లాస్‌ఏంజెల్స్ : మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మెవెదర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జోసీ హారిస్ సబర్బన్ లాస్‌ఏంజెల్స్‌లోని తన నివాసంలో మరణించారు. మెవెదర్‌తో ముగ్గురు సంతానం కలిగిన జోసీ హారిస్ (40) తన ఇంట్లోనే వాక్‌వేలోని ఓ వాహనంలో విగతజీవిగా పడిఉన్నారని లాస్‌ఏంజెల్స్ కౌంటీ షరీఫ్ అలెక్స్ విలెనువా వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. 2010లో మెవెదర్ హారిస్‌ను తీవ్రంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. తాను హారిస్‌పై చేయిచేసుకున్నానని, ఆమె చేతిని మెలితిప్పానని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. గృహ హింస ఆరోపణలపై రెండు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్న హారిస్‌ను నియంత్రించేందుకే తానలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక హారిస్ 2015లో మెవెదర్‌పై పరువునష్టం దావా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment