ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్‌డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి.
నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు.
जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका।
— Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023
Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles.
यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9
సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.
ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు
Comments
Please login to add a commentAdd a comment