
ధన్విక్(ఫైల్)
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేడి సాంబార్ మీదపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నపట్టణ తాలూకా దేవరహొసహళ్లి గ్రామంలో జరిగింది. చౌడేశ్, రాధ దంపతుల కుమారుడు ధన్విక్ మృతి చెందిన చిన్నారి.
సోమవారం రాత్రి ఇంట్లో స్టౌ మీద మరుగుతున్న సాంబార్ పాత్రను ధన్విక్ లాగడంతో ఒంటిమీద సాంబార్ పడి తీవ్ర గాయాలయ్యాయి. మండ్యలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందాడు.