న్యూఢిల్లీ: ఇతర దేశాలకు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్‌ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించించింది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి బారిన పడకుండా శుభ్రతను పాటించే క్రమంలో శానిటైజర్‌ల వాడకం ప్రప్రథమంగా మారింది. అంతేగాక దేశీయ మార్కెట్‌లలో వీటి లభ్యతను కూడా పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్‌కు మందు లేకపోవడం వ్యక్తిగత శుభ్రత పాటించడమే విరుగుడని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు ప్రజలంతా వ్యక్తి శుభ్రతను పాటించడం పరిపాటిగా చేసుకున్నారు. (మద్యం ప్రియులకు భారీ షాక్..)
దీంతో క్రిమీ సంహారినిగా పనిచేసే శానిటైజర్ల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ మార్కెట్‌ల ఉత్పత్తి, విక్రయంలో మార్చి, ఏప్రిల్‌లో శానిటైజర్ మొదటి స్థానంలో నిలిచింది. కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం నాణ్యమైన శానిటైజర్లను సరఫరా చేసే పేరున్న కంపెనీలు మూత పడటంతో, అవి మార్కెట్‌లోకి అందుబాటులో లేకుండా పోయాయి. కొన్ని కంపెనీలు ఆల్కాహాల్ శాతం అధికంగా ఉన్న శానిటైజర్‌లను ఉత్పత్తి చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
ఇక లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు కూడా బంద్ కావడంతో మందు బాబులకు మద్యం అందుబాటులో లేకపోవడంతో ఆల్కాహాల్ శానిటైర్‌లను మందుల తీసుకుని ప్రాణామీదకు తెచ్చుకున్న ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గత నెలలో, కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని 29 ఏళ్ల పీహెచ్‌డి చేస్తున్న విద్యార్థి మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ దగ్గు మందులో కలుపుకుని తాగి మరణించాడు. దీంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు శానిటైజర్లు, ఇతర ఆల్కహాల్‌కు సంబంధించిన ద్రవాలు తాగోద్దని ప్రజలను పదేపదే విజ్ఞప్తి చేస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. (శానిటైజర్ క్యాన్‌లతో వెళ్తున్న లారీ దగ్ధం)
Comments
Please login to add a commentAdd a comment