మొబైల్‌ చోరీ చేశాడంటూ చావబాదారు.. | Elderly Dalit Man Brutally Beaten Up | Sakshi
Sakshi News home page

మొబైల్‌ చోరీ చేశాడంటూ చావబాదారు..

Published Tue, Mar 17 2020 12:10 PM | Last Updated on Tue, Mar 17 2020 12:43 PM

Elderly Dalit Man Brutally Beaten Up - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

జైపూర్‌ : మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్‌లోని సికార్‌ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్‌ లాల్‌ మీనా (75) సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్‌, భరత్‌భూషణ్‌, దిలీప్‌ సింగ్‌, సందీప్‌ మీనా, సందీప్‌ యాదవ్‌లను అరెస్ట్‌ చేశామని అదనపు ఎస్పీ దినేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఓ హోటల్‌ వద్ద తమ మొబైల్‌ ఫోన్‌ను మదన్‌ లాల్‌ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి : మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement