు. ఫంగస్ నిరోధక మందులు వాడితే వీరు కోలుకున్నారని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారికి దీనివల్ల ముప్పు ఎక్కువని వెల్లడించారు. ఆంఫోటెరిసిన్–బి ఉత్పత్తికి అనుమతులివ్వండి: ఐఎంఏ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్– బి ఇంజెక్షన్ల ఉత్పత్తికి అర్హత కలిగిన ఫార్మా సంస్థలను అనుమతించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని మోదీని కోరింది. ఈ ఔషధానికి తీవ్ర కొరత ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక అమెరికా కంపెనీకి ‘ఆంఫోటెరిసిన్–బి’ని దిగుమతి చేసుకొనే లైసెన్స్ ఉందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పలు ఫార్మా కంపెనీలకు ఆంఫోటెరిసిన్– బి ఉత్పత్తికి అనుమతులిచ్చి తర్వాత ఉపసంహరించుకుందని, ఇప్పుడు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఫార్మా కంపెనీలకు తాత్కాలిక అనుమతులిచ్చేలా డీజీసీఐకి సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. ప్రాణం పోయిన అనంతరం చితిపైకి చేరేందుకు సైతం పార్థ్ధివ దేహాలతో కుటుంబసభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి..ఇవీ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు..! కరోనా మహమ్మారి సంక్రమణలో దేశం రోజుకో రికార్డును బద్దలుకొడుతోంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన సమయంలో మన దేశంలోని భారీ జనాభా దృష్ట్యా పరిస్థితులు చేజారవచ్చని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, లాక్డౌన్ లాంటి కఠిన చర్యలతో పరిస్థితులు ఎలాగోలా అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ ఏడాది సెకండ్ వేవ్ మాత్రం దేశంలో భారీ విస్పోటనం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్ తిరగరాస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా 3,14,835 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచదేశాల్లో కేవలం ఒక్క రోజులోనే నమోదైన కేసులలో ఇదే అత్యధికం. అంతకుముందు ఈ ఏడాది జనవరి 8న అమెరికాలో అత్యధికంగా 24 గంటల్లో 3.07లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి 10 రాష్ట్రాల్లోనే 75.66% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు 1,59,30,965కు చేరాయి. 1.33 లక్షలు పెరిగిన యాక్టివ్ కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ గణనీయ మార్పు వచ్చింది. గత 24 గంటల్లోనే 1.33 లక్షల యాక్టివ్ కేసులు పెరిగి ఆ సంఖ్య 22,91,428కి చేరుకుంది. అదే çసమయంలో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,104తో మొత్తం 1,84,657కు చేరింది. మరణాల రేటు ప్రస్తుతం 1.16% వద్ద నిలకడగా ఉంది. బ్రెజిల్ తరువాత, ప్రపంచంలో ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. మిగతా అన్ని దేశాల్లోనూ వెయ్యిలోపే మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో దేశంలో 1.79 లక్షల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు రికవరీల్లో ఇది ఒక రికార్డు. మరోవైపు, కరోనా ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తంగా 27 కోట్ల 27 లక్షల 5 వేల 103 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య గురువారానికి 13.23 కోట్లు దాటింది. 24 గంటలలో 22 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 96వ రోజైన ఏప్రిల్ 21వ తేదీన 22,11,334 వ్యాక్సిన్ డోసులిచ్చారు. అందులో 15,01,704 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 7,09,630 మందికి రెండో డోస్ ఇచ్చారు. -
రెండో స్థానం: బ్రెజిల్‌ను దాటేసిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల విషయంలో బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. ఇండియాలో తాజాగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదేతొలిసారి. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో దేశవ్యాప్తంగా 904 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,70,179కు చేరింది. 10 రోజుల్లోనే కేసులు రెట్టింపు కొత్తగా నమోదైన కేసుల్లో 83.02 శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా జడలు విప్పుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 63,294 కేసులు రాగా, ఉత్తరప్రదేశ్‌లో 15,276 కేసులు, ఢిల్లీలో 10,774 కేసులు వచ్చాయి. దేశంలో ఏప్రిల్ 1న 72,330 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 5న 1,03,558 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 12న 1,68,912 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 5 రాష్ట్రాల్లో్ల 70.16 శాతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 12 లక్షల మార్కును దాటేశాయి. రికవరీ రేటు 90 శాతానికి పడిపోయింది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 8.8 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల్లో 70.16% వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలదే. దేశంలో యాక్టివ్ కేసులు గత ఏడాది సెప్టెంబర్ 18న అత్యధికంగా 10,17,754 ఉండగా, అత్యల్పంగా ఫిబ్రవరి 12న 1,35,926 ఉన్నాయి. మరోవైపు రికవరీ రేటు 89.86 శాతానికి పడిపోయింది. ముంబైలో 3 జంబో కరోనా ఆసుపత్రులు మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రచండవేగంతో విస్తరిస్తోంది. బాధితులకోసం ముంబైలో మూడు జంబో ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 5 వారాల్లోగా వీటిని నెలకొల్పనున్నట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్‌సింగ్ చాహల్ సోమవారం చెప్పారు. ఒక్కో ఆసుపత్రిలో 2వేల పడకలు, ఇందులో 200 ఐసీయూ పడకలు, 70 శాతం ఆక్సిజన్ పడకలు ఉంటాయని తెలిపారు. కొన్ని 4–స్టార్, 5–స్టార్ హోటళ్లను ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కరోనా పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఐసీయూ పడకల సంఖ్య 2,466కు చేరిందన్నారు. 141 ఆసుపత్రుల్లో మొత్తం 19,151 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 25.78 కోట్ల టెస్టులు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి వారిలో ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 వరకు 25,78,06,986 నమూనాలను(శాంపిల్స్) పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు...
-
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్ ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది. రాబర్ట్ వాద్రాకు కరోనా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్‌గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాను’ అని ఆమె తెలిపారు. రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు. -
COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ...
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: దాదాపు నెల రోజుల నుంచి కరోనా బెంబేలెత్తిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతూ ఉండగా, డబులింగ్ టైమ్ తగ్గుతూ వస్తోంది. దేశంలో గత 24 గంటల్లో ఏకంగా 68,020 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 11 తర్వాత.. ఒకరోజు వ్యవధిలో నమోదైన అధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,843 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,13,55,993కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.32 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,21,808గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.33 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 24,18,64,161 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం 9,13,319 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. 8 రాష్ట్రాల్లో.. దేశంలో సోమవారం నమోదైన కేసుల్లో 84.5శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో 40,414, కర్ణాటకలో 3,082, పంజాబ్‌లో 2,870, మధ్యప్రదేశ్‌లో 2,276 గుజరాత్లో 2,270, కేరళలో 2,216, తమిళనాడులో 2,194, ఛత్తీస్‌గఢ్‌లో 2,153 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లోనే 80.17శాతం యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ 6.05 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. రిషికేశ్ తాజ్ హోటల్లో 76 మందికి కరోనా ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లోని తాజ్ హోటల్లో ఏకంగా 76 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా హోటల్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతవారంలోనే 16 కేసులు రావడంతో 48 గంటల పాటు హోటల్‌ను మూసేశారు. తాజా కేసులతో మూడు రోజుల పాటు మూసివేశారు. దీంతో పాటు ఇటీవల డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీ, రిషికేశ్‌లోని గుమనివాలా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి పూర్తి స్థాయి నిబంధనలు విధించిన నేపథ్యంలో తాజా కేసులు బయట పడటంతో ఈ ప్రాంతాల్లోని బ్యాంకులు, షాపులు, ఆఫీసులను కూడా మూసేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు కూడా కేవలం ఇంటికొకరే బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. హరిద్వార్‌లో తాజాగా 73 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. -
Coronavirus: కట్టలు తెంచుకుంటున్న కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కట్టను తెంచుకున్న గంగమ్మలా పోటెత్తుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 62,258 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 16 నుంచి పోలిస్తే ఒకరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,240 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,95,023 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.85 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.80 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.35గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 23,97,69,553 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆరు రాష్ట్రాల్లో.. కొత్త కేసుల్లో 79.57 శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 36,902 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కేరళల్లోనే 73 శాతం కేసులు నమోదయ్యాయి. 10 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ 5.8 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. టెస్టుల సంఖ్యను పెంచండి: కేంద్రం దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్ర అధికారులతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ప్రత్యేకించి 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న తీరును ఆయన రాష్ట్రాల దృష్టికి తీసుకొచ్చారు. 12 రాష్ట్రాల్లోనూ ప్రత్యేకించి 46 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ సోకిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి, వారిని కాంటాక్ట్ అయిన వారిని కూడా ట్రేస్ చేయడం ద్వారా కేసులను అదుపు చేయొచ్చన్నారు. 45 ఏళ్లు దాటిన కేసుల్లోనే మరణాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. కరోనాను మాస్క్ ద్వారా కట్టడి చేయవచ్చని 90 శాతం మందికి తెలిసినా, వారిలో 44 శాతం మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని అన్నారు. కోవిడ్ సోకిన ఒక వ్యక్తి నెలలో 406 మందికి దాన్ని వ్యాప్తి చేయగలడని అన్నారు. కోవిడ్ వ్యాప్తిస్తున్న రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఒక్క రోజులోనే 53 వేలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రతరమవుతోంది. 24 గంటల్లోనే 53,476 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికం. దీంతోపాటు, గత రెండు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 1,17,87,534కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855, పంజాబ్‌లో 2,613, కేరళలో 2,456 ఉన్నాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు వరుసగా 15వ రోజు కూడా పెరిగి, 3,95,192కు చేరుకుని, మొత్తం కేసుల్లో ఇవి 3.95%గా ఉన్నాయి. రికవరీ రేటు మరింత తగ్గి 95.28%గా ఉందని కేంద్రం తెలిపింది. మహమ్మారితో ఒక్క రోజులోనే మరో 251 మంది మరణించడంతో ఇప్పటి వరకు 1,60,692 మంది చనిపోయినట్లయింది. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన 54,366 కేసులు నమోదైన రికార్డు ఉంది. ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,12,31,650కి చేరింది. ఆ రాష్ట్రాల్లో ఎక్కువ రోజువారీ కరోనా కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, గుజరాత్‌లలోనే ఎక్కువగా బయటపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఈ రాష్ట్రాల్లోనే 80.63%వరకు ఉన్నాయని వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే 74.32%వరకు ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35,952 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,00,833కు పెరిగింది. -
కేసులు పెరిగిపోతున్నాయి బాబోయ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణకు బ్రేకులు పడటం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 47,262 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 275 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,441కు చేరుకుందని తెలిపింది. దాదాపు 83 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఒకేరోజు 270కి పైగా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,05,160కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.49 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,457గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.14 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 88 శాతం మంది 45 ఏళ్ల వయసు దాటినవారేనని కేంద్రం స్పష్టం చేసింది. వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వయసు వారిలో మరణాల శాతం 2.85గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. అందువల్లే 45 ఏళ్లు దాటిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో బయట పడిన కేసుల్లో 77.44 శాతం కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లు ఉన్నాయి. ఆరు రాష్ట్రాల్లో కలిపి 81.65 శాతం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855 కేసులు బయటపడ్డాయి. -
రెండు రోజుల్లో 90 వేల కేసులు
న్యూఢిల్లీ/మైసూరు/డెహ్రాడూన్: దేశంలో కేవలం రెండు రోజుల్లో బయటపడిన కేసుల సంఖ్య 90 వేలు దాటింది. గత 24 గంటల్లో 46,951 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 212 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,967 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,51,468 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.75 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,34,646గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 2.87 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. 80% కేసులు ఆ రాష్ట్రాల్లోనే.. దేశంలో సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 80.5 శాతం కేసులు కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మహారాష్ట్రలో అత్యధికంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 1,78,00,438 కరోనా పరీక్షలు చేయగా అందులో 13.93% పాజిటివిటీ రేటు నమోదైంది. కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పింది. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య దేశంలో 4.50 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని తెలిపింది. లాక్డౌన్ ఆలోచన లేదు..: కర్ణాటకలో లాక్డౌన్ వార్తలపై ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ స్పందించా రు. ప్రస్తుతానికి లాక్‌డౌన్‌గానీ, సెమీ–లాక్‌డౌన్‌గానీ విధించే అవకాశం లేదని చెప్పారు. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో మైసూరులో మినీ లాక్‌డౌన్‌ను విధించాల్సి ఉంటుందని, ప్రజలు నిబంధనల్ని పాటించాలని కలెక్టర్ రోహిణి సింధూరి తెలిపారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేకుండా ఇతర రాష్ట్రాలవారు రావద్దన్నారు. 4–8 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని గతంలో సూచించగా, ప్రస్తుతం దాన్ని 4 నుంచి 8 వారాలుగా సవరించింది. అంటే మొదటి డోసు తర్వాత 4–8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా టీకా ‘కోవిషీల్డ్’ పంపిణీలో రెండు డోసుల మధ్య సవరించిన విరామాన్ని పాటించాలని సూచించారు. ఇలా తీసుకుంటే కరోనా నుంచి రక్షణ మరింత పెరుగుతున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లభించాయని రాజేష్ భూషణ్ తెలిపారు. సవరించిన విరామం కోవాగ్జిన్ టీకాకు వర్తించదని స్పష్టం చేశారు. -
‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గత 11 రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 43,846 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 15 లక్షల 99 వేల 130కి చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 2.66కి పెరిగింది. మొత్తం 3,09,087 యాక్టివ్ కేసులు న్నాయి. కేసులు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్–19 నిబంధనలు ప్రజలు సరిగా పాటించకపోతే దేశాన్ని సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకొస్తే కరోనా భూతాన్ని తరిమి కొట్టవచ్చునని అన్నారు. జన్యు మార్పిడికి లోనైన వివిధ రకాల వైరస్లు భారత్‌లోకి రావడం, భారీగా జనాల గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించడం తాజాగా కేసులు పెరిగిపోవడానికి కారణమని ఆయన చెప్పా రు. ‘‘కరోనా నిబంధనల్ని జనాలు గాలికొదిలేశారు. ముప్పు తప్పిందని అందరూ అనుకుంటున్నారు. వ్యాక్సిన్ కూడా రావడంతో ధీమా పెరిగిపోయింది. ఎక్కువ మందితో పెళ్లిళ్లు, వేడుకలు చేస్తున్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాలే కరోనా కేసుల్ని పెంచుతున్నాయి’’ అని రణ్‌దీప్ అంచనా వేశారు. కరోనా కట్టడికి అతి ముఖ్య సూత్రమైన టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విధానాన్ని పాటించడంలో ప్రభుత్వాలు కొద్ది కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. వివిధ దేశాల కొత్త మ్యుటేషన్ వైరస్లు కూడా కేసుల తీవ్రతకు కారణమని వివరించారు. దీనిని నిలువరించాలంటే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. అయిదు రాష్ట్రాల నుంచే 83% కేసులు 4 నెలల్లో అత్యధికంగా రోజువారీ కేసులు 43,846 నమోదైతే, అందులో 83% కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచే వచ్చాయి. మహారాష్ట్రలో ఏకంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మరో 197 మంది కరోనాతో చనిపోగా మృతుల సంఖ్య 1,,59,755కి చేరుకుంది. లోక్‌సభ స్పీకర్‌కు కరోనా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(58)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఎయి మ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఆంక్షలు జైపూర్/భోపాల్: రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు ప్రకటించాయి. రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం నుంచి 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారు 72 గంటల్లోపు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ రిపోర్టును చూపించాలని లేదంటే 15 రోజులపాటు క్వారంటైన్లో గడపాలని తెలిపింది. ఇండోర్‌లో లాక్డౌన్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం వీధులు బోసిపోయాయి. ఈ నగరాల్లో ప్రతి శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి భోపాల్, ఇండోర్ జిల్లాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. -
ఒకే హాస్టల్లో 229 మందికి కరోనా
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 229 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ శణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్ చేసి, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నారు. మహారాష్ట్రలో బుధవారం 8,807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6,218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. అలసత్వం వద్దు.. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు. వివరణ ఇవ్వండి.. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడం, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రం లేఖలు రాసింది. నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగటివ్ ధ్రువపత్రం చూపించాల్సిందే. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15 మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టీ–పీసీఆర్ టెస్టు చేయించుకున్నట్లు, కరోనా నెగెటివ్‌గా తేలినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. -
6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం సోమవారం ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్‌ను మొదటి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది. తయారీ కేంద్రాల నుంచి టీకా డోసుల సరఫరా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ రంగ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ నుంచి అడిషనల్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ పేరిట ఈ కొనుగోలు ఆర్డర్ జారీ అయింది. టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.200 కాగా, జీఎస్టీతో రూ.10 కలుపుకుని డోసు ఖరీదు మొత్తం రూ.210 అని ఆ అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 60 పాయింట్లకు టీకా డోసులు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు దానిని చేరవేస్తారు. ఢిల్లీలోని తహిర్‌పూర్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్టోరేజీ పాయింట్‌కు 2,54,500 డోసుల కోవిషీల్డ్ టీకా చేరనుందని అధికారులు తెలిపారు. పుణేలోని మంజరి వద్దనున్న సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రం నుంచి వ్యాక్సిన్ తీసుకెళ్లే ట్రక్కులకు రాష్ట్ర సరిహద్దుల వరకు, విమానాశ్రయాల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తోంది. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ టీకాను వ్యక్తులకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. స్వచ్ఛందంగా వేయించుకోండి వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేయించు కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తన 3.5 లక్షల మంది సభ్యులకు పిలుపునిచ్చింది. సంపూర్ణ శాస్త్రీయ విశ్లేషణ, నిపుణుల బృందం నివేదికల పరిశీలన, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వోలతో చర్చల అనంతరం ప్రభుత్వం చేపట్టే కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను దేశీయ వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, వినియోగించడం సులువని వివరించింది. -
90 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 45,882 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,04,365కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 584 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,162కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 84.28 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.6 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,43,794గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.92 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. రాష్ట్రాలకు అత్యున్నత స్థాయి బృందాలు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పలు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అత్యున్నత స్థాయి బృందాలు వెళ్లి సమీక్షించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం చెప్పింది. ఇప్పటికే హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మణిపూర్‌లలోని కొన్ని జిల్లాలకు ఈ బృందాలు వెళ్లాయని చెప్పింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బృందాలు వెళ్లనున్నాయని పేర్కొంది. ఈ బృందాలు కంటెయిన్మెంట్ జోన్లను బలోపేతం చేయడం, సమీక్షించడం, పరీక్షలు, క్లినికల్ మేనేజ్మెంట్ వంటివాటిపై సలహాలు, సూచనలు ఇస్తాయని తెలిపింది. అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల (నవంబర్ 20–23) వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పష్టం చేశారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించే పరిస్థితి ఉండబోదన్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ‘టీకా’పై ప్రధాని సమీక్ష భారత్‌లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. టీకా పంపిణీ ప్రక్రియలో భాగస్వామ్యులను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్యతాక్రమం మొదలైన అంశాలపై సమీక్ష జరిపారు. వ్యాక్సీన్ అభివృద్ధితో పాటు సేకరణ, నియంత్రణ, నిల్వ మొదలైన ముఖ్యమైన అంశాలను సమావేశంలో చర్చించినట్లు ప్రధాని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. -
45 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. గురువారం 95 వేలకుపైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం ఆ రికార్డును దాటి 96 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో వచ్చిన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,414కు చేరుకుంది. గత 24 గంటల్లో 70,880 మంది కోలుకోగా 1,209 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 76,271కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,663కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,43,480గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారానికి ఇది 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యశవంతపుర: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. మేలోనే 64 లక్షల మందికి కోవిడ్ మే ఆరంభం నాటికే దేశంలో 0.73% మందికి అంటే 64 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు జాతీయ స్థాయి సీరో సర్వే లెక్కగట్టింది. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) చేపట్టిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి. మే 11 నుంచి జూన్ 4వ తేదీ వరకు 28 వేల మంది నుంచి సేకరించిన రక్త నమూనాల్లో యాంటీబాడీలను ‘కోవిడ్ కవచ్ ఎలిసా’కిట్‌ను ఉపయోగించి లెక్కించారు. 18–45 మధ్య ఏళ్ల వారిలో సీరోపాజిటివిటీ(రక్తంలో యాంటీబాడీల స్థాయి) రేటు అత్యధికంగా 43.3% ఉండగా, 46–60 ఏళ్ల గ్రూపులో 39.5%, 60 ఏళ్లు పైబడిన వారిలో అతి తక్కువగా 17.2% మాత్రమే ఉన్నట్లు రుజవైందని నివేదిక తెలిపింది. మే ఆరంభంలోనే దేశంలో 64లక్షల మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. -
ఎనిమిదో రోజూ 50వేల కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో గురువారం కొత్తగా 56,282 కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,64,536 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 మంది కోలుకోగా, 904 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 40,699 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 13,28,336కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,95,501 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 30.31గా ఉంది. ఇది జూలై 24న 34.17గా ఉండేది. గత ఎనిమిది రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా 904 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 334 మంది మరణించారు. తమిళనాడు నుంచి 112, కర్ణాటక నుంచి 100, పశ్చిమబెంగాల్ నుంచి 61, ఉత్తర ప్రదేశ్ నుంచి 40 మంది మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 67.62 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.07 శాతానికి పడిపోయిందని తెలిపింది. కోవిడ్ కోసం 890 కోట్ల నిధులు.. కోవిడ్ ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సాయంచేసేందుకు గురువారం కరోనా అత్యవసర నిధి రెండో విడతలో భాగంగా రూ. 890.32 కోట్లు విడుదల చేసింది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవి కేటాయించనున్నారు. రాష్ట్రాల్లోని కేసుల ఆధారంగా నిధులను కేటాయించనున్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వైద్య రంగ మౌలిక వసతులను మెరుగుపరచుకోవడానికి రాష్ట్రాలు ఉపయోగించుకోనున్నాయి. ఈ పాకేజీలో భాగంగా రాష్ట్రాలు 5,80,342 ఐసోలేషన్ బెడ్లు, 1,36,068 ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్లు పొందనున్నాయి. -
కొత్త కేసులు 24,879
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 487 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 7,67,296కు, మరణాలు 21,129కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,69,789 కాగా, 4,76,377 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 62.08 శాతానికి చేరుకుంది. సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు భారత్‌లో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనపై రాజేశ్ భూషణ్ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. 90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే... దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో గురువారం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. -
కొత్తగా 24,850 కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తి నానాటికీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 24,850 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 613 మంది బాధితులను కరోనా పొట్టనపెట్టుకుంది. దేశంలో ఇప్పటివరకు 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం, ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి, మరణాల సంఖ్య 19,268కు చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 2,44,814. చికిత్సతో 4,09,082 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ 4వ స్థానానికి చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో భారత్ 8వ స్థానంలో నిలిచింది. 78 శాతం కేసులు 7 రాష్ట్రాల్లోనే.. దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 78 శాతం కేవలం 7 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్‌లో కలిపి 7,935 కేసులు నిర్ధారణయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 97,89,066 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మహారాష్ట్రలో 2 లక్షలు సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్కును దాటేశాయి. రాష్ట్రంలో లక్ష కేసులకు 97 రోజులు పట్టగా, తర్వాత 22 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 24 గంటల్లో 7,074 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరింది. గడిచిన 24 గంటల్లో 124 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 8,671కి చేరింది. రాష్ట్రంలో 1,08,082 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ రేటు 54.02 శాతంగా ఉంది. -
ఢిల్లీలో సర్వే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తీరును పూర్తిగా తెలుసుకునేందుకు అధికారులు శనివారం నగరంలో సెరోలాజికల్ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో 20 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వారి శరీరంలో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీలు ఉన్నాయో లేదో గుర్తించడానికే ఈ సర్వే చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తద్వారా ఎవరెవరూ ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ వరకు సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. -
ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్ దేశాలను కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. ఈ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ వైరస్ సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకోవడం భారీగా ఊరటనిచ్చే అంశం. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 54 శాతంగా ఉంది. మన దేశంలో కరోనా వైరస్ సోకినా పెద్దగా భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 56.70శాతం రికవరీ రేటుతో భారత్ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటుతో పోల్చి చూస్తే మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. అంతేకాదు అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి చేరుకొని ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఇక భారత్‌లో రాజస్తాన్ 78శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో రికవరీ రేటు ఎలా పెరిగింది ? ► భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ వాటిలో సీరియస్ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారందరికీ వైరస్ స్వల్పంగా, మధ్యస్థంగా సోకింది. దీంతో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ► వైరస్ బట్టబయలైన తొలిరోజుల్లో అందరినీ ఆస్పత్రికి తీసుకువెళ్లి క్వారంటైన్ చేసేవారు. కానీ ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెడికల్ (ఐసీఎంఆర్) తన విధానాన్ని మార్చుకుంది. స్వల్ప లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్లో ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నపాటి జ్వరం, గొంతునొప్పి ఉన్నవారు ఇంట్లో వైద్యుల సూచన మేరకు వ్యవహరిస్తూ 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు. ► భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లతో వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ. క రోనా వైరస్‌కు మందు లేకపోవడం వల్ల ఇమ్యూని టీని పెంచడానికే మందులు ఇస్తున్నారు. ఈ తర హా చికిత్సకు భారతీయులు త్వరగా స్పందిస్తున్నారు ► కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానమే మార్గం. ఆ దిశగా భారత్ అడుగులు బలంగానే పడుతున్నాయి. 3 నెలల క్రితం రోజుకి సగటున 100 కూడా కోవిడ్ పరీక్షలు జరిగేవి కావు. అలాంటిది ఇప్పుడు రోజుకి 2 లక్షల పరీక్షలు జరుగుతున్నాయి. అత్యంత పకడ్బందీ ప్రణాళికతో వైరస్ అనుమానితుల్ని పట్టుకొని క్వారంటైన్ చేయడం వల్ల రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో రికవరీ 2.58 లక్షలు భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది. గత 24 గంటల్లో 15,968 కేసులు నమోదయ్యాయని, 465 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య 14,476కి చేరుకుంది. అయితే ప్రతీ లక్ష మంది జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే మన దేశంలో మృతుల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్టుగా శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ లక్ష మంది జనాభాకి ఆరుగురు కోవిడ్‌తో మరణిస్తే, భారత్‌లో ఆ సంఖ్య ఒక్కటి మాత్రమే. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఇప్పటివరకు 2.58 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ఒక్కరోజే దాదాపుగా 4 వేల కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 66,602కి చేరుకుంది. దీంతో జూలై 6లోపు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ కోవిడ్‌తో మృతి చెందారు. కోల్‌కతాలో ఓ ఆస్పత్రిలో మే నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘోష్‌కు అప్పటికే గుండె, కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో బుధవారం ఆయన మరణించారు. ప్రపంచంలో జర్మనీ టాప్ కోవిడ్–19 బారినపడి కోలుకున్న వారిలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో లక్షా 92 వేల కేసులు నమోదైతే, ఇప్పటివరకు లక్షా 75 వేల మందివరకు కోలుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఇరాన్, ఇటలీ నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఆ దేశంలో కోలుకున్న వారు 40శాతం మంది మాత్రమే ఉన్నారు. -
కేసుల్లో మళ్లీ రికార్డు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొత్త కేసులు నమోదులో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి. 336 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు, మృతుల సంఖ్య 12,573కి చేరుకుందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకి 10 వేలు దాటి కేసులు నమోదు కావడం వరసగా ఇది ఎనిమిదో రోజు. జూన్ 1 నుంచి 19 మధ్య 1,89,997 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది. ప్రైవేటు ఆస్పత్రికి సత్యేందర్ జైన్ కరోనా వైరస్ సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు న్యుమోనియా కూడా సోకడంతో సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చేసే అవకాశాలున్నాయి. మూతబడిన కర్ణాటక సీఎం కార్యాలయం శివాజీనగర: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కార్యాలయం, అధికారిక నివాసం కూడా అయిన కృష్ణలో పనిచేసే ఓ ఉద్యోగిని భర్తకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో శానిటైజేషన్ కోసం కార్యాలయాన్ని మూసివేశారు. ముఖ్యమైన సమావేశాలన్నీ యెడియూరప్ప విధాన సౌధలో నిర్వహించారు. 2 లక్షలు దాటిన రికవరీ కేసులు కోవిడ్–19 బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరగడం మన దేశానికి అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 2,04,710 మంది రోగులు కరోనా నుంచి కోలుకుంటే , 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 53.79శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. చైనాలో ఇటీవల 37 కొత్త కరోనా కేసులు రాగా, అందులో 25 కేసులు బీజింగ్‌లో వచ్చాయి. బీజింగ్‌లో కనిపించిన కరోనా వైరస్‌కు యూరోప్ వైరస్‌కు సంబంధాలు ఉన్నాయని చైనా వైరాలజిస్టులు తెలిపారంటూ గ్లోబల్ టైమ్స్ పత్రిక శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుతం బీజింగ్‌లో 183 మంది కరోనా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. -
ఇంటింటి సర్వే చేపట్టండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరిస్తున్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీచేసింది. తమ పరిధిలోని పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించి, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, హరియాణా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని ఆ 45 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై, కంటెయిన్మెంట్ వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేషెంట్లలో లక్షణాలు ఉధృతమై, పరిస్థితి చేయి దాటకముందే చికిత్స అందేలా చూడాలన్నారు. ఆసుపత్రులు, వైద్యుల నిర్వహణ కోసం సమర్థ విధానాలను అమలు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే అనుమానిత పేషెంట్ల కోసం ప్రత్యేకంగా అధికారులను ఆసుపత్రుల్లో నియమించాలని సూచించారు. స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుని వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేయాలనీ, అంబులెన్స్‌లను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఒక్కరోజులోనే 9,983 కేసులు 24 గంటల్లో 271 మంది మృతి ఇప్పటిదాకా 2,56,611 కేసులు.. 7,200 మరణాలు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసులు రెండున్నర లక్షలు, మరణాలు ఏడు వేల మార్కును దాటేశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లోనే 9,983 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తాజాగా 271 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,56,611కు, మరణాలు 7,200కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 1,24,981 కాగా, 1,24,429 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 48.49 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 47,74,434 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. గత 24 గంటల్లో 1,08,048 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత స్థానం ఇండియాదే. -
ఒకే రోజు 9,851 కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు చేరుకోగా, మృతుల సంఖ్య 6,348కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్–19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్‌దే. జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే త్వరలోనే ఇటలీని దాటిపోనుంది. ఇక కోవిడ్ రోగుల రికవరీ రేటు 48.27 శాతంగా ఉంది. అత్యధిక కేసుల్లో మహారాష్ట్ర (77,793), తమిళనాడు (27,256), ఢిల్లీ (25,004) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,710 మంది ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత గుజరాత్ (1,155), ఢిల్లీ (650) ఉన్నాయి. 4 రోజుల్లో 900కు పైగా మరణాలు కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నా మృతుల రేటు ఇప్పటి దాకా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ తొలి మరణం మన దేశంలో మార్చి 12న సంభవించింది. ఆ తర్వాత మృతుల సంఖ్య వెయ్యికి చేరుకోవడానికి 47 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 900 పైగా మరణాల సంఖ్య నమోదు కావడం గమనార్హం. ∙చైనా రాజధాని బీజింగ్ నగరంలో అమలవుతున్న అత్యవసర పరిస్థితి తీవ్రతను రెండో స్థాయి నుంచి శనివారం మూడో స్థాయికి తగ్గించినట్లు యంత్రాంగం తెలిపింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు లేవని తెలిపింది. వూహాన్‌లోని మొత్తం కోటి మందికీ కోవిడ్–19 పరీక్షలు జరపగా ఎవరికీ పాజిటివ్‌గా నిర్థారణ కాలేదని పేర్కొంది. -
ఒక్కరోజులో 194 మంది మృతి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇండియాలో కరోనా మహమ్మారి సృష్టించిన మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు.. కేవలం 24 గంటల్లో 194 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. కొత్తగా 6,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాలు 4,531కు, పాజిటివ్ కేసులు 1,58,333కు ఎగబాకాయి. దేశంలో మొత్తం క్రియాశీల కరోనా కేసులు 86,110 కాగా, 67,691 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అంటే 42.75 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా సంభవించిన 194 మరణాల్లో మహారాష్ట్రలోనే 105 మరణాలు వెలుగుచూశాయి. గుజరాత్లో 23, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 8 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 1,897 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటికే 56,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 18,545, ఢిల్లీలో 15,257, గుజరాత్లో 15,195, రాజస్తాన్‌లో 7,703, మధ్యప్రదేశ్‌లో 7,261, ఉత్తరప్రదేశ్‌లో 6,991 కేసులు బయటపడ్డాయి. కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావిస్తున్న కేరళలో తాజాగా ఒక్కరోజే 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1,088కు చేరింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కేరళలో కరోనాతో మృతి చెందాడు. అతడు రాజస్తాన్ నుంచి మే 22న కేరళకు వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడని కేరళ వెల్లడించింది. -
కొత్త కేసులు 5,611
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో ఏకంగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 140 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 6.39% బాధితులకే ఆస్పత్రి సేవలు అవసరం దేశంలో యాక్టివ్ కేసుల్లో 6.39 శాతం బాధితులకే ఆసుపత్రుల్లో సేవలు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. అలాగే 2.94 శాతం బాధితులకు ఆక్సిజన్ సపోర్టు, 3 శాతం మందికి ఐసీయూ సేవలు, 0.45 శాతం మంది బాధితులకు వెంటిలేటర్ సపోర్టు అవసరమని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 62 మందికి కరోనా సోకిందని తెలిపారు. వలస కూలీల కోసం హెల్ప్‌లైన్ వలస కూలీలు తమ ఇబ్బందులు, ఫిర్యాదులను తెలిపేందుకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటే ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. అయితే, అది టోల్‌ఫ్రీ నెంబర్‌గా ఉండబోదని బుధవారం టెలీకాం విభాగం(డీఓటీ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. -
ప్రతీ లక్షకు 7.1 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పటిదాకా ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష జనాభాకు 60 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటివరకు 48,49,427 కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రతి లక్ష మందికి అమెరికాలో 431 కేసులు, రష్యాలో 195, యూకేలో 361, స్పెయిన్‌లో 494, ఇటలీలో 372, బ్రెజిల్లో 104, జర్మనీలో 210, టర్కీలో 180, ఫ్రాన్స్‌లో 209, ఇరాన్లో 145 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయని వివరించింది. 24 గంటల్లో 5,242 పాజిటివ్ కేసులు భారతదేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం ఆగడం లేదు. పాజిటివ్ కేసులు లక్షకు చేరుకుంటున్నాయి. మరణాలు 3 వేల మార్కును దాటేశాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కేవలం 24 గంటల్లో 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే తాజాగా 157 మంది కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,169కి, మరణాల సంఖ్య 3,029కి ఎగబాకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 56,316. కరోనా బారిన పడిన వారిలో 36,823 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 38.29 శాతంగా నమోదైంది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతుండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు కరోనాతో వణికిపోతున్నాయి. అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. లాక్డౌన్ 4 నిబంధనలను నీరుగార్చొద్దు దేశంలో నాలుగో దశ లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. లాక్డౌన్ నిబంధనలను నీరుగార్చొద్దని పేర్కొన్నారు. లాక్డౌన్ విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనలను తు.చ తప్పకుండా పాటించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన దుకాణాలు మాత్రమే తెరిచేలా చూడాలన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజించాలని అజయ్ భల్లా తెలిపారు. -
ముగ్గురిలో ఒకరికి స్వస్థత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల్లో ఎక్కువ మంది చికిత్సతో క్రమంగా కోలుకుంటుండడం ఊరట కలిగిస్తోంది. రికవరీ రేటు తాజాగా 29.36 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు సంపూర్ణంగా కోలుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో యాక్టివ్‌కరోనా కేసులు ప్రస్తుతం 37,916 కాగా, 16,539 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో 103 మంది కరోనా వల్ల మృతి చెందారు. అలాగే కొత్తగా 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వల్ల ఇప్పటివరకు 1,886 మంది ప్రాణాలు కోల్పోయారని, పాజిటివ్ కేసుల సంఖ్య 56,342కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో కరోనా బారిన పడిన వారిలో 111 మంది విదేశీయులు ఉన్నారు. భారత్‌లో కరోనా రహిత జిల్లాలు 216 దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొంది. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయట పడలేదని తెలియజేసింది. 36 జిల్లాల్లో గత 14 రోజులుగా, 46 జిల్లాల్లో గత 7 రోజులుగా కొత్త కేసులేవీ వెలుగు చూడలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తే కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరడాన్ని నివారించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సూచించారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని లవ్ అగర్వాల్ అన్నారు. లాక్డౌన్ ఆంక్షల్లో మినహాయింపులు ఇస్తుండడం, వలస కూలీలు సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో మన ముందు పెద్ద సవాలు ఉందని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని వ్యాఖ్యానించారు. 2.5 లక్షల మంది స్వస్థలాలకు.. లాక్డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడానికి 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు హోంశాఖ తెలిపింది. ఈ రైళ్లలో 2.5 లక్షలకుపైగా వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులు సొంత ప్రాంతాలకు చేరుకున్నారని వివరించింది. లాక్డౌన్ నిబంధనలకు లోబడి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని యోచిస్తున్నట్లు హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ చెప్పారు. -
ఆల్కహాల్ శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం
న్యూఢిల్లీ: ఇతర దేశాలకు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించించింది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి బారిన పడకుండా శుభ్రతను పాటించే క్రమంలో శానిటైజర్ల వాడకం ప్రప్రథమంగా మారింది. అంతేగాక దేశీయ మార్కెట్లలో వీటి లభ్యతను కూడా పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్‌కు మందు లేకపోవడం వ్యక్తిగత శుభ్రత పాటించడమే విరుగుడని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు ప్రజలంతా వ్యక్తి శుభ్రతను పాటించడం పరిపాటిగా చేసుకున్నారు. (మద్యం ప్రియులకు భారీ షాక్..) దీంతో క్రిమీ సంహారినిగా పనిచేసే శానిటైజర్ల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ మార్కెట్ల ఉత్పత్తి, విక్రయంలో మార్చి, ఏప్రిల్‌లో శానిటైజర్ మొదటి స్థానంలో నిలిచింది. కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం నాణ్యమైన శానిటైజర్లను సరఫరా చేసే పేరున్న కంపెనీలు మూత పడటంతో, అవి మార్కెట్లోకి అందుబాటులో లేకుండా పోయాయి. కొన్ని కంపెనీలు ఆల్కాహాల్ శాతం అధికంగా ఉన్న శానిటైజర్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇక లాక్డౌన్లో మద్యం దుకాణాలు కూడా బంద్ కావడంతో మందు బాబులకు మద్యం అందుబాటులో లేకపోవడంతో ఆల్కాహాల్ శానిటైర్లను మందుల తీసుకుని ప్రాణామీదకు తెచ్చుకున్న ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గత నెలలో, కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని 29 ఏళ్ల పీహెచ్‌డి చేస్తున్న విద్యార్థి మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ దగ్గు మందులో కలుపుకుని తాగి మరణించాడు. దీంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు శానిటైజర్లు, ఇతర ఆల్కహాల్‌కు సంబంధించిన ద్రవాలు తాగోద్దని ప్రజలను పదేపదే విజ్ఞప్తి చేస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. (శానిటైజర్ క్యాన్లతో వెళ్తున్న లారీ దగ్ధం) -
28,380 కేసులు... 886 మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడినప్పటికీ ప్రాణాపాయం ఉన్నట్లు కాదు. కరోనా బాధితులు చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటిదాకా 6,361 మంది ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అంటే మొత్తం బాధితుల్లో 22.41 శాతం మంది కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 1,463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 28,380కు, కరోనా సంబంధిత మరణాలు 886కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 16 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కేసులేవీ నమోదు కాలేదన్నారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 21,132 కాగా, 6,361 మంది(22.41 శాతం) బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. వాటికి వెనక్కి పంపించాలని సోమవారం సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్జౌ వోండ్ఫో బయోటెక్, ఝూజై లివ్సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
దేశంలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు
-
ఒక్కరోజులో 1,752 పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ/కోజికోడ్: దేశంలో కరోనా కల్లోలానికి కళ్లెం పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా రికార్డు స్థాయిలో 1,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు, మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 17,915 కాగా, 4,813 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో 4 నెలల చిన్నారి బలి కరోనా మహమ్మారి కేరళలో 4 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. మలప్పురం జిల్లాలోని పయనాడ్కు చెందిన ఈ పాప జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 21న కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతే కాకుండా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స పొందు తూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కేరళలో మూడో కరోనా సంబంధిత మరణం ఈ పాపదే. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తొలి చిన్నారి ఈమె. ఆజాద్‌పూర్ మండీలో 300 దుకాణాలు మూసివేత ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలోని డి–బ్లాక్‌లో 300 దుకాణాలను మూసివేశారు. ఈ మండీలో ఒక వ్యాపారి (57) ఏప్రిల్ 21న కరోనా వైరస్ సోకి మరణించాడు. బుధవారం మార్కెట్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. -
భారత్‌లో అదుపులోకి రాని కరోనా
-
17,656 పాజిటివ్.. 559 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో తాజాగా 1,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 40 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కు, మొత్తం మరణాల సంఖ్య 559కు చేరిందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్లో ఐదుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 14,255 కాగా, 2,841 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు.. 24 గంటల్లో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్లో 9 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం మరణాలు 559 కాగా, ఇందులో 223 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 7.5 రోజుల్లో రెట్టింపు అవుతుండగా, ఒడిశాలో 39.8, కేరళలో 72.2 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి. -
కరోనా కేసులు పైపైకి...
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య 12 వేలు దాటింది. దేశంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 28 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 9 మంది, గుజరాత్లో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కన్నుమూశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,759కి, మొత్తం మరణాల సంఖ్య 420కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇండియాలో యాక్టివ్‌కరోనా కేసులు 10,824 కాగా, 1,514 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 76 మంది విదేశీయులు ఉన్నారు. దేశంలో 325 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం చెప్పారు. ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న పటిష్టమైన నియంత్రణ చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్రదే తొలిస్థానం. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 187 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 53 మంది, గుజరాత్లో 36, ఢిల్లీలో 32, తమిళనాడులో 14, పంజాబ్‌లో 13, ఉత్తరప్రదేశ్‌లో 13 మంది మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 2,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ధారావిలో పాజిటివ్ కేసులు 86 దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఇక్కడ గురువారం ఒక్కరోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది. ధారావిలో కరోనాతో ఇప్పటికే 9 మంది మృతిచెందారు. ముస్లిం నగర్, ముకుంద్ నగర్, సోషల్ నగర్, రాజీవ్ నగర్, సాయిరాజ్ నగర్, ట్రాన్సిట్ క్యాంప్, రామ్‌జీ ఛాల్, లక్ష్మీ ఛాల్, జనతా సొసైటీ, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇవన్నీ ధారావి మురికివాడలో భాగమే. ఇక్కడ 15 లక్షల మంది నివసిస్తున్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయండి: కేంద్ర హోంశాఖ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఫేసు మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడకపోవడం వంటి నిబంధనల అమలు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉమ్మివేయకుండా చూడాలని చెప్పారు. పని ప్రదేశాల్లో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మద్యం, గుట్కా, పొగాకు అమ్మకాలపై ప్రస్తుతం నిషేధం ఉందని, దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా విదేశాల్లో ఉంటున్న భారతీయులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు ఈ వైరస్ సోకిందని, ఇప్పటిదాకా 25 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడే ఉండాలని, ఇప్పటికిప్పుడు వారందరిని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ కోసం 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లుప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
సరిహద్దులను మూసేయండి
న్యూఢిల్లీ: వలస కూలీల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. వేల సంఖ్యలో ఉపాధి కరువైన వలస కూలీలు మూకుమ్మడిగా నగరాల నుంచి తమ స్వస్థలాలకు కాలినడక సహా తమకు వీలైన అన్ని మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య ఆదివారం సాయంత్రానికి 1,024 అని, మరణాల సంఖ్య 27 అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో భారత్‌లో 8 మరణాలు, చోటు చేసుకున్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 6, గుజరాత్లో 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, జమ్మూకశ్మీర్‌లో 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా, ఆదివారం కొత్తగా నమోదైన కేసుల్లో స్పైస్‌జెట్ పైలట్ ఒకరు కూడా ఉన్నారు. అయితే, ఆయనకు మార్చి నెలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేకపోవడం గమనార్హం. లాక్డౌన్ కారణంగా, ఇళ్లకే పరిమితమై పలువురు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నిమ్‌హ్యాన్స్ 08046110007 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వలస కూలీల విషాదం: కరోనా సమస్య దేశంలో మరో సంక్షోభానికి కారణమైంది. వైరస్ వ్యాప్తి ప్రమాదమున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వేలాదిగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆంక్షల నడుమనే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ– యూపీ సరిహద్దులు, కేరళ, మహారాష్ట్రల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కూలి ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్లేందుకు 200 కిమీలు నడిచి, ఉత్తరప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించిన విషాదం ఆదివారం చోటు చేసుకుంది. ‘ఏదో వైరస్ అందరినీ చంపేస్తుందని అంటున్నారు. నాకవేమీ తెలియదు. ఇక్కడ ఉంటే నా పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నా. ఆ వైరస్‌తో చావడం కన్నా ముందు ఆకలితో చనిపోయేలా ఉన్నాం’ అని ఢిల్లీలో కూలి పనులు చేసుకునే సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. మథుర హైవే మీదుగా 400 కిమీల దూరంలో యూపీలో ఉన్న తమ స్వగ్రామానికి కాలి నడకనైనా సరే వెళ్లేందుకు ఆమె తన పిల్లలతో కలిసి పయనమైంది. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో వేలాదిగా కూలీలు, ఇతర సామాన్యులు తమ ఊర్లకు వెళ్లేందుకు హైవేపై నిలిచి ఉన్నారు. ఈ సామూహిక ప్రయాణాలతో వైరస్ మరింత ప్రబలే ప్రమాదముందని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో లాక్డౌన్ కొనసాగినంత కాలం ప్రయాణికుల రాకపోకలను నిలిపేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. అయితే, అత్యవసర, అత్యవసరం కాని వస్తువులనే భేదం చూపకుండా సరుకులు సరఫరా చేసే అన్ని వాహనాలను అనుమతించాలని అజయ్ భల్లా స్పష్టం చేశారు. దిన పత్రికల సరఫరాకు కూడా అంతరాయం కలిగించకూడదన్నారు. సామాన్యులు, దినసరి కూలీల నుంచి ఇంటి అద్దె డిమాండ్ చేయవద్దని యజమానులను ఒక ప్రకటనలో ప్రభుత్వం కోరింది. సామాన్యులు, విద్యార్థులు, ఇతర కూలీలను అద్దె ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే.. వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల కూలీలకు భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రధాని సమీక్ష కరోనాపై పోరు కోసం తీసుకున్న చర్యల గురించి ప్రధాని మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులు సహా ప్రతీ రోజు దాదాపు 200 మంది నుంచి ఆయన వివరాలు తెలుసుకుంటున్నారు. అంబులెన్స్ సిబ్బందికి ప్రామాణిక మార్గదర్శకాలు కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించే విషయంలో అంబులెన్స్ సిబ్బందికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రామాణిక మార్గదర్శకాలు జారీ చేసింది. అంబులెన్స్ డ్రైవర్లకు, సాంకేతిక ఇబ్బందికి ఇవి వర్తిస్తాయి. బాధితులను ఆసుపత్రులకు తరలిస్తుండగా వీరు సైతం కరోనా బారినపడుతున్నట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. అంబులెన్స్‌ల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వీటిలో పని చేసే వారంతా తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఆధునిక రక్షణ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లోని రోగికి, అతడి సహాయకుడికి మూడు పొరల మాస్కులు, గ్లోవ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కోవిడ్–19 కేసులను ఎలా గుర్తించాలన్న దానిపై ఒక నమూనా ప్రశ్నావళిని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఎక్కడికక్కడ ప్రైవేట్ అంబులెన్స్‌ల జాబితా రూపొందించాలని, వాటిని కేంద్రీకృత కాల్ సెంటర్‌తో అనుసంధానించాలని, తద్వారా అంబులెన్స్ అందుబాటు సమయాన్ని గరిష్టంగా 20 నిమిషాలకు తగ్గించాలని పేర్కొంది. గుర్తింపు పొందిన అంబులెన్స్‌లనే కరోనా బాధితుల రవాణాకు ఉపయోగించాలని తేల్చి చెప్పింది. -
నిలకడగా వైరస్ వేగం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి దేశంలో మరో నలుగురు బలయ్యారు. కేవలం ఒక్క రోజులోనే తాజాగా 82 కొత్త కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా కోవిడ్–19 బాధితుల సంఖ్య 694కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో కేసుల పెరుగుదల ఇతర దేశాలతో పోలిస్తే నిలకడగా ఉందని స్పష్టం చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పటికీ రెండో దశలోనే ఉందని, మూడో దశలో మాదిరిగా సామాజిక వ్యాప్తి జరుగుతోందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. దేశంలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ వేగం మాత్రం కొంచెం నిలకడగా ఉందని.. కొంతమేరకు తగ్గిందని కూడా చెప్పవచ్చునని లవ్ అగర్వాల్ తెలిపారు. అయినప్పటికీ సామాజిక దూరం పాటించడం, వ్యాధి బారిన పడ్డ వారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం, ప్రజలందరూ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండటం చాలా కీలకమని స్పష్టం చేశారు. ఈ పద్ధతులను కచ్చితంగా కొనసాగిస్తేనే కరోనాపై విజయం సాధించవచ్చునని అన్నారు. ఇప్పటివరకూ 16 మరణాలు.. కరోనా కారణంగా దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ 16 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 694 కాగా ఇందులో 42 మందికి వ్యాధి నయమైపోయిందని, ఒక్కరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. మొత్తం కేసుల్లో 47 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 124 కేసులు ఉండగా వీరిలో ముగ్గురు విదేశీయులు. కేరళలో 8 మంది విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 118కి చేరుకుంది. కర్ణాటకలో 41 కేసులు ఉన్నాయి. గుజరాత్ విషయానికి వస్తే ఒక విదేశీయుడితో కలిపి 38 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు ఏ కేసులు నమోదుకానప్పటికీ బుధవారం కొన్ని కొత్త కేసులు బయటపడటంతో ఒక విదేశీయుడితో కలిసి 35 మంది వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మొత్తం 33 కేసులు నమోదు కాగా, హరియాణాలో 30 కేసులు ఉన్నాయి. ఒడిశాలో రెండు కేసులు బయటపడ్డాయి. 17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసుపత్రులు కరోనా వైరస్ బాధితులను ఎదుర్కొనేందుకు దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో సామాజిక కరోనా వ్యాప్తిపై ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నదాంట్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంటివద్దకే మందులు... కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల కదలికలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటివద్దకే మందులు సరఫరా అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ మెడికల్ రీటెయిలర్లకు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మందులకు సంబంధించిన బిల్లులను ఈమెయిల్ ద్వారా లైసెన్సుదారుడు పంపాల్సి ఉంటుందని తెలిపింది. విమానాలపై 14 వరకూ నిషేధం అన్ని అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, సరుకు రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకూ నిషేధించిన విషయం తెలిసిందే. -
ఆరోగ్య మిషన్ నిధులు పక్కదారి
- రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు సరిగా అమలు కావడంలేదు - కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలానీ అసంతృప్తి - తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై కేంద్రం మండిపడింది. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వైద్య,ఆరోగ్య పథకాలు కుంటుపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఎన్హెచ్ఎం కార్యక్రమాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. కేంద్రం విడుదల చేసిన ఎన్హెచ్ఎం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుందని, వాటిని విడుదల చేయడం లేదని అన్నట్లు తెలిసింది. వాటా విడుదల చేయకుంటే కష్టమే రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ, ‘ఆశ’ కార్యకర్తలకు జీతాలు, వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలుకు ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి విడుదలైన నిధులు ఏమయ్యాయని మనోజ్ జలాని నిలదీసినట్లు తెలిసింది. ఎన్హెచ్ఎం కింద గతేడాది రూ.143.28 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వవాటాతో కలిపి ఎన్హెచ్ఎంకు రూ. 458 కోట్లు సమకూరాల్సి ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో జేఎస్వై కింద ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి ప్రోత్సాహకానికి ఇబ్బందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జేఎస్ఎస్కే, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య రంగానికి సంబంధించిన అత్యవసర నిధులను పక్కదారి పట్టించడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర వాటాను విడుదల చేయాలని రాజీవ్‌శర్మను కోరినట్లు తెలిసింది. సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.