![Two Girls Drown To Death Tragedy In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/9/girls.jpg.webp?itok=rkpqLJaG)
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): చెరువులో కాలుజారిపడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా మారిహాళ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సాంబ్రా నివాసులు నేత్రకొళవి (8), ప్రియాకొళవి (6) మృతి చెందారు.
దీపావళి సందర్భంగా పూజకు ఉపయోగించిన పూజా సామాగ్రిని నీటిలో వదలడానికి అక్క సుధ (10)తో కలిసి చెరువు వద్దకు వెళ్లిన ప్రియ, నేత్ర ఇద్దరూ అరటి చెట్టును చెరువు నీటిలో వదిలే క్రమంలో కాలుజారి నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు బాలికల మృతదేహాలను వెలికితీసారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment