
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రాయచూరు(కర్ణాటక): బొలెరో ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం తాలూకాలోని లింగన ఖాన్ దొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంటి వద్ద సిద్దార్థ(3)అనే చిన్నారి ఆడుకుంటుండగా అదే సమయంలో ఒక బొలెరో వాహనం రివర్స్ చేసుకునే క్రమంలో టైర్లు బాలుడిపైకి ఎక్కాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆడుకుంటున్న పిల్లవాడు అంతలోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ఉడాయించాడు. ఇడపనూరు ఎస్‌ఐ కరెమ్మ ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment