బెంగళూరు: కర్ణాటలో ఓ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్‌బూత్‌ను ఢీకొట్టింది. ఉడిపి జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్ గేట్ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు.
అంబులెన్స్ టోల్‌గేట్‌కు దగ్గరగా రావడంతో చివర ఉన్న మూడో బారికేడ్‌ను తొలగించేందుకు ఓ సిబ్బంది ప్రయత్నించాడు. అప్పటికే అతి వేగంతో వస్తున్న అంబులెన్స్ వర్షం పడి తడిగా ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనం టైర్లు టర్న్ అవ్వడంతో టోల్‌బూత్ క్యాబిన్ వైపు దూసుకెళ్లి బొల్తా కొట్టింది. అంబులెన్స్‌లోని పరికరాలు అన్ని చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి.
చదవండి: వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు
ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతోపాటు రోడ్డుపై ఉన్న టోల్‌గేట్ సిబ్బంది మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
#Karnataka Tragic Video of Ambulance Hitting Toll Plaza in Karnataka's Udupi Emerges, 4 Dead
— India.com (@indiacom) July 20, 2022
(Viewer discretion advised) pic.twitter.com/LfOOP5sRAm
#WATCH | Karnataka: Four people were injured after a speeding ambulance toppled at a toll gate, near Byndoor. The Ambulance was carrying a patient to Honnavara. Further details are awaited.
— ANI (@ANI) July 20, 2022
(Source: CCTV) pic.twitter.com/M3isDaX7Eg
Comments
Please login to add a commentAdd a comment