ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం | Heavy Rain in Delhi-NCR | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం

Published Sun, Jul 21 2024 9:03 AM | Last Updated on Sun, Jul 21 2024 12:12 PM

Heavy Rain in Delhi-NCR

దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారత వాతావరణశాఖ జూలై 22 నుంచి 24 వరకు ఢిల్లీ​కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీలు,  కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల మధ్య ఉండవచ్చు. జూలై 25, 26 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 34, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల మధ్య ఉండవచ్చు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విపరీతమైన వేడి వాతావరణానికి తోడు కాలుష్య తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులుగా మారుతుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement