సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉపవేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి.
మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు ఈ రకం కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment