
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఆపదలో ఆదుకునే అంబులెన్స్ మృత్యు శకటమైంది. స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చిత్రదుర్గ పట్టణానికి సమీపంలో జరిగింది. హొళల్కెరె రోడ్డు తిరుమల డాబా వద్ద హొళెల్కెరె నుంచి కాంతరాజు (22), శ్రీకాంత(20), నంజుండ(20) అనే యువకుడు స్కూటీపై చిత్రదుర్గకు వెళ్తున్నారు.
ఎదురుగా వచ్చిన అంబులెన్స్ వారిని వేగంగా ఢీకొనడంతో దూరంగా ఎగిరిపడి చనిపోయారు. అంబులెన్స్ చెట్టును ఢీకొని నిలిచిపోగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంబులెన్స్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment