మోసం చేశాడంటూ ప్రియురాలి పగ
బెళగావిలో సంచలనం
బనశంకరి: ప్రియడు మరో మహిళ మాయలో పడి తనకు దూరమయ్యాడనే కసితో ఓ యువతి తుపాకీతో కాల్పులు జరిపించింది. సినిమా రేంజ్‌లో జరిగిన సంఘటన బెళగావిలోనిది. ప్రేమికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
వివరాలు.. బెళగావి తిళకవాడి ద్వారకనగరవాసి ప్రణీత్‌కుమార్ (31), మెడికల్ రెప్‌గా పనిచేస్తాడు. బుధవారం రాత్రి మహంతేశనగర కేఎంఎఫ్ డైరీ వద్ద గల స్నేహితురాలు స్మిత ఇంటికి భోజనానికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా, మాజీ ప్రియురాలు అక్కడికి వచ్చింది. రాగానే ప్రణీత్‌తో గొడవకు దిగింది, స్మిత ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. కానీ మాజీ ప్రియురాలు వెంట వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రణీత్‌ను కొట్టి, తుపాకీతో కాల్పులకు దిగారు. మొదట బుల్లెట్లు ప్రణీత్ చెవిపక్క నుంచి దూసుకెళ్లడంతో ఏమీ కాలేదు. దీంతో దుండగులు మళ్లీ కాల్పులకు అతని తొడలోకి తూటా దూసుకెళ్లింది. మళ్లీ కాల్చడానికి యత్నించగా తుపాకీ జామ్ కావడంతో నలుగురూ వెళ్లిపోయారు.
పోలీసు కమిషనర్ ఆరా
రక్తపు మడుగులో పడిఉన్న ప్రణీత్‌ను స్మిత బిమ్స్ ఆసుపత్రికి తరలించి మాళమారుతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ప్రణీత్ నుంచి సమాచారం సేకరించారు. నగర పోలీస్ కమిషనర్ యడా మార్టీన్ ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. డీసీపీ రోహన్ జగదీశ్ ఘటనాస్థలిని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. త్వరగా దుండగులను పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు. దుండగులు వాడిన గన్ గురించి దర్యాప్తు చేపడుతున్నామని, ప్రేమ గొడవలే కారణమని చెప్పారు. ప్రేమ గొడవ, తుపాకీ కాల్పుల వ్యవహారం నగరంలో కలకలం రేపింది. చిన్న చిన్న విషయాలకే తుపాకులను వాడడంపై నగరవాసులు సంభ్రమం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment