న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 431 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,47,325కు పెరిగింది. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,43,928కు చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,923కు తగ్గింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.64 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా దేశంలో 3,25,60,474 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.33 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మరో 15,79,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా 54,77,01,729 కరోనా టెస్ట్‌లు పూర్తిచేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.94 శాతంగా నమోదైంది. గత 17 రోజులుగా ఈ రేటు మూడు శాతం కంటే తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. వారపు పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment