మన చుట్టూ తరిచి చూస్తే స్ఫూర్తిని కలిగించే ఎన్నో కథలు మనమందు మెదులుతాయి. అలాంటి ప్రేరణ కలిగించే కథ మైసూరులో చోటు చేసుకుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. ఆ తర్వాత ఓ చిన్నారిని దత్తత తీసుకుని తల్లిగా అద్భుతమైన అమ్మాయిగా తీర్చిదిద్ది సమాజమే సెల్యూట్ చేసేలా ఎదిగింది. అవమానాలను, అసమానతలకు తట్టుకుని..శక్తిమంతమైన మహిళగా ఎదుగుతూ మరొకరికి మంచి జీవితాన్ని ఇచ్చే మహత్తర కార్యం చేసి శెభాష్ అనిపించుకుంది. ఎవరా ట్రాన్స్ జెండర్ అంటే..
ఆ ట్రాన్స్‌జెండర్ పేరు షబనా అక్రం పాషా. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బీబీ ఫాతిమాను దత్తత తీసుకుంది. నిజానికి షబనా ట్రాన్స్‌జెండర్‌గా చిన్ననాటి నుంచి ఎన్నో చిత్కారాలు, అవమానాల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడిపింది. బతకటం కోసం బిక్షాటన వృత్తిని కూడా చేసింది. అలాంటి షబానా తమలాంటి వాళ్లలో ఉన్న మంచి కోణాన్ని పరిచయం చేసింది.
ఒకసారి ఫబానా దగ్గరి బంధువు నలుగురు కూతుళ్లను విడిచిపెట్టేసి పరారయ్యాడు. అయితే షబానా తాను బతుకు ఈడ్చటమే గగనం అన్న పరిస్థితుల్లో ఉండి కూడా ఏ మాత్రం సంకోచించకుండా ఆ నలుగురిని దత్తత తీసుకుంది. వారిని తన పిల్లలుగా పెంచడం ప్రారంభించింది. వారికి తల్లిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దానిపైన దృష్టిపెట్టింది. అలా ఒక్కో పైసా పోగు చేసి బీబీ ఫాతిమా అనే అమ్మాయిని బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది.
ఈ క్రమంలో కూడా షబానా ఎన్నో అవమానాలు ఎదుర్కొక తప్పలేదు. ఎందుకంటే షబానే అనే ట్రాన్స్ జెండర్ కూతురు కాబట్టి ట్రైనింగ్‌లో అందరితో కాకుండా ఫాతిమాకు వేరుగా శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం గంటలు తరబడి ఇన్‌స్టిట్యూట్ వెలుపలే వేచి ఉండాల్సి వచ్చేది. అయినా సరే ఈ తల్లి కూతుళ్ల ద్వయం 'తగ్గేదే లే' అంటూ ఆ అసమానతలు, వివక్షతను దాటి ప్రపంచానికి తామెంటో చూపించారు. శక్తిమంతమైన మహిళలుగా ఎదిగారు.
షబానా కష్టం ఫలించి ఫాతిమా రాష్ట్ర, జాతీయ కిక్‌బాక్సర్‌గా రాణించడమే గాక ఏకంగా మొత్తం 23 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఫాతిమాకు 20 ఏళ్లు. ఆమె పెంచిన కూతురు విజయంతో ఒక్కసారిగా షబానా ట్రాన్స్‌జెండర్ పేరు ప్రపంచానికి తెలిసేలా మారుమ్రోగింది. ఈ మేరకు షబానా మాట్లాడుతూ.." మా జీవితాలు తరచు వివక్ష, కళకంతో దెబ్బతిన్నాయి. అయినా మేము గొప్ప ప్రేమ, బాధ్యతను విస్మరించం. కేవలం ఈ అమ్మాయిలను దత్తత తీసుకుని తీర్చదిద్ది.. మాలాంటి వాళ్లను మనుషులుగా గుర్తించండి అని చెప్పాలనుకుంటున్నా. అన్ని రకాలుగా బాగున్న వాళ్లకంటే తామలాంటి వాళ్లే ఎంతో ఉదారంగా ఉంటారని చాటి చెప్పాలనుకున్నా అంటూ ఆవేదన చెప్పుకొచ్చింది." షబానా.
మనలో చాలామంది ఆడపిల్ల అనగానే భారం అనే భావన నుంచి బయటపడటం లేదు. ఒకరికి మించి ఇద్దరు ఆడపిల్లలు అంటే నోరు బార్లా తెరుస్తారు.. వెంటనే చేతులు దులుపుకునే యత్నం చేస్తారు. కానీ షబానా తన బతకు గడవటమే కష్టంగా ఉన్నా..ఆ అమ్మాయిలను దత్తత తీసుకోవడమే గాక వారికి మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయం పడటం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం కదూ.
Comments
Please login to add a commentAdd a comment