
ముంబై: తమ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ బారినపడి చెన్నైలో మృతి చెందినట్లు విమానయాన సంస్థ ఇండిగో శనివారం ప్రకటించింది. అయితే, పూర్తి వివరాలు బయటపెట్టలేదు. 55 ఏళ్లకుపైగా వయసున్న అతడు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని, శుక్రవారం చనిపోయాడని సమాచారం. 2006 నుంచి ఇండిగో సంస్థలో పనిచేస్తున్నాడని తెలిసింది. దేశం లో ఒక విమానయాన సంస్థ ఉద్యోగి కరోనాతో చనిపోవడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు.